iDreamPost

మీ పిల్లల చదువు, పెళ్లి కోసం పొదుపు చేయాలని భావిస్తున్నారా.. బెస్ట్ సేవింగ్ స్కీమ్స్ ఇవే!

  • Published Nov 15, 2023 | 2:20 PMUpdated Nov 15, 2023 | 2:20 PM

పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నారా.. వారి కోసం పిల్లల బాల్యం నుంచే పొదుపు చేయాలని భావిస్తున్నారా.. అలాంటి వారి కోసమే ఈ కథనం. పిల్లల కోసం బెస్ట్‌ సేవింగ్‌ స్కీమ్స్‌ వివరాలు మీ కోసం...

పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నారా.. వారి కోసం పిల్లల బాల్యం నుంచే పొదుపు చేయాలని భావిస్తున్నారా.. అలాంటి వారి కోసమే ఈ కథనం. పిల్లల కోసం బెస్ట్‌ సేవింగ్‌ స్కీమ్స్‌ వివరాలు మీ కోసం...

  • Published Nov 15, 2023 | 2:20 PMUpdated Nov 15, 2023 | 2:20 PM
మీ పిల్లల చదువు, పెళ్లి కోసం పొదుపు చేయాలని భావిస్తున్నారా.. బెస్ట్ సేవింగ్ స్కీమ్స్ ఇవే!

ఒకప్పుడంటే ఇప్పుడున్నంతగా ఖర్చులు లేవు.. ఆదాయం కూడా ఎక్కువగా ఉండేది కాదు. ఏ పూటకాపూట కడుపు నిండితే చాలు అన్నట్లుగా ఉండేవి పరిస్థితులు. పొదుపు సంగతి దేవుడెరుగు.. ఆకలేస్తే.. పట్టెడన్నం దొరికితే చాలు అన్నంత దారుణంగా ఉండేవి పరిస్థితులు. దాంతో జనాలు పొదుపు గురించి పెద్దగా ఆలోచించేవారు కారు. అయితే గత కొన్నాళ్లుగా ఈ పరిస్థితులు మారాయి. జనాల వద్ద ఆదాయం పెరిగింది. దాంతో ఇన్సురెన్స్‌, పొదుపు స్కీమ్‌లలో చేరడం ప్రారంభించారు. ఇక కరోనా తర్వాత ఈ పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చింది. సంపాదన ఎంత తక్కువైనా సరే.. ఎంతో కొంత పొదుపు చేసేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపుతున్నారు.

మరీ ముఖ్యంగా బిడ్డల భవిష్యత్తు అవసరాలు అనగా వారి చదువు, విదేశీయానం, పెళ్లి కోసం ఎంతో కొంత మొత్తంలో క్రమం తప్పుకుండా పొదుపు చేస్తున్నారు. అలాంటి వారి కోంస ఇది. మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే ఐదు ఉత్తమ పొదుపు పథకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సుకన్య సమృద్ధి యోజన..

ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అత్యుత్తమ పొదుపు పథకం సుకన్య సమృద్ధి యోజన. పదేళ్లలోపు ఆడపిల్లల కోసం రూపొందించిన ఈ స్కీమ్‌ చిన్న మొత్తాల పొదుపు పథకం. బేటీ బచావో బేటీ పడావోలో భాగంగా 2011లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకు వచ్చింది. తమ కుమార్తెల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు.. బాలికల చిన్నతనం నుంచే ఎంతో కొంత పొదుపు చేసేలా చేయడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. దీనిలో చేరాలనుకునేవారి కోసం బ్యాంకుల, పోస్టాఫీసుల్లో ఈ పథకం అందుబాటులో ఉంది.

దీనిలో చేరాక.. కనీసం నెలకు రూ.250 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు పొదుపు చేయవచ్చు. కనీస టెన్యూర్ 21 ఏళ్ల వరకు ఉంటుంది. లేదా బాలికకు 18 ఏళ్ల వయసు లేదా పెళ్లి అయ్యే వరకు పొదుపు చేయాల్సి ఉంటుంది. ఏదైన దురదృష్టకరమైన పరిస్థితులు తలెత్తితే.. ముందుగానే పొదుపు మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చు.

యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్

యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనేవి రెండు రకాల ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఇవి బీమా కవరేజీ కల్పిస్తూనే పెట్టుబడి అవకాశం కూడా అందిస్తుంది. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ద్వారా పాలసీదారులు తమ ప్రీమియంలో కొంత భాగాన్ని మార్కెట్ లింక్డ్ ఫండ్లలో పెట్టుబడి పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ ఫండ్స్ పని తీరు మీద రిటర్న్‌ ఆధారపడి ఉంటాయి.

యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ద్వారా.. తల్లిదండ్రులు తమ పిల్లలకు బీమా కవరేజీ ఇవ్వడంతో పాటు పెట్టుబడి అవకాశాన్ని కూడా కల్పించవచ్చు. ఇందులో లాకిన్ పీరియడ్ 5-10 ఏళ్ల మధ్య ఉంటుంది. ఇవి పిల్లల చదువు, పెళ్లి కోసం పెద్ద మొత్తంలో డబ్బులు అందించిన దాఖలాలు ఉన్నాయి. సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి.

మ్యూచువల్ ఫండ్స్..

మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇన్వెస్టర్ల నుంచి డబ్బులు సేకరించి.. ఆ మొత్తాన్నివివిధ రకాల స్టాక్స్, సెక్యూరిటీలు, బాండ్లలో పెట్టుబడి పెడుతుంది. ఈక్విటీ మార్కెట్లో స్టాక్స్‌లో నేరుగా ఇన్వెస్ట్ చేయలేని వారికి మ్యూచువల్‌ ఫండ్స్‌ బెస్ట్‌ ఆప్షన్‌. పైగా ఇందులో రిస్క్ తక్కువగా ఉంటుంది. క్రమమైన ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా నెల నెల చిన్న మొత్తాల్లో దీర్ఘకాలం పాటు పొదుపు చేస్తే ఒకేసారి పెద్ద మొత్తంలో అందుకోవచ్చు. మ్యూచువల్‌ ఫండ్స్‌ మీద వార్షికంగా 12 శాతం రాబడి అంచనా వేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం ఇది బెస్ట్‌ సేవింగ్‌ స్కీమ్‌ అంటున్నారు మార్కెట్‌ నిపుణులు.

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(పీపీఎఫ్‌)..

పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనుకువారికి మరొక బెస్ట్‌ ఆప్షన్‌ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇది ఒక దీర్ఘకాలిక పొదుపు,పెట్టుబడి పథకం. 1968లో నేషనల్ సేవింగ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ని ఏర్పాటు చేసింది. క్రమమైన పద్దతిలో.. చిన్న మొత్తాల్లో పొదుపు చేస్తూ.. ఒకేసారి చేతికి పెద్ద మొత్తంలో అందించడమే కాక ట్యాక్స్ సేవింగ్స్ కల్పించడం కూడీ స్కీమ్‌లో ఉన్న అదనపు లాభం. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మైనర్లతో పాటు భారత పౌరులందరూ ఇందులో చేరవచ్చు.

ఇందులో కనీసం రూ. 500 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో భాగంగా పొదుపు మొత్తాల మీద 7.1 శాతం వడ్డీ రేటు అందిస్తోంది కేంద్రం. వార్షికంగా వడ్డీ కంపౌండింగ్ అవుతుంటుంది. ప్రతి ఏటా వడ్డీ జమ అవుతుంది. దానిపై మళ్లీ వడ్డీ లభిస్తుంది. ట్యాక్స్ యాక్ట్‌లోని 80సీ ప్రకారం రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపులు ఉంటాయి.

నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌(ఎన్‌ఎస్‌సీ)..

రిస్క్‌ తక్కువగా ఉండాలి.. గ్యారెంటీ రిటర్న్స్‌ కావాలనుకునే వారికి బెస్ట్‌ ఆప్షన్‌ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. నేటి కాలంలో కూడా సాంప్రదాయిక పెట్టుబడిదారులకు ఇష్టమైన ఎంపికగా నిలుస్తోంది ఈ స్కీమ్‌.దీనిలో రిస్క్‌ తక్కువగా ఉండటం మాత్రమే కాక.. ప్రభుత్వ మద్దతు స్కీమ్ కావడంతో ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంటోంది. ఈ స్కీమ్‌కు కూడా సెక్షన్ 80సీ ప్రకారం ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి.

ప్రస్తుతం దీని మీద కేంద్ర 7.7 శాతం వడ్డీ అందిస్తోంది. దీనిలో కూడా వార్షికంగా వడ్డీ జమ అవుతుంటుంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ పీరియడ్ 5 ఏళ్లుగా ఉంటుంది. ఏడాది తర్వాత ప్రీమెచ్యూర్ చేసుకోవచ్చు. ఇందులో కనీసం రూ. 100 నుంచి ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి