nagidream
తక్కువ పెట్టుబడితో మంచి విశాలంగా ఉండే స్థలం టౌన్ లో దొరుకుతుందంటే ఎవరు మాత్రం కొనకుండా ఉంటారు చెప్పండి. నగరానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న టౌన్ లో ఆరున్నర లక్షల నుంచి స్థలాలు అందుబాటులో ఉన్నాయి.
తక్కువ పెట్టుబడితో మంచి విశాలంగా ఉండే స్థలం టౌన్ లో దొరుకుతుందంటే ఎవరు మాత్రం కొనకుండా ఉంటారు చెప్పండి. నగరానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న టౌన్ లో ఆరున్నర లక్షల నుంచి స్థలాలు అందుబాటులో ఉన్నాయి.
nagidream
హైదరాబాద్ లో స్థలం కొనడం అంటే ఆషామాషీ కాదు. స్థలం కొనలేక ఫ్లాట్ లతో సరిపెట్టుకుంటారు. అయితే ఇప్పుడు సొంత స్థలాల్లో విశాలమైన ఇళ్ళు కలిగిన పెద్ద పెద్ద వాళ్లలో చాలా మంది సాధారణ మనుషులే. రియల్ ఎస్టేట్ లేని రోజుల్లో భవిష్యత్తులో ల్యాండ్ రేట్లు పెరుగుతాయని తెలిసి కొంతమంది సాహసం చేసి భూములు ఉన్నారు. అవే ఇప్పుడు కోట్లు పలుకుతున్నాయి. తెలంగాణకి హైదరాబాద్ ఎలాగో.. ఏపీకి కూడా వైజాగ్ అలాగ. రానున్న అతి తక్కువ రోజుల్లో ఇక్కడ భూముల రేట్లు అమాంతం పెరిగిపోతాయి. ఏపీలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టులు పూర్తయితే ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అప్పుడు రెంట్ కి ఉండేవాళ్ళు, ఇళ్ళు కొనుక్కునేవాళ్ళు ఎక్కువవుతారు. డిమాండ్ పెరిగి భూముల రేట్లు పెరుగుతాయి. కాబట్టి ఇప్పుడే తక్కువగా ఉన్న చోట స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుంటే మంచి లాభాలు ఉంటాయి.
వైజాగ్ నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తవలస పట్టణంలో ల్యాండ్ రేట్లు తక్కువగా ఉన్నాయి. చుట్టుపక్కల గ్రామాలకి కొత్తవలస పట్టణం మండలంగా కూడా ఉంది. కాబట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి అనువైన ప్రాంతంగా రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. పాఠశాలలు, కళాశాలలు, హాస్పిటల్స్, బ్యాంకులు, మార్కెట్లు వంటి వాటితో పూర్తిగా డెవలప్ అయిన ఏరియా ఇది. పెందుర్తి, అరకు రోడ్డుకి, మూడు జాతీయ రహదారులపై, రైల్వేస్టేషన్, బస్ స్టేషన్ కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఏరియాలో పెట్టుబడి ఎందుకు పెట్టాలంటే.. మిగతా ఏరియాలతో పోలిస్తే ఇక్కడ తక్కువ ధరకే స్థలాలు దొరుకుతున్నాయి. ఎడ్యుకేషనల్ హబ్ గా ఉంది. అలానే టూరిస్ట్ స్పాట్స్ ఎక్కువగానే ఉన్నాయి. కాలుష్యం లేని వాతావరణం, పచ్చని పొలాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, బీచ్ ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయానికి 15 నిమిషాల్లో చేరుకునేంత దగ్గరలో ఉంది. ఇక్కడ పెట్టుబడి పెడితే అతి తక్కువ రోజుల్లోనే మీ పెట్టుబడి రెట్టింపు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం కొత్తవలసలో చదరపు అడుగు ల్యాండ్ ప్రారంభ ధర రూ. 1100గా ఉంది. 2 BHK ఇంటికి సరిపడా ల్యాండ్ కి అంటే 150 గజాలకి రూ. 15 లక్షలు అవుతుంది. 15 లక్షల్లో విశాలమైన స్థలం రావడమే కాకుండా ఆ స్థలానికి ఫ్యూచర్ లో మంచి వేల్యూ కూడా వస్తుంది. కాబట్టి వైజాగ్ దగ్గరలో ఉన్న కొత్తవలసలో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇదే కొత్తవలసలో ఇంతకంటే ఎక్కువ ధర పలికే స్థలాలు కూడా ఉన్నాయి. 45 అడుగుల పొడవు, 18 అడుగుల వెడల్పు కలిగిన స్థలాలు చదరపు అడుగుకి 6500 చొప్పున 6.50 లక్షలకే అందుబాటులో ఉన్నాయి. అలానే చదరపు అడుగు 1060 చొప్పున 1800 చదరపు అడుగుల మూల స్థలాలు 19 లక్షలకే అందుబాటులో ఉన్నాయి. 200 గజాల వ్యవసాయ భూమి 10 లక్షలకి, 200 గజాల ఇల్ల స్థలం 16 లక్షలకి అందుబాటులో ఉన్నాయి. ఈ ఏరియాలో స్థలం ధర అత్యధికంగా 23 లక్షలుగా ఉంది. వైజాగ్ కి 28కిలోమీటర్ల దూరంలో ఇంత మంచి ఏరియాలో ఇంత తక్కువ రేటుకి స్థలాలు దొరుకుతున్నాయి కాబట్టి కొనే ఉద్దేశం ఉన్న వారు ఇక్కడ కొనుక్కోవడం ఉత్తమం.