iDreamPost
android-app
ios-app

రూ.400 జీతానికి రేడియోలు రిపేర్ చేసేవాడు.. నేడు రూ.14 వేల కోట్ల కంపెనీకి ఓనర్

  • Published Mar 16, 2024 | 2:01 PM Updated Updated Mar 16, 2024 | 2:01 PM

ఒకప్పుడు రిపేరింగ్ షాప్ లో నెల కూలీగా చేసిన వ్యక్తి నేడు కోట్ల రూపాయిల కంపెనీకు వ్యవస్థాపకుడిగా ఎదిగాడు. అలాగే ప్రపంచ స్థాయిలో కోటీశ్వరుడిగా మారాడు ఇంతకి ఆయన ఎవరంటే..

ఒకప్పుడు రిపేరింగ్ షాప్ లో నెల కూలీగా చేసిన వ్యక్తి నేడు కోట్ల రూపాయిల కంపెనీకు వ్యవస్థాపకుడిగా ఎదిగాడు. అలాగే ప్రపంచ స్థాయిలో కోటీశ్వరుడిగా మారాడు ఇంతకి ఆయన ఎవరంటే..

  • Published Mar 16, 2024 | 2:01 PMUpdated Mar 16, 2024 | 2:01 PM
రూ.400 జీతానికి రేడియోలు రిపేర్ చేసేవాడు.. నేడు రూ.14 వేల కోట్ల కంపెనీకి ఓనర్

జీవితంలో పొట్టకూటి కోసం కష్టపడ్డవారు కొందరైతే.. భవిష్యత్తులో ఏదైనా సాధించాలనే తపనతో కష్టపడుతుంటారు కొందరు. అయితే ఈ రెండింటిలో పెద్ద తేడా ఏమి లేకపోయినా.. భవిష్యత్తులో ఏదైనా సాధించాలి అనే ఆలోచన మాత్రం మనిషిని మంచి ఉన్నత స్థాయిలో నిలబడుతుంది. ఎందుకంటే.. ప్రతిఒక్కరూ తమ ఆశయాలను నెరవెర్చుకోవడం కోసం తమ శక్తిని మించి కష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే ఎన్నో అవమానాలు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే అవి ఏవీ పట్టించుకోకుండా.. తమ లక్ష్యం పై మాత్రమే దృష్టి పెట్టేవాడు ఎప్పుడు నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటాడు. అసలు లైఫ్ లో సక్సెస్ ను చవి చూసిన వారెవరైనా మొదట జీరో నుంచే మొదలవుతారు. మరి  అలాంటి వారిలో  ‘కైలాష్’ కట్కర్ కూడా ఒకరు. ఒకప్పుడు రూ. 400కు కూలీగా పని చేసిన ఈ వ్యక్తి నేడు రూ. 14 కోట్ల కంపెనీకు ఓనర్ అయ్యాడు.  మరి జీరో నుంచి మొదలైన వ్యక్తి నేడు ప్రపంచ కోటీశ్వరుడిగా ఎలా మారాడో అతని సక్సెస్ వెనుక ఉన్న ఆసక్తికర రహాస్యలేమిటో తెలుసుకుందాం.

 ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ‘క్విక్ హీల్’ కు వ్యవస్థాపకుడే ఈ ‘కైలాష్ కట్కర్’. ఈయన మహారాష్ట్రలోని రహిమత్‌పూర్ గ్రామంలో జన్నించారు. కాగా, వీరి కుటుంబం ఆర్థిక పరిస్థితి కారణంగా..అతని చదువు 10వ తరగతిలోనే స్వస్తి చెప్పాల్సి వచ్చింది. దీంతో చదువు ఆపేసిన తర్వాత.. కైలాష్ పూణే వెళ్లారు. అక్కడ పొట్టకూటి కోసం కాలిక్యులేటర్లు, రేడియోలు రిపేర్ పని చేయడం ప్రారంభించారు. అప్పుడు అతని నెల జీతం రూ. 400 ఉండేది. అలా ఆ పనిలో చేరిన కొద్దికాలంలోనే కైలాష్ రేడియా రిపేరింగ్ లో నిష్ణాతుడయ్యారు. దీంతో అతను 1991లో.. రూ.15000 పెట్టుబడి పెట్టి తన సొంత షాప్ ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటి ఖర్చులతో పాటు,తన సోదరుడు సంజయ్ కట్కర్ చదువుకు సంబంధించిన ఖర్చులను కూడా చూసుకునేవారు.

