iDreamPost
android-app
ios-app

Post Ofiice ఫ్రాంఛైజీ బిజినెస్.. తక్కువ పెట్టుబడితో..నెలకు 80వేల ఆదాయం!

  • Published Oct 03, 2024 | 6:41 PM Updated Updated Oct 03, 2024 | 6:41 PM

Post office franchise scheme: కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ అందించే ఫ్రాంఛైజీ బిజినెస్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నెలకు 80 వేల వరకు ఆదాయం పొందొచ్చు.

Post office franchise scheme: కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ అందించే ఫ్రాంఛైజీ బిజినెస్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నెలకు 80 వేల వరకు ఆదాయం పొందొచ్చు.

  • Published Oct 03, 2024 | 6:41 PMUpdated Oct 03, 2024 | 6:41 PM
Post Ofiice ఫ్రాంఛైజీ బిజినెస్.. తక్కువ పెట్టుబడితో..నెలకు 80వేల ఆదాయం!

పోస్టాఫీస్ కు ఒకప్పుడు విపరీతమైన ఆదరణ ఉండేది. ఉత్తర, ప్రత్యుత్తరాల కోసం పోస్టాఫీస్ సేవలను యూజ్ చేసుకునే వారు. కానీ, నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టెక్నాలజీ డెవలప్ మెంట్ తో అనేక రకాల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో పోస్టాఫీస్ కు కాస్త ఆదరణ తగ్గింది. అయినప్పటికీ ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. సామాన్య ప్రజల కోసం స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ను అందిస్తూ దూసుకెళ్తోంది. మహిళల కోసం, సీనియర్ సిటజన్స్ కోసం, పిల్లల కోసం అద్భుతమైన పథకాలను ప్రవేశపెడుతున్నది. ఈ క్రమంలో పోస్టాఫీస్ బిజినెస్ చేసుకునే సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది. పోస్టాఫీస్ ఫ్రాంచైజీ వ్యాపారంతో మంచి ఆదాయాన్ని పొందొచ్చు.

పోస్టాఫీసు ఫ్రాంచైజీ బిజినెస్ స్కీమ్. మీరు కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఇది మంచి అవకాశం. తక్కువ పెట్టుబడితోనే అధిక లాభాలను అందుకోవచ్చు. పోస్టాఫీస్ ఫ్రాంచైజీ తెరిచేందుకు రూ. 5వేలు పెట్టుబడిపెడితే చాలు. పోస్టాఫీస్ ఫ్రాంచైజీని ఓపెన్ చేసి సేవలపై కమీషన్ల ద్వారా మంచి లాభాలను పొందే వీలుంది. ప్రజలకు విసృతమైన సేవలు అందించడంలో భాగంగా పోస్టల్ డిపార్ట్ మెంట్ రెండు రకాల ఫ్రాంచైజీలను ఆఫర్ చేస్తోంది. ఒకటి ఫ్రాంచైజీ అవుట్‌లెట్లు, రెండోది పోస్టల్ ఏజెంట్లు. ఫ్రాంచైజీ అవుట్‌లెట్లను కౌంటర్ సర్వీసులు అందించేందుకు ప్రారంభించొచ్చు. అలాగే పోస్టల్ ఏజెంట్స్ కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ స్టాంపులు, స్టేషనరీ వస్తువులు విక్రయించేందుకు అవకాశం ఉంటుంది.

అర్హులు:

పోస్టాఫీస్ ఫ్రాంచైజీని ఓపెన్ చేయాలనుకునే వారు 18 ఏళ్ల వయసు నిండి ఉండాలి. అదేవిధంగా గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి పదో తరగతి పాసై ఉండాలి. ఈ ఫ్రాంచైజీని ఓపెన్ చేసేందుకు భారత పౌరులు ఎవరైనా అర్హులే. కానీ పోస్టల్ ఉద్యోగులకు చెందిన కుటుంబ సభ్యులు మాత్రం అనర్హులు.

ఆదాయం:

పోస్టల్ సర్వీసులపై మీరు కమీషన్ ద్వారా ఆదాయం పొందొచ్చు. రిజిస్టర్డ్ పోస్టు బుకింగ్ కోసం ఒక్కో ట్రాన్సాక్షన్‌ ద్వారా రూ.3 కమీషన్ తీసుకోవచ్చు. అలాగే స్పీడ్ పోస్ట్ బుకింగ్ పై రూ.5, రూ.100 నుంచి రూ. 200 మధ్య ఉండే మనీయార్డర్లకు రూ. 3.50 కమీషన్, రూ.200 ఆపైన ఉండే వాటికి రూ.5 కమీషన్ పొందొచ్చు. నెలవారీ టార్గెట్ కింద 1000 రిజిస్టర్డ్, స్పీడ్ పోస్ట్ బుకింగ్స్ చేసినట్లయితే అదనంగా 20 శాతం కమీషన్ లభిస్తుంది. పోస్టల్ స్టాంపులు, స్టేషనరీ విక్రయించడం ద్వారా 5 శాతం కమీషన్ పొందవచ్చు. పోస్టాఫీస్ ఫ్రాంచైజీ ద్వారా తక్కువలో తక్కువ నెలకు రూ. 80వేల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది. మరి మీరు కూడా పోస్టాఫీస్ ఫ్రాంచైజీని ప్రారంభించాలనుకుంటే పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి. లేదా మీ దగ్గర్లోని పోస్టాఫీస్ ను సందర్శించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş