iDreamPost
android-app
ios-app

మళ్లీ వచ్చేస్తున్న కరిజ్మా.. సూపర్ లాంఛింగ్ ఆఫర్ తో..!

  • Published Aug 29, 2023 | 5:02 PM Updated Updated Aug 29, 2023 | 5:02 PM
  • Published Aug 29, 2023 | 5:02 PMUpdated Aug 29, 2023 | 5:02 PM
మళ్లీ వచ్చేస్తున్న కరిజ్మా.. సూపర్ లాంఛింగ్ ఆఫర్ తో..!

ఇప్పుడంటే రకరకాల పేర్లు, డిజైన్స్ తో స్పోర్ట్స్ బైక్స్, స్టైలిష్ బైక్స్ వస్తున్నాయి. కానీ, 2003 సమయంలో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న బైక్ అంటే టక్కున కరీజ్మా పేరు చెప్పేస్తారు. హీరోహోండా కంపెనీ తీసుకొచ్చిన కరీజ్మా, కరీజ్మా R అంటూ తీసుకొచ్చిన బైక్స్ కి మంచి మార్కెట్ లభించింది. ఆ తర్వాత 2009లో కరీజ్మా సిరీస్ లో ZMRని లాంఛ్ చేశారు. ఈ మోడల్ కు కూడా మంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత 2019లో కరీజ్మా సిరీస్ బైక్స్ ని ఆపేశారు. మళ్లీ ఇప్పుడు ఇన్నాళ్లకు కరీజ్మా సిరీస్ లో ఒక కొత్త బైక్ ని హీరో మోటోకార్ప్ లాంఛ్ చేసింది. పైగా లాంఛింగ్ సందర్భంగా మంచి ఆఫర్ ని కూడా ఇస్తోంది.

ప్రముఖ దేశీయ బైక్ తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ మంగళవారం కరీజ్మా XMR  210 పేరిట కొత్త బైక్ ని లాఛం చేసింది. ఈ బైక్ లుక్స్, డిజైన్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉంది. పైగా ధర విషయంలో కూడా ఈ బైక్ వాహనదారులకు బాగా నచ్చేస్తుంది. అంతేకాకుండా లాంఛింగ్ ఆఫర్ కింద ధర కూడా తగ్గింపు ప్రకటించారు. ఈ బైక్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఈ బైక్ ను బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ లాంఛ్ చేశారు. హృతిక్ ఈ బైక్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ కరీజ్మా ఎక్స్ఎమ్మార్ 210 మ్యాట్ ఫాంటర్ బ్లాక్, ఐకానిక్ ఎల్లో, టర్బో రెడ్ కలర్ ఆప్షన్స్ తో వస్తోంది.

ఈ బండి స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. హీరో మోటకార్ప్ ఈ మోడల్ కు 210సీసీ సరికొత్త ఇంజిన్ తో తీసుకొస్తోంది. అత్యంత శక్తివంతమైన 210సీసీ లిక్విడ్ కూల్డ్ డీవోహెచ్సీ ఇంజిన్ ను అమర్చారు. ఇది గరిష్టంగా 25.5 పీఎస్, 20.4ఎన్ఎం పీక్ టార్క్ తో వస్తోంది. ఈ ఇంజిన్ కు సరికొత్త 6 గేర్ బాక్స్ ను అమర్చారు. ఈ సిరీస్ లోనే చాలా పవర్ ఫుల్ మోడల్ గా కరీజ్మా ఎక్స్ఎమ్మార్ వస్తోంది. ఇది 160ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తోంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్లుగా ఉంది. ఇంక ఫీచర్స్ చూస్తే.. ఏబీఎస్, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ సిస్టమ్, ఆల్ న్యూ ఎల్ఈడీ లైట్స్, ఇండికేటర్స్, రైడర్ ప్రొటెక్షన్ కోసం స్నాజీ విండ్ స్క్రీన్, కాల్స్- నోటిఫికేషన్స్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నేవిగేషన్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్ స్టురమెంటర్ క్లస్టర్ వంటి ఆల్ న్యూ ఫీచర్స్ తో ఈ కరీజ్మా ఎక్స్ఎమ్మార్ 210 వస్తోంది.

ఈ మోడల్ ఇప్పుడు కేటీఎం ఆర్సీ200, సుజుకీ జిక్సర్, యమహా ఆర్15 వీ4.0 మోడల్స్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇంక ఈ బైక్ ధర విషయానికి వస్తే.. దీని ఎక్స్ షో రూమ్ ధర రూ.1,82,999గా నిర్ణయించారు. అయితే లాంఛింగ్ ఆఫర్ కింద ధరలో రూ.10 వేలు డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే మీరు కరీజ్మా ఎక్స్ఎమ్మార్ 210 బైక్ ని 1,72,999 ఎక్స్ షోరూమ్ ధరకే పొందవచ్చు. ఈ ధరని ఈవీ బైక్ మోడల్స్ తో పోలిస్తే చాలా తక్కువనే చెప్పచ్చు. లుక్స్ మార్చడమే కాకుండా.. పవర్ ఫుల్ ఇంజిన్ తో ఈ కరీజ్మాను మళ్లీ తీసుకురావడం అందరికీ ఆకట్టుకుంటున్న విషయం. బుకింగ్స్ ఓపెన్ కావడంతో ఈ బైక్ కోసం యూత్ ఎగబడుతున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet