Arjun Suravaram
RBI MPC Meeting Highlights: కేంద్ర ఆర్థిక సంస్థ అయినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరచూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే కొన్నినిర్ణయాలు ప్రజలు శుభవార్తలే అని చెప్పొచ్చు. అలానే తాజాగా ఆర్బీఐ సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పింది.
RBI MPC Meeting Highlights: కేంద్ర ఆర్థిక సంస్థ అయినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరచూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే కొన్నినిర్ణయాలు ప్రజలు శుభవార్తలే అని చెప్పొచ్చు. అలానే తాజాగా ఆర్బీఐ సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పింది.
Arjun Suravaram
భారత దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్న సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని ఆధీనంలోనే దేశంలోని అన్ని ఆర్థిక సంస్థలు పని చేస్తాయి. అంతేకాక నగదు చలామణితో పాటు అనేక ఆర్థిక పరమైన అంశాల్లో ఆర్బీఐ నిర్ణయాలే కీలకం గా ఉంటాయి. ఇది ఇలా ఉంటే.. ఆర్బీఐ తరచూ వివిధ కీలక సమావేశాలు నిర్వహిస్తుంటుంది. అలానే ఇటీవలే కొన్ని రోజుల నుంచి ఆర్బీఐ కీలక సమావేశాలు జరుగుతోన్నాయి. ఈ క్రమంలోనే నేడు జరిగిన సమావేశంలో డబ్బుల విషయంలో సామాన్యులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ సమావేశాలు నిర్వహిస్తుంది. జూన్ 6వ తేదీన ప్రారంభమైన ఈ సమావేశాలు నేటితో ముగిశాయి. ఈ క్రమంలోనే శుక్రవారం కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కొన్ని కీలక ప్రకటనలు చేశారు. యూపీఐ లావాదేవీల పరిమితి పెంపు విషయంలోఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ లావాదేవీల పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ పెంపు అనేది అందరికీ కాదని, కేవలం ట్యాక్స్ పేయర్స్ కి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. పన్ను చెల్లింపు దారులకు రూ. లక్ష నుంచి రూ.5 లక్షల వరకు యూపీఐ లావాదేవీల జరుపుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.
తాజా నిర్ణయంతో పెద్ద ఎత్తున, లక్షల్లో ట్యాక్స్ బకాయిలు ఉన్న వారికి త్వరగా పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ నిర్ణయం సామాన్యుపై పెద్దగా ప్రభావం చూపకపొవచ్చు. అలానే చెక్ క్లియరెన్స్ విషయంలోనూ ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. గతంలో మాదిరిగా చెక్ ఇష్యూ అయిన తర్వాత క్లియరెన్స్ కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. చెక్ తీసుకున్న కొన్ని గంటల్లోనే క్లియరెన్స్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుతం చెక్ క్లియరెన్స్ కోసం బ్యాంకులు సీటీఎస్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇకపై చెక్ క్లియరెన్స్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయడం కోసం ‘ఆన్ రియలైజేషన్ సెటిల్మెంట్’ అనే కొత్త విధానాన్ని ఆర్బీఐ తీసుకురానుంది. ఈ విధానంతో కొన్ని గంటల్లోనే చెక్ క్లియరెన్స్ పూర్తవుతుంది. మొత్తంగా ఈ నిర్ణయం చాలా మందికి చెక్ క్లియరెన్స్ సమస్యలను తప్పించనుంది. ఇలానే ఈ సమావేశాల్లో రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయలేదు.
అదే విధంగా దేశంలో నిత్యవసర వస్తువులు, ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడంపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ధరల పెరుగుదల సామాన్య ప్రజలపై ప్రభావం చూపుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. అయితే వీటి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. రిటైల్ ఇన్‌ఫ్లేషన్ పై ఆర్బీఐ గవర్నర్ కీలక విషయాలను ప్రస్తావించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీపీఐ 4.5 శాతంగా, తొలి త్రైమాసికంలో 4.9 శాతంగా, రెండో త్రైమాసికంలో 3.8 శాతంగా, మూడో త్రైమాసికంలో 4.6 శాతంగా, నాల్గో త్రైమాసికంలో 4.5 శాతంగా రికార్డవుతుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. రిటైల్ ఇన్‌ఫ్లేషన్ 2 శాతం నుంచి 4 శాతంలోపు ఉండేలా చూసుకోవాలని ఆర్‌బీఐకి ప్రభుత్వం సూచించినన నేపథ్యంలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ తగ్గించడంపై దృష్టి సారిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. మొత్తంగా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.