iDreamPost
android-app
ios-app

అన్నదాతల కోసం కేంద్రం అదిరే స్కీమ్‌.. ఒక్కసారి అప్లై చేస్తే.. 25 ఏళ్ల పాటు ఆదాయం

  • Published May 04, 2024 | 2:41 PM Updated Updated May 04, 2024 | 2:41 PM

PM Kusum Scheme: అన్నదాతల కోసం మోదీ ప్రభుత్వం అదిరిపోయే పథకాన్ని తీసుకువచ్చింది. ఒక్కసారి ఈ స్కీమ్‌కు అప్లై చేసుకుంటే రైతులు అదనపు ఆదాయం పొందే అవకాశం కూడా ఉంది. ఆ వివరాలు..

PM Kusum Scheme: అన్నదాతల కోసం మోదీ ప్రభుత్వం అదిరిపోయే పథకాన్ని తీసుకువచ్చింది. ఒక్కసారి ఈ స్కీమ్‌కు అప్లై చేసుకుంటే రైతులు అదనపు ఆదాయం పొందే అవకాశం కూడా ఉంది. ఆ వివరాలు..

  • Published May 04, 2024 | 2:41 PMUpdated May 04, 2024 | 2:41 PM
అన్నదాతల కోసం కేంద్రం అదిరే స్కీమ్‌.. ఒక్కసారి అప్లై చేస్తే.. 25 ఏళ్ల పాటు ఆదాయం

రైతే రాజు.. అన్నదాతే దేశానికి వెన్నుముక అంటారు. వారు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. రైతు నష్టపోతే.. ఆ ప్రభావం దేశం​ మొత్తం మీద పడుతుంది. ఇక ఆరుగాలం కాయ కష్టం చేసి.. దేశానికి అన్నం పెట్టే రైతన్నలను ఆదుకోవడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను తీసుకొచ్చాయి. పెట్టుబడికి సాయం అందించడం మొదలు.. తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం, రుణమాఫీ, మద్దతు ధర ఇవ్వడంతో పాటు.. వారికి ఇతర ఆదాయాలు కల్పించే పథకాలను కూడా ప్రవేశపెడుతుంటాయి. ఈ క్రమంలో రైతన్నలకు ఏళ్ల తరబడి ఆదాయం అందించేందుకు గాను మోదీ ప్రభుత్వం ఓ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా.. వారు 25 ఏళ్ల పాటు నిరంతరంగా ఆదాయం పొందవచ్చు. ఇంతకు ఆ స్కీమ్‌ ఏది.. దానికి ఎలా అప్లై చేసుకోవాలంటే..

ఇక ఆ స్కీమ్‌ వివరాలకు వస్తే.. అన్నదాతలకు ఏళ్ల తరబడి నిరంతరం ఆదాయాన్ని అందించేందుకు మోదీ సర్కార్‌ ప్రధాన మంత్రి కుసుమ్‌ యోజన పథకాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా రైతులకు సోలార్‌ పంపులపై భారీ ఎత్తున సబ్సిడీ ఇస్తారు. వీటిని పొలాల్లో అమర్చుకుంటే.. విద్యుత్తు ఖర్చు ఆదా అవుతుంది. ఇక సోలార్‌ పంపులతో పర్యవరణానికి కూడా ఎలాంటి హానీ జరగదు.. ఇవి గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను కూడా తగ్గిస్తాయి. పైగా ఈ సోలార్‌ పంపులను అమర్చుకుంటే.. రైతన్నలకు విద్యుత్‌ బిల్లు ఆదా అవ్వడమే కాక.. అదనపు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. అదెలా అంటే.. సోలార్‌ పంపుల ద్వారా ఉత్పత్తి అయ్యే మిగులు విద్యుత్తును విక్రయించి.. నిరంతరం 25 ఏళ్ల పాటు ఆదాయం పొందవచ్చు అంటున్నారు.

Paddy farmer

కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా రైతులు తమ పొలాలు, బంజరు భూముల్లో వినియోగం సోలార్‌ పంపులను సబ్సిడీ మీద కొనుగోలు చేయవచ్చు. ఈ పథకం కింద రైతులు 60 శాతం సబ్సిడీతో సోలార్ పంపులను కొనుగోలు చేసి అమర్చుకోవచ్చు. అలానే ఈ పథకం రైతులకు 25 ఏళ్ల పాటు ఎలాంటి ఆందోళన లేకుండా నిరంతర ఆదాయాన్ని పొందే అవకాశం కల్పిస్తుంది.

సోలార్‌ పంపుల కొనుగోలుపై 60 శాతం సబ్సిడీ..

రైతన్నలు ఈ పథకం కింద 60 శాతం సబ్సిడీతో సోలార్ పంపులు కొనుగోలు చేయవచ్చు. అయితే మొదటగా సోలార్ ప్యానెల్స్‌కు అయ్యే పూర్తి ధరలో 10 శాతం చెల్లిస్తే సరిపోతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల బ్యాంకు ఖాతాల్లో 60 శాతం సబ్సిడీ మొత్తాన్ని జమ చేస్తాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం 30 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం వాటా ప్రకారం సబ్సిడీని అందజేస్తాయి. ఇక మిగతా 30 శాతం మొత్తం కోసం బ్యాంకుల నుంచి లోన్‌గా పొందవచ్చు. రైతులు సొంత ఆదాయంతో ఈ లోన్‌ను సులభంగా చెల్లించవచ్చు. రైతులే కాకుండా సహకార సంఘాలు కూడా ఈ పథకం ద్వారా లబ్ది పొందవచ్చు.

ఏ పత్రాలు కావాలంటే..

ప్రధాన మంత్రి కుసుం యోజనకు దరఖాస్తు చేసుకునేటప్పుడు

  • రేషన్ కార్డు,
  • ఆధార్ కార్డు,
  • మొబైల్ నంబర్,
  • ఫొటోలు,
  • గుర్తింపు కార్డు,
  • రిజిస్ట్రేషన్ కాపీ,
  • బ్యాంక్ ఖాతా వివరాలు (పాస్‌బుక్),
  • భూమి పత్రాలు అవసరమవుతాయి.

ఎలా అప్లై చేయాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ mnre.gov.inను విజిట్ చేయాలి.
  • హోమ్‌ పేజీలో పథకానికి సంబంధించిన గైడ్‌లైన్స్‌ చదవాలి.
  • వీటిని చదివితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభం అవుతుంది.
  • పథకానికి సంబంధించి అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ అయ్యాక హోమ్ పేజీలో ‘ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్’ అని ఉంటుంది.
  • దాని మీద క్లిక్ చేసి అప్లికేషన్‌ ఫామ్‌లో పేరు, అడ్రస్, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి.
  • వివరాలు నింపటం పూర్తయ్యాక.. సబ్మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేసి, రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి.
  • అలా రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక సోలార్ అగ్రికల్చరల్ పంప్‌సెట్ సబ్సిడీ స్కీమ్ 2021 కోసం ‘లాగిన్’పై క్లిక్ చేయాలి.
  • ఆన్‌లైన్ దరఖాస్తు ఫామ్‌లో అవసరమైన మొత్తం సమాచారాన్ని ఎంటర్ చేయాలి.
  • చివరగా ఆ సమాచారాన్ని సరి చూసుకోవాలి.
  • చివరగా అవసరమైన అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్‌ అప్లోడ్‌ చేసి.. ఆ తర్వాత సబ్మిట్‌పై నొక్కాలి. పథకం గురించి సమాచారం కోసం నోడల్ అధికారిని సంప్రదించవచ్చు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet