Krishna Kowshik
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే నైజమే రతన్ టాటాను తిరుగులేని వ్యాాపారవేత్త మార్చింది. విలువలతో కూడిన వ్యాపారం చేసిన ఆయన దేశం గర్వించదగ్గ బిజినెస్ టైకూన్ గా అవతరించారు. కానీ అంతలోనే అనూహ్యంగా విడిచిపెట్టి వెళ్లిపోయారు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే నైజమే రతన్ టాటాను తిరుగులేని వ్యాాపారవేత్త మార్చింది. విలువలతో కూడిన వ్యాపారం చేసిన ఆయన దేశం గర్వించదగ్గ బిజినెస్ టైకూన్ గా అవతరించారు. కానీ అంతలోనే అనూహ్యంగా విడిచిపెట్టి వెళ్లిపోయారు.
Krishna Kowshik
దిగ్గజ వ్యాపార వేత్త, టాటా గ్రూప్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. సోమవారం తెల్లవారు జామున తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అర్థరాత్రి మరణించారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న పదానికి నిలువెత్తు రూపం ఆయన. రెస్ట్ తీసుకుని శ్రమజీవి టాటా. విలువలతో కూడిన వ్యాపారవేత్తగా, సామాజిక వేత్తగా, దానశీలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వ్యాపారం రంగంలో జీరో నెగిటివిటీ ఉన్న బిజినెస్ మ్యాన్ ఎవరైనా ఉన్నారంటే అది రతన్ టాటా మాత్రమే. ఆయన మరణవార్త భారత దేశాన్నే కాదు.. యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నైజం ఆయన సొంతం. ఎంతో మందికి యువతకు ఆయన మాటలు ప్రేరణగా నిలుస్తుంటాయి. అయితే మరణించే ముందు కూడా ఆయన ఉన్నతమైన సందేశాన్ని అందించారు. ఇవే ఆయన చివరి మాటలుగా నిలిచాయి.
రతన్ టాటా ఆసుపత్రిలో చేరారన్న వార్తలు రాగానే.. వ్యాపార వర్గాల్లో, అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. దీంతో వారికి భరోసా కల్గించేందుకు ఓ స్టేట్ మెంట్ రిలీజ్ చేశారు టాటా. ‘నా ఆరోగ్యం గురించి ఇటీవల పుకార్లు వ్యాపిస్తున్నాయని తెలుసు. ఈ వాదనలు నిరాధారమైనవి. నా వయస్సు రీత్యా సంబంధిత వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాను. ఆందోళన చెందొద్దు. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని మీడియా, ప్రజలను వేడుకుంటున్నాను’ అంటూ ఇన్ స్టాగ్రామ్‌లో నోట్ పంచుకున్నారు. తిరిగి ఆరోగ్యంగా వస్తారు అనుకుంటే.. అనూహ్యంగా అందరికీ దూరమై.. ఇండియన్స్‌ను శోక సంద్రంలో ముంచేశారు. ఆయన లేని లేటు పూడ్చలేమంటున్నారు సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు. యూత్ అయినా ఓ గొప్ప మార్గదర్శకుడ్నికోల్పోయామని చింతిస్తున్నారు.
భారత దేశాన్ని బ్రిటీష్ పరిపాలిస్తున్న కాలంలో ముంబయిలో 1937, డిసెంబర్ 28న రతన్ నావల్ టాటా జన్మించారు. ఆయనకు జిమ్మీ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడం వల్ల నాన్నమ్మ వీరిని పెంచింది. ముంబయిలోని క్యాంపియన్ స్కూల్లో విద్యనభ్యసించిన ఆయన.. అమెరికాలో ఆర్కిటెక్చర్ పూర్తి చేశారు. తనకెంతో ఇష్టమైన నాన్నమ్మకు అనారోగ్య సమస్యలు రావడంతో తిరిగి ఇండియాకు వచ్చారు టాటా. 1962లో వారసత్వ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. కింద స్థాయిలో పలు విభాగాల్లో పనిచేశారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. 1991లో టాటా గ్రూప్‌కు చైర్మన్‌గా మొదలైన ఆయన ప్రయాణం.. 2012లో పదవి విమరణ చేసేంత వరకు సక్సెస్ ఫుల్‌గా కొనసాగింది. కంపెనీని మిలియన్ డాలర్ల పవర్ హౌస్‌గా మార్చడంలో ఆయన కృషి ఎంతో ఉంది. ఆటో మొబైల్స్, టాటా కార్స్, టాటా స్టీల్, టీసీఎస్ ఇలా ఏ రంగంలో అడుగుపెట్టిన అక్కడ అందె వేసిన చేయిగా మారింది. ఆయన కేవలం వ్యాపార వేత్త మాత్రమే కాదు.. సామాజిక వేత్త, యానిమల్ లవర్ కూడా. దాతృత్వంలో ఆయనకు ఆయనే సాటి. టాటా ట్రస్ట్‌ల ద్వారా సంపదలో అధిక భాగం ధార్మిక సేవలకు కేటాయించేవారు.