iDreamPost
android-app
ios-app

అన్నదాతలకు గుడ్‌ న్యూస్‌.. వారి ఖాతాలో డబ్బులు జమ!

  • Published Jul 27, 2023 | 12:06 PM Updated Updated Jul 27, 2023 | 12:06 PM
  • Published Jul 27, 2023 | 12:06 PMUpdated Jul 27, 2023 | 12:06 PM
అన్నదాతలకు గుడ్‌ న్యూస్‌.. వారి ఖాతాలో డబ్బులు జమ!

అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పథకాలు, సబ్సిడీలు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీనితో పాటు రైతన్నకు పెట్టుబడి భారం తగ్గించడం కోసం నగదు సాయం అందజేస్తోన్నాయి. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన కింద ఆర్థిక సాయం అందిజేస్తోంది. ఈ క్రమంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 2023 కింద అందించే డబ్బులు రేపు(జూలై 28) రైతుల అకౌంట్లలో జమ కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ.. 14వ విడత పీఎం కిసాన్ నిధుల్ని విడుదల చేయనున్నారు. రాజస్థాన్ సీకర్‌లో  మోదీ రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారు. దాదాపు 8.5 కోట్ల మంది భారతీయ రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ నిధులు రూ. 2000 చొప్పున జమ కానున్నాయి.

రైతులను ఆదుకునేందుకు.. వ్యవసాయ కార్యక్రమాలు నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన ప్రారంభించింది. వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలతో పాటు రైతుల వ్యక్తిగత అవసరాలు తీర్చేందుకుగాను ప్రతి ఏటా పంట సాయం కింద రూ. 6000 మొత్తాన్ని మూడు విడతల్లో అందిస్తోంది కేంద్రం. ప్రతి నాలుగు నెలలకు ఓసారి రూ. 2 వేల చొప్పున అన్నదాతల అకౌంట్లలో పీఎం కిసాన్‌ నిధులను జమ చేస్తుంటుంది. ఇప్పటికి 13 దఫాలుగా పీఎం కిసాన్‌ నిధులు విడుదల చేశారు. చివరిసారి ఫిబ్రవరిలో రైతుల అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. నేడు 14 వ విడత నిధులు విడుదల రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. మరి మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో తెలియాలంటే.. ఇలా చెక్‌ చేసుకొండి.

ఎలా చెక్‌ చేయాలంటే..

  • ముందుగా మీరు pmkisan.gov.in వెబ్‌సైట్ ఒపెన్‌ చేయాలి.
  • హోం పేజీలోని ఫార్మర్స్ కార్నర్ సెక్షన్‌ మీద క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత అక్కడ బెనిఫిషియరీ స్టేటస్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేయాలి.
  • రైతు ఆధార్ నంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత Get Data అనే ఆప్షన్‌ వస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
  • దీనిపై క్లిక్ చేయగానే.. పీఎం కిసాన్ ఇన్‌స్టాల్‌మెంట్ స్టేటస్ మీకు కనిపిస్తుంది.