iDreamPost
android-app
ios-app

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

  • Published Nov 12, 2023 | 10:42 AM Updated Updated Nov 12, 2023 | 10:46 AM

పండుగ వేళ పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గోల్డ్ కొనాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

పండుగ వేళ పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గోల్డ్ కొనాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. దీపావళి పండుగ వేళ గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. దీపావళి, దంతేరస్ లను పురస్కరించుకుని పసిడి కొనుగోలు చేసే వారికి ఇదొక గొప్ప అవకాశం. బంగారం ధరలు పెరిగినా తగ్గినా కొనుగోలు డిమాండ్ మాత్రం తగ్గట్లేదు. పండుగలు, పెళ్లిల్లు, ఇతర శుభకార్యాలకు ఇబ్బడి ముబ్బడిగా బంగారం కొంటున్నారు. ఈ క్రమంలో నేడు ఆదివారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి కూడా అదే దారిలో పయనించింది. బంగారం, వెండి ధరలు తగ్గడం వినియోగదారులకు ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి. అసలు గోల్డ్ రేట్ ఎంత తగ్గింది? తులం ఎంత ఉంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రోజు మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ధర రూ. 450 తగ్గి రూ. 55,550 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారంపై రూ.460 తగ్గి రూ. 60,690 వద్ద అమ్ముడవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55,550 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 60,630 కు చేరింది. దేశ రాజధాని హస్తినలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,700కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 60,750 వద్ద అమ్ముడవుతోంది. ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,600 వద్ద ట్రేడ్ అవుతోంది.

బంగారంతో పాటు వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండిపై రూ. వెయ్యి తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 76,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 76,000. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాలలో కిలో వెండి రూ.73,000 కు చేరింది. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకుంటున్న ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోవడం వంటి కారణాలతో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటున్నాయి.