iDreamPost
android-app
ios-app

పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌! రిటైర్డ్ అయ్యాక కూర్చొని తినొచ్చు!

  • Published Apr 12, 2024 | 4:43 PM Updated Updated Apr 12, 2024 | 4:43 PM

తాజాగా పోస్టాఫీసులో వృద్ధుల కోసం నెలవారీ ఆదాయాన్ని అందించే ఆద్భుతమైన స్కీమ్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ పథకం అనేది వృద్ధులకు ఎంతగానో ఉపాయోగకరంగా ఉంటుంది. కాగా, ఈ పథకానికి కొన్ని నిబంధనలు, షరతులు ఉన్నాయి. మరి ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

తాజాగా పోస్టాఫీసులో వృద్ధుల కోసం నెలవారీ ఆదాయాన్ని అందించే ఆద్భుతమైన స్కీమ్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ పథకం అనేది వృద్ధులకు ఎంతగానో ఉపాయోగకరంగా ఉంటుంది. కాగా, ఈ పథకానికి కొన్ని నిబంధనలు, షరతులు ఉన్నాయి. మరి ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Apr 12, 2024 | 4:43 PMUpdated Apr 12, 2024 | 4:43 PM
పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌! రిటైర్డ్ అయ్యాక కూర్చొని తినొచ్చు!

ప్రస్తుత కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రకరకాల స్కీమ్ లు అనేవి అందుబాటులోకి వస్తున్నాయి. వీటి ద్వారా సంపదించిన ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకొవచ్చు. అయితే ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి రిటర్న్స్‌ అందించడంలో.. భారత ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్‌ ఎప్పుడు మొదటి స్థానంలో ఉంటుంది. ఈ పోస్టు ఆఫీసులో అనేక పొదుపు, పెట్టబడి పథకాలు ఉన్నాయి. కాగా, ఇవన్నీ ప్రభుత్వ మద్దతుతో కూడిన పథకాలు కాబట్టి చాలా సురక్షితమైనవి. అయితే ఈ పోస్ట్ ఆఫీస్ లో నెలవారీ ఆదాయాన్ని అందించే అనేక పథకాలు కూడా ఉన్నాయి. కాగా, ఆ పోస్ట్ ఆఫీస్ పథకం పేరు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అంటారు. ఈ పోస్ట్ ఆఫీసు పథకం సీనియర్ సిటిజన్లకు ప్రతి నెలా స్థిర ఆదాయాన్ని అందిస్తుంది. ఈ పథకం అనేది వృద్ధులకు ఎంతగానో ఉపాయోగకరంగా ఉంటుంది. అయితే, ఈ పథకానికి కొన్ని నిబంధనలు, షరతులు ఉన్నాయి. అలాగే పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్‌లో ఎంత పెట్టుబడితో మీకు ఎంత డబ్బు లభిస్తుందో అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్ట్ ఆఫీస్ లో నెలవారీ ఆదాయన్ని అందించే ఆద్భుతమైన స్కీమ్ అనేది ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ పథకం పేరు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అని అంటారు. కాగా, ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో రూ. 1000 నుంచి పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. పైగా ఇందులో పెట్టుబడిదారులు గరిష్టంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. కనుక ఈ పథకంలో మీరు ప్రతి నెలా పొందే డబ్బు అనేది మీ పెట్టుబడి పైనే ఆధారపడి ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు 80C కింద మినహాయింపు పొందుతారు. కనుక వృద్ధలకు ఈ పథకం అనేది ఎంతో ఉపాయోగకరంగా ఉంటుంది. అయితే పోస్ట్ ఆఫీస్ ఈ పథకంను 60 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. అందువల్ల ఎవరైన పదవీ విరమణ తర్వాత సాధారణ ఆదాయాన్ని పొందవచ్చు. కాగా, వీఆర్‌ఎస్ తీసుకున్న వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది.

Post Office

ఇక ఈ పథకం పై ప్రభుత్వం ప్రస్తుతం 8.2 శాతం వడ్డీని ఇస్తోంది. ఈ పథకంలో సీనియర్ సిటిజన్లు రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తే.. వారు ప్రతి త్రైమాసికంలో రూ.10,250 సంపాదించవచ్చు. అలా 5 సంవత్సరాలలో మీకు వడ్డీ నుంచి రూ. 2 లక్షల వరకు సంపాదిస్తారు. అయితే మీరు మీ రిటైర్‌మెంట్ డబ్బును గరిష్టంగా రూ. 30 లక్షలు ఇందులో పెట్టుబడి పెడితే, మీకు వార్షికంగా రూ. 2,46,000 వడ్డీ లభిస్తుంది. అంటే మీరు నెలవారీ ప్రాతిపదికన రూ.20,500, త్రైమాసిక ప్రాతిపదికన రూ.61,500 పొందుతారు.

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ గణన అనేది ఈ క్రింది విధంగా వివరించబడింది.

  • కలిసి డిపాజిట్ చేసిన డబ్బు: రూ. 30 లక్షలు
  • కాలం: 5 సంవత్సరాలు
  • వడ్డీ రేటు: 8.2%
  • మెచ్యూరిటీపై డబ్బు: రూ. 42,30,000
  • వడ్డీ ఆదాయం: రూ. 12,30,000
  • త్రైమాసిక ఆదాయం: రూ. 61,500
  • నెలవారీ ఆదాయం: రూ. 20,500
  • వార్షిక వడ్డీ – 2,46,000

ఈ పొదుపు పథకం అనేది భారత ప్రభుత్వంచే నిర్వహించబడే చిన్న పొదుపు పథకం. కాగా, ఇందులో ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద పెట్టుబడిదారులు ప్రతి సంవత్సరం రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం పొందుతారు. అంతేకాకుండా.. ప్రతి సంవత్సరం 8.2% చొప్పున వడ్డీ లభిస్తుంది. పైగా ఇందులో 3 నెలలకోసారి వడ్డీ డబ్బులు అందుతాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్, జూలై, అక్టోబర్, జనవరి మొదటి రోజున వడ్డీ ఖాతాలో జమ చేయబడుతుంది. మరి, వృద్ధల కోసం పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఇలాంటి ఆద్భుతమైన స్కీమ్స్  పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet