Arjun Suravaram
ఈ మధ్యకాలంలో ప్రజలకు ఓలా, ర్యాపిడో, ఉబర్ అంతర్భాగమయ్యాయి. ఇవి క్యాబ్ బుకింగ్‌తో పాటు, ఆటోలు, బైక్‌ల ద్వారా కస్టమర్లకు సేవలందిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ర్యాపిడో సంస్థ ఆటో డ్రైవర్లకు ఓ శుభవార్త చెప్పింది.
ఈ మధ్యకాలంలో ప్రజలకు ఓలా, ర్యాపిడో, ఉబర్ అంతర్భాగమయ్యాయి. ఇవి క్యాబ్ బుకింగ్‌తో పాటు, ఆటోలు, బైక్‌ల ద్వారా కస్టమర్లకు సేవలందిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ర్యాపిడో సంస్థ ఆటో డ్రైవర్లకు ఓ శుభవార్త చెప్పింది.
Arjun Suravaram
ప్రస్తుతం కాలంలో జనాలు క్యాబ్ లను ఎక్కువ ఆశ్రయిస్తున్నారు. అలానే క్యాబ్ సర్వీస్ అందించే సంస్థలు కూడా వినియోగదారులకు అనేక ఆఫర్లను అందిస్తూ ఆకర్షిస్తున్నాయి. ఉబర్, ర్యాపిడో, ఓలా వంటి సంస్థలో క్యాబ్ సర్వీస్ ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ర్యాపిడో సంస్థ సరికొత్త పోటీకి తెరలెపింది. ర్యాపిడో ఆటో డ్రైవర్లకు అది శుభవార్త అని చెప్పవచ్చు. మరి.. ర్యాపిడో సంస్థ ఆటో డ్రైవర్లకు చెప్పిన ఆ గుడ్ న్యూస్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ర్యాపిడో సంస్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రయాణికులకు బైక్, ఆటో సేవలను ర్యాపిడో సంస్థ అందిస్తుంది. ఎక్కువమంది జనానికి సేవలు అందించి.. అతి తక్కువ సమయంలో మార్కెట్‌ను విస్తరించడమే టార్గెట్‌గా ఈ సంస్థ పని చేస్తుంది. క్యాబ్ సర్వీసుల్లో ఉబర్, ఓలా సంస్థలు ఆధిపత్యం చలాయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సంస్థలతో పోటీ పడబోతోంది ర్యాపిడో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా ర్యాపిడో ఆటో డ్రైవర్ల విషయంలో కూడా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ర్యాపిడో ఆటో డ్రైవర్ల నుంచి జీవిత కాలం పాటు ఎటువంటి కమీషన్ తీసుకోకుండా సేవలు అందిస్తామని ప్రకటించింది.
అయితే అలా జీవిత కాలం పాటు కమీషన్ ఇవ్వకుండా ఉండేందుకు ఆటో డ్రైవర్లు ఓ పని చేయాల్సి ఉంటుంది. డ్రైవర్ల లాగిన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుందని ఆ సంస్థ వెల్లడించింది. అయితే ఈ ఫీజు అనేది మాత్రం నగరాన్నిబట్టి ఉంటుంది. నగరాన్ని బట్టి ఈ ఫీజు రోజుకు రూ.9 నుంచి రూ.29 మధ్య ఉంటుంది. బైక్ రైడింగ్ ప్రారంభించిన ర్యాపిడో సంస్థ గతేడాది డిసెంబర్ లో క్యాబ్ లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అలా క్యాబ్ బుకింగ్ సేవల రంగంలోకి కూడా ర్యాపిడో సంస్థ ప్రవేశించింది. ఈ ర్యాపిడో సంస్థ క్యాబ్ డ్రైవర్ లకు జీరో కమీషన్ మోడల్ ను అమలు చేస్తున్నట్లు పేర్కొంది.
ఆ మోడల్ ను ఆటో డ్రైవర్లకూ కూడా అమలు చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇక పలు అంశాలను ర్యాపిడో సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం రోజూ 5 లక్షలకు పైగా ఆటో రైడ్‌లను ర్యాపిడో సులభతరం చేస్తోంది. ఇలాంటి సమయంలో ఆఫ్‌లైన్ ఆటో డ్రైవర్లనూ కూడా తన ప్లాట్‌ఫారమ్‌లోకి తీసుకురావాలని లక్ష్యంగా ర్యాపిడో పెట్టుకుంది. ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి మాట్లాడుతూ.. సాస్ ప్లాట్‌ఫారమ్ ఆటోడ్రైవర్ల సంప్రదాయ కమీషన్ విధానాన్ని మారుస్తోందని ఆయన తెలిపారు.
ప్రస్తుతం ర్యాపిడో క్యాబ్ డ్రైవర్లు సాస్ మోడల్ ఆధారిత డిస్కవరీ ప్లాట్‌ఫారమ్‌ను వినియోగిస్తున్నారు. ఇది ఇప్పుడు ఆటో డ్రైవర్‌లకు కూడా అందుబాటులో రానుంది. ఇది ఆటో డ్రైవర్లు మరింత సమర్థవంతమైన, నమ్మకమైన డిజిటల్ అనుభవాన్ని పొందేందుకు అనుమతిస్తుందని ఆయన పేర్కొన్నారు. మరి.. ఆటో డ్రైవర్ల విషయంలో ర్యాపిడో తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.