Nadu Coolie is a world millionaire today

ఇక సొంతంగా షాప్ ని ప్రారంభించిన కైలాష్ ఓరోజు పనిమీద బ్యాంక్ కు వెళ్లగా.. అక్కడే మొదటిసారి కంప్యూటర్ ని చూశారు. అయితే బ్యాంకు లోని కంప్యూటర్లు కైలాష్ ని బాగా ఆకర్షించాయి. దీంతో వెంటనే షార్ట్ టర్మ్ కంప్యూటర్ కోర్సులో చేరారు. ఓ వైపు షాప్ ని రన్ చేస్తూనే కోర్సుని పూర్తి చేశాడు.అలాగే ఓ కంప్యూటర్ ని కూడా కొనుగోలు చేశారు. దీంతో పాటు సాఫ్ట్‌వేర్‌తో పాటు హార్డ్‌వేర్‌పై కూడా మంచి పరిజ్ఞానం సంపాదించారు. అక్కడికి కొన్ని రోజుల తర్వాత.. కైలాష్ కంప్యూటర్ రిపేరింగ్ పనిని కూడా ప్రారంభించారు. ఈ క్రమంలోనే.. 1993 సంవత్సరంలో CAT కంప్యూటర్ రిపేరింగ్ అండ్ సర్వీస్ పేరుతో తన సొంత షాప్ ని ప్రారంభించారు. కాగా, అప్పుడు కంప్యూటర్లు రిపేర్ చేస్తుండగా.. రిపేరింగ్ కోసం వచ్చిన చాలా కంప్యూటర్లు వైరస్ కారణంగా పాడైపోవడాన్ని కైలాష్ గమనించారు. ఆ క్షణం అతని మనసులో మరో ఆలోచన వచ్చింది. ఇక నుంచి యాంటీ వైరస్ తయారు చేసి అమ్మితే చాలా డబ్బు సంపాదించవచ్చని అభిప్రాయపడ్డారు.

అయితే కైలాష్.. కంపూట్యర్ సైన్స్ చదివిన తన సోదరుడు సంజయ్ కట్కర్ కి తన ఆలోచన చెప్పారు. దీంతో సోదరులిద్దరూ.. కలిసి తమ కంప్యూటర్ రిపేరింగ్ షాప్ లో యాంటీ వైరస్ ని డెవలప్ చేశారు. కాగా, రిపేరింగ్ కోసం వచ్చిన కంప్యూటర్లలో దానిని టెస్ట్ చేశారు. ఫలితాలు బాగానే రావడంతో.. 1995లో కైలాష్ తన మొదటి యాంటీ వైరస్ ప్రొడక్ట్ ని మార్కెట్లోకి విడుదల చేశాడరు. అయితే మొదట రూ 700లకు ఈ యాంటీ వైరస్ ను విక్రయించారు. ఆ తర్వాత యాంటీ వైరస్ కు మార్కెట్ నుంచి భారీ ఊహించనంత భారీ స్పందన రావడంతో.. సోదరులిద్దరూ తమ దృష్టి అంతా యాంటీ వైరస్‌పైనే సారించారు. ఇక 2007లో కైలాష్ తన కంపెనీ పేరును CAT కంప్యూటర్ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి క్విక్ హీల్ టెక్నాలజీస్‌గా మార్చారు. అదే నేడు క్విక్ హీల్ గా అనేక దేశాల్లో పని చేస్తోంది. పైగా దీని కార్యాలయాలు జపాన్, అమెరికా, ఆఫ్రికా, UAEలలో ఉన్నాయి. అంతేకాకుండా.. ఈ కంపెనీ 2016లో స్టాక్ మార్కెట్ లిస్ట్ లో ఉంది. మరి, కేవలం ఒక రిపేరింగ్ షాప్ లో కూలీగా చేసిన వ్యక్తి నేడు ఒక దిగ్గజ కంపెనీకు వ్యవస్థాపకుడుగా మారడంలో ఉన్న అతని కృషి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.