Dharani
PM Surya Ghar-Rooftop Solar Electricity: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఓ అద్భుతమైన స్కీమ్ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. దీని ద్వారా ఉచితంగా కరెంట్ పొందమే కాక.. మనమే ఎదురు డబ్బు సంపాదించుకోవచ్చు. ఇంతకు ఆ స్కీమ్ ఏదంటే..
PM Surya Ghar-Rooftop Solar Electricity: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఓ అద్భుతమైన స్కీమ్ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. దీని ద్వారా ఉచితంగా కరెంట్ పొందమే కాక.. మనమే ఎదురు డబ్బు సంపాదించుకోవచ్చు. ఇంతకు ఆ స్కీమ్ ఏదంటే..
Dharani
సామాన్యులకు ఆసరాగా నిలవడం కోసం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. అనేక పథకాలను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. సమాజంలోని అన్ని వర్గాలను ఆదుకునేలా సంక్షేమ పథకాలను రూపొందిస్తున్నాయి. ఇలా తీసుకువచ్చిన పథకాల్లో ఒక దాని గురించి మేం ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. ఈ పథకానికి అప్లై చేసుకుంటే.. ఉచిత కరెంట్‌తో పాటు.. ఏడాదికి 32 వేల రూపాయల వరకు ఆదా చేసుకోవడమే కాక అదనంగా డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. ఇంతకు అది ఏ పథకం.. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి.. ఎవరు అర్హులు అనే పూర్తి వివరాలు.. మీకోసం.
విద్యుత్ బిల్లు సామాన్యుల జేబుకు చిల్లు పెడుతోంది. ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సమస్య పరిష్కారం కోసం సరికొత్త స్కీమ్‌ను తీసుకువచ్చింది. అదే పీఎం సూర్య ఘర్ యోజన. దీనిలో భాగంగా.. ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉచితంగా విద్యుత్ పొందడమే కాక.. మిగులు విద్యుత్తును అమ్ముకుని.. ఆదాయం కూడా పొందవచ్చు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు కోటి కుటుంబాలకు సోలార్ విద్యుత్తు అందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఈ పథకంలో భాగంగా ఒక్కో ఇంటిపై గరిష్టంగా 3 కిలోవాట్ల వరకు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం 78 వేల రూపాయల వరకు సబ్సిడీ కల్పిస్తోంది. ఈ పథకంలో చేరడం ద్వారా ఏడాదికి 32 వేల రూపాయల వరకు ఆదా చేసుకోవడమే కాక.. నిరంతర విద్యుత్తు సరఫరాతో పాటు.. అదనపు ఆదాయం పొందే అవకాశం కూడా ఉంది. ఇక ఇంటికి నెలకు 0-150 యూనిట్ల వరకు కరెంట్ వాడుకునే వారికి 1-2 కిలోవాట్ల సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. 150-300 యూనిట్ల విద్యుత్ వినియోగించుకునే వారు.. 2-3 కిలో వాట్ల ప్యానళ్లను ఏర్పాటు చేసుకోవాలి. మరి ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలంటే..