iDreamPost
android-app
ios-app

Post Office: పోస్టాఫీస్‌ నుంచి అదిరే స్కీమ్‌.. రూ.2 లక్షల పెట్టుబడిపై వడ్డీనే రూ.89 వేలు

  • Published Aug 05, 2024 | 1:12 PM Updated Updated Aug 05, 2024 | 1:12 PM

Post Office FD Scheme: పోస్టాఫీసుల్లో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి అదిరే శుభవార్త అని చెప్పవచ్చు. 2 లక్షలు పెట్టుబడితో ఏకంగా 89 వేల రూపాయల వడ్డీ పొందవచ్చు. ఆ వివరాలు..

Post Office FD Scheme: పోస్టాఫీసుల్లో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి అదిరే శుభవార్త అని చెప్పవచ్చు. 2 లక్షలు పెట్టుబడితో ఏకంగా 89 వేల రూపాయల వడ్డీ పొందవచ్చు. ఆ వివరాలు..

  • Published Aug 05, 2024 | 1:12 PMUpdated Aug 05, 2024 | 1:12 PM
Post Office: పోస్టాఫీస్‌ నుంచి అదిరే స్కీమ్‌.. రూ.2 లక్షల పెట్టుబడిపై వడ్డీనే రూ.89 వేలు

పొదుపు మనిషి జీవితంలో ఎంత ప్రత్యేక పాత్ర పోషిస్తుందో అందరికి తెలుసు. ఎంత తక్కువ జీతం వచ్చినా సరే.. ఎంతో కొంత పొదుపు చేయాలి. నేటి పొదుపే రేపటి భవిష్యత్తుకు భరోసా. ఇక కరోనా తర్వాత పొదుపు ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి తెలిసి వచ్చింది. దాంతో చాలా మంది తమ, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. అనేక పథకాల్లో పొదుపు చేస్తున్నారు. పొదుపు పథకాలు అనగానే జనాలకు వెంటనే గుర్తుకు వచ్చేది పోస్టాఫీస్‌ స్కీమ్‌లు. అవును వీటిల్లో మన డబ్బుకు భరోసాతో పాటుగా.. కచ్చితమైన రాబడి కూడా లభిస్తుంది. అందుకే చాలా మంది పోస్టాఫీస్‌ స్కీముల్లో డబ్బును ఇన్వెస్ట్‌ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే పోస్టాఫీసులు కూడా ప్రజలను ఆకట్టుకునేలా మంచి మంచి పొదుపు పథకాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. అలాంటి ఓ స్కీమ్‌ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం. దీనిలో మీరు 2 లక్షలు ఇన్వెస్ట్‌ చేస్తే.. వడ్డీగా ఏకంగా 89 వేల రూపాయలు పొందవచ్చు. అదేలా అంటే.

ఇక పోస్టాఫీసు స్కీముల మీద మంచి వడ్డీ కూడా వస్తుంది. అలాంటి స్కీమ్‌ గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. అదే పోస్టాఫీస్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) స్కీమ్‌ ఒకటి. ప్రస్తుతం దీనిపై కేంద్ర ప్రభుత్వం 6.9-7.5 శాతం వరకు వడ్డీ రేటు అందిస్తోంది. అంతేకాక ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వడ్డీ కాంపౌండ్‌ అవుతుంది. అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీని అసలు జోడిస్తారు. ఇక ఈ పోస్టాఫీసు ఎఫ్‌డీ స్కీముల కాల వ్యవధి ఏడాది నుంచి ఐదేళ్ల వరకు ఉంటుంది. వడ్డీ రేటు కూడా మీరు తీసుకునే కాలాన్ని బట్టి మారుతుంది.

ఒక పోస్టాఫీసులో ఎఫ్‌డీ ఖాతా తెరవాలని చూసే వారు.. కనీస డిపాజిట్‌ కింద వెయ్యి రూపాయిలతో ఎఫ్‌డీ డిపాజిట్‌ తెరవచ్చు. ఉదాహరణకు మీరు ఈ స్కీమ్‌లో 2 లక్షల రూపాయలు డిపాజిట్‌ చేశారు అనుకుందా. ఆ మొత్తం మీద వివిధ కాల పరిమితులకు మీకు వడ్డీ ఎంత వస్తుంది అనేది ఇక్కడ చూద్దాం. పోస్టాఫీసు ఎఫ్‌డీ స్కీములో ఏడాది కాలానికి 6.9 శాతం వడ్డీ ఇస్తుండగా.. 2 ఏళ్లకు 7.0 శాతం వడ్డీ, మూడేళ్లకు 7.1 శాతం, 5 సంవత్సరాలకు 7.5 శాతం వడ్డీగా చెల్లిస్తారు.

ఉదాహరణకి మీరు పోస్టాఫీసు ఎఫ్‌డీ స్కీమ్‌లో చేరి.. రూ.లక్ష పెట్టుబడి పెట్టారనుకుందాం. దానికి వేర్వేరు కాలపరిమితులకు అనగా.. ఏడాది, 2, 3, 5 ఏళ్లకు వడ్డీ మొత్తం ఎలా ఉంటుంది అంటే..

  • ఏడాదికి: వడ్డీ రూ. 7,080, మొత్తం రూ. 1,07,080.
  • రెండేళ్లకు: వడ్డీ రూ. 14,888, ఫలితంగా మొత్తం రూ. 1,14,888.
  • 3 సంవత్సరాలకు: వడ్డీ మొత్తం రూ. 23,507, మొత్తం రూ. 1,23,507.
  • ఐదేళ్ల తర్వాత: వడ్డీ రూ. 44,994, మొత్తం రూ. 1,44,994కి చేరుతుంది.

అదే మీరు రూ. 2,00,000 పెట్టుబడి పెడితే, వచ్చే వడ్డీ..

  • ఏడాది తర్వాత: వడ్డీ రూ. 14,161 అవుతుంది, ఫలితంగా మొత్తం రూ. 2,14,161.
  • 2 ఏళ్లకు : వడ్డీ మొత్తం రూ. 29,776, మొత్తం రూ. 2,29,776.
  • 3 సంవత్సరాల తర్వాత: వడ్డీ రూ. 47,015, మొత్తం రూ. 2,47,015.
  • 5 సంవత్సరాల తర్వాత: వడ్డీ రూ. 89,989 అవుతుంది. మొత్తం రూ. 2,89,989 అవుతుంది.