Dharani
ప్రతి నెల స్థిరమైన ఆదాయం కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే. ఈ పథకంలో చేరితో ప్రతి నెల 9 వేల రూపాయలు పొందవచ్చు. ఇంతకు ఆ పథకం ఏంటి అంటే..
ప్రతి నెల స్థిరమైన ఆదాయం కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే. ఈ పథకంలో చేరితో ప్రతి నెల 9 వేల రూపాయలు పొందవచ్చు. ఇంతకు ఆ పథకం ఏంటి అంటే..
Dharani
ఉద్యోగం నుంచి విరమణ పొందిన తర్వాతైనా.. లేదంటే.. జాబ్ చేస్తూ.. రెండో ఆదాయం పొందాలనుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టింది. బ్యాంకులతో పాటు.. పోస్టాఫీసుల్లో కూడా ఇలాంటి స్కీమ్ లు అనేకం అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో చిన్నమొత్తాల్లో పెట్టుబడి పెడితే.. దీర్ఘకాలంలో మంచి లాభాలు వస్తాయి. పైగా ఈ పథకాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉండటంతో.. ఎలాంటి భయం లేకుండా వీటిల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇక ఈ స్కీమ్ ల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రతి నెల ఆదాయం పొందవచ్చు. ఇప్పుడు మేం మీకు చెప్పబోయేది అలాంటి స్కీమ్ గురించే. అదే పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం(మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (ఎంఐఎస్)). ఈ స్కీమ్ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (ఎంఐఎస్) ద్వారా మీరు ఏడాదికి లక్ష రూపాయల వరకు లాభం పొందవచ్చు. మీరు ఈ పథకంలో చేరితే సింగిల్, జాయింట్ అకౌంట్ తెరిచే వీలుంటుంది. ఈ స్కీమ్ మీద ప్రస్తుతం 7.40 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఇది సింగిల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. ఒక్కసారి పెట్టుబడి పెడితే.. ప్రతి నెలా ఆదాయం పొందవచ్చు. దీనిలో భాగంగా మీరు సింగిల్ అకౌంట్ తెరిస్తే.. అత్యధికంగా 9 లక్షలు.. జాయింట్ అకౌంట్ అయితే 15 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో రూ.1000 కనిష్ట డిపాజిట్ తో మీరు ఖాతా తెరవచ్చు.
ఈ ఎంఐఎస్ పథకం కాల వ్యవధి 5 సంవత్సరాలుగా ఉంది. ఈ పథకానికి 7.40 శాతం వడ్డీ అందిస్తున్నారు. ఇక మీరు ఈ పథకంలో చేరి జాయింట్ అకౌంట్ తెరిచి.. 15 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేస్తే.. ప్రతి నెల మీకు రూ. 9,250 ఆదాయం వస్తుంది. అంటే ఏడాదికి ఈ అకౌంట్ కింద రూ.1,11,000 వడ్డీ రూపంలో పొందొచ్చు. ఐదేళ్లలో ఇది రూ. 5,55,000 అవుతుంది.
అదే మీరు ఈ పథకంలో చేరి సింగిల్ అకౌంట్ తెరిస్తే.. అప్పుడు గరిష్టంగా రూ. 9 లక్షలు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. దీనిపై ఏడాదికి రూ.66,600 వడ్డీ వస్తుంది. 5 సంవత్సరాలలో అంటే మెచ్యూరిటీకి నాటికి ఆ మొత్తం రూ. 3,33,000 అవుతుంది. అంటే మీరు నెలకు రూ. 5,550 పొందవచ్చు.
నెలనెలా ఆదాయం కావాలనుకునే వారు ఈ స్కీం పరిశీలించొచ్చు. ముఖ్యంగా రిటైర్మెంట్ తీసుకున్న వారికి ఈ పథకం అనువుగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక భారత పౌరులంతా ఈ పథకంలో చేరేందుకు అర్హులే. ఇక పిల్లల పేరిట కూడా తల్లిదండ్రులు గార్డియన్‌గా ఉంటూ ఈ పథకంలో ఖాతా తెరవచ్చు. ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ పథకం వడ్డీ రేట్లను సవరిస్తుంది.