iDreamPost

కేంద్రం హామీ.. నెలకు రూ.3 వేలు ఇచ్చే స్కీమ్‌.. పూర్తి వివరాలివే

  • Published Sep 24, 2023 | 6:10 PMUpdated Sep 24, 2023 | 6:10 PM
  • Published Sep 24, 2023 | 6:10 PMUpdated Sep 24, 2023 | 6:10 PM
కేంద్రం హామీ.. నెలకు రూ.3 వేలు ఇచ్చే స్కీమ్‌.. పూర్తి వివరాలివే

ప్రస్తుత కాలంలో ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంట్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసినా సరే.. నెల చివరకు అప్పులు చేసే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సెకండ్‌ ఇన్‌కం ఉంటే బాగుటుంది అని భావించేవాళ్లు ఎందరో ఉన్నారు. సెకండ్‌ ఇన్‌కం కింద ప్రతి నెలా కచ్చితమైన రాబడి లభించే స్కీమ్‌లు ఉంటే బాగుండు అని కోరుకుంటారు. అందులోనూ బ్యాంక్‌లు, పోస్టాఫీసుల్లో ఇలాంటి స్కీమ్‌లు అందుబాటులో ఉంటే.. ఎలాంటి డౌట్‌ లేకుండా.. ఇలాంటి పథకాల్లో డబ్బులు పెట్టుబడి పెట్టవచ్చు.

కానీ అలాంటి స్కీమ్‌ల గురించి సామాన్యులకు పెద్దగా తెలియదు. అలాంటి వారి కోసమే ఇది. ప్రతి నెలా కచ్చితమైన రాబడి పొందాలనుకునేవారికి మంచి అవకాశం పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్. దీనిలో చేరడం ద్వారా ప్రతి నెలా స్థిరమైన రాబడి పొందొచ్చు. పైగా ఈ స్కీమ్‌కు కేంద్ర ప్రభుత్వ మద్ధతు కూడా ఉంటుంది కాబట్టి రిస్క్ అనేది ఉండదు. మరి ఈ స్కీమ్‌ వివరాలు ఏంటి.. దీనిలో చేరడం ఎలా వంటి పూర్తి వివరాలు..

ఒకేసారి పెట్టుబడి పెట్టాలి..

ఈ స్కీమ్‌లో ఒకేసారి డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. ఇలా ఇన్వెస్ట్‌ చేసిన మొత్తం మీద మీరు ప్రతి నెల వడ్డీ రూపంలో స్థిరమైన రాబడి పొందొచ్చు. అలాగే మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత మీ డబ్బులు మీకు తిరిగి చెల్లిస్తారు. పోస్టాఫీస్ అందిస్తున్న ఈ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కింద మీరు రూ. 9 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. ఒకవేళ మీరు జాయింట్‌ అకౌంట్ తెరిస్తే.. ఒకేసారి మొత్తంగా రూ. 15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసే అవకాశం లభిస్తుంది.

కేంద్రం ఈ ఏడాది వార్షిక బడ్జెట్ 2023- 24 సందర్భంగా ఈ స్కీమ్‌ లిమిట్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ స్కీమ్‌లో గరిష్ఠంగా రూ. 9 లక్షల వరకు మాత్రమే ఇన్వెస్ట్‌ చేసే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఈ మొత్తాన్ని భారీగాపెంచారు.

పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో భాగంగా ఇన్వెస్ట్‌ చేసిన మొత్తం మీద 7.4 శాతం మేర వడ్డీ లభిస్తోంది. అయితే ఈ వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతుంటుంది. లేదంటే స్థిరంగా ఉండొచ్చు. ఉదాహరణకు మీరు ఈ పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లో రూ. 15 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకుందాము. ఈ మొత్తం మీద మీ చేతికి ప్రతి నెలా రూ. 9,250 వరకు ఆదాయం లభిస్తుంది. ఇలా మీరు ఐదేళ్ల పాటు ప్రతి నెలా రాబడి పొందొచ్చు. తర్వాత మీరు డిపాజిట్‌ చేసిన 15 లక్షలను మీకు తిరిగి చెల్లిస్తారు.

ఒకవేళ మీరు తక్కువ మొత్తంలో అంటే రూ. 5 లక్షలు ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. అప్పుడు మీకు నెలకు రూ. 3 వేల వరకు వడ్డీ లభిస్తుంది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ఆధారంగా మీకు వచ్చే రాబడి కూడా మారుతుందని చెప్పుకోవచ్చు. అందుకే ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేస్తే.. అధిక రాబడి సొంతం చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్‌కు, రెగ్యులర్ ఇన్‌కమ్ కోరుకునే వారికి ఈ స్కీమ్ చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి