iDreamPost
android-app
ios-app

EMI చెల్లింపుదారులకు భారీ ఊరట.. బ్యాంకుల ఆటలకు RBI చెక్..!

  • Published Apr 04, 2024 | 9:51 AM Updated Updated Apr 04, 2024 | 9:51 AM

ఈఎంఐ చెల్లింపుదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ శుభవార్త చెప్పింది. వారికి ఊరట కలిగించేలా.. బ్యాంకుల ఆటలకు చెక్ పెట్టేందుకు రెడీ అయ్యింది. ఆ వివరాలు..

ఈఎంఐ చెల్లింపుదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ శుభవార్త చెప్పింది. వారికి ఊరట కలిగించేలా.. బ్యాంకుల ఆటలకు చెక్ పెట్టేందుకు రెడీ అయ్యింది. ఆ వివరాలు..

  • Published Apr 04, 2024 | 9:51 AMUpdated Apr 04, 2024 | 9:51 AM
EMI చెల్లింపుదారులకు భారీ ఊరట.. బ్యాంకుల ఆటలకు RBI చెక్..!

అత్యవసరంగా డబ్బు అవసరం అయినా.. బయట ఇంట్రెస్ట్ రేటు అధికంగా ఉంటుందనే కారణంతో చాలా మంది బ్యాంకులు, నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ కంపెనీల దగ్గర నుంచి రుణాలు తీసుకుంటూ ఉంటారు. ఇక ఉద్యోగుల్లో చాలా మంది లోన్ లు తీసుకున్న వారే ఉంటారు. ఎక్కువ మొత్తంలో లోన్ తీసుకుని.. ప్రతి నెల కొద్ది కొద్దిగా ఈఎంఐ రూపంలో చెల్లించే వెసులుబాటు ఉండటం వల్ల చాలా మంది దీనికే మొగ్గు చూపుతారు. అయితే ఈఎంఐ చెల్లింపుల్లో ఏమాత్రం ఆలస్యం జరిగినా.. ఆయా సంస్థలు కస్టమర్లకు చుక్కలు చూపిస్తాయి. ఫైన్ల పేరుతో భారీగా దండుకుంటాయి. అదుగో వాటికి చెక్ పెట్టేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగింది. ఆ వివరాలు..

ఆర్బీఐ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల బ్యాంక్ లు, ఫైనాన్స్ సంస్థల నుంచి నుంచి రుణాలు తీసుకున్న వారికి భారీ ఊరట కలగనుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభం అనగా ఏప్రిల్ 1 నుంచి లోన్ ఈఏంఐల చెల్లింపుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు లోన్ చెల్లింపు గడువు నాటికి డిఫాల్ట్, ఇతర రుణ నిబంధనలను ఉల్లంఘించినందుకు రుణగ్రహీతలపై అదనపు జరిమానాలు విధించకూడదు. అంటే ఈఎంఐ చెల్లింపు ఆలస్యం అయితే ఫైన్ కట్టాల్సిన పని లేదు అన్నమాట.

సాధారణంగా నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ మెుత్తాన్ని ఆలస్యంగా చెల్లించినందుకు బ్యాంకులు ఖాతాదారుల నుంచి జరిమానా వసూలు చేస్తాయి. అయితే ఆర్‌బీఐ కొత్త ఆదేశాల వల్ల ఇకపై బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు.. ఈఎంఐ ఆలస్యంపై జరిమానా, వడ్డీని వసూలు చేయకుండా నిరోధిస్తుంది. లోన్ డిఫాల్ట్ సమయంలో వడ్డీ రేటుకు అదనపు ఛార్జీలను జోడించటాన్ని సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే నిషేధించింది. పెనాల్టీ ఛార్జీలపై ఎలాంటి అదనపు వడ్డీని వసూలు చేయవద్దని బ్యాంకులను కోరింది.

ఈఎంఐ చెల్లింపుల ఆలస్యం అయితే జరిమానా విధించడాన్ని క్రెడిట్ క్రమశిక్షణకు సంబంధించినదిగా రిజర్వు బ్యాంక్ పేర్కొంది. అయితే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు దీనిని ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉపయోగించటాన్ని కేంద్ర బ్యాంకు తప్పుపట్టింది. అంతేకాక బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి పెనాల్టీలు, ఇతర ఛార్జీలు విధిస్తున్నట్లు గమనించింది. ఇక గత కొంత కాలంగా ఇలాంటి సంఘటనలపై ఫిర్యాదులు పెరగటంతో రిజర్వు బ్యాంక్ రంగంలోకి దిగింది. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలకు చెక్ పెట్టే దిశగా చర్యలు తీసుకుంది.