iDreamPost
android-app
ios-app

ITR ఫైలింగ్ తేది పొడిగింపు అంటూ వార్తలు.. అసలు నిజం ఇదే..

PIB Fact Check On ITR Filing 2024 Due Date Extension News: జులై 31తో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువు ముగిసిపోయింది. అయితే ఈ గడువును పొడిగించారు అంటూ సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ విషయంపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసి అసలు విషయాన్ని వెల్లడించింది.

PIB Fact Check On ITR Filing 2024 Due Date Extension News: జులై 31తో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువు ముగిసిపోయింది. అయితే ఈ గడువును పొడిగించారు అంటూ సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ విషయంపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసి అసలు విషయాన్ని వెల్లడించింది.

ITR ఫైలింగ్ తేది పొడిగింపు అంటూ వార్తలు.. అసలు నిజం ఇదే..

ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఆదాయ పన్ను శాఖ జులై 31 వరకు గడువును ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ గడువులోగా పన్ను పరిధిలోకి వచ్చే వాళ్లు ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంటుంది. గడువు ముగిస్తే మాత్రం ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఫైన్ కట్టాల్సి ఉంటుంది. చాలామంది ఆఖరి తేదీ వరకు రిటర్న్స్ ఫైల్ చేయకుండా వెయిట్ చేస్తుంటారు. అలాంటి వాళ్లు ఒక వార్త చూసి సంబరపడిపోతున్నారు. ఐటీఆర్ 2024 ఫైలింగ్ గడువు పొడిగింపు అంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం వివరణ ఇచ్చింది. అదంతా అసత్య ప్రచారం అంటూ వెల్లడించింది.

జులై 31 వరకే గడువు:

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను పరిధిలోకి వచ్చే వాళ్లంతా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు జులై 31 వరకు గడువు ఇచ్చింది. అంటే బుధవారం రాత్రి 12 గంటలలోగా మీరు మీ ఐటీఆర్ ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆ గడువులోగా మీరు ఐటీఆఫ్ ఫైల్ చేయడంలో విఫలమైతే మాత్రం.. ఆ తర్వాత ఆదాయపు పన్ను శాఖ చెప్పిన విధంగా జరిమానా కట్టాల్సి ఉంటుంది. అయితే ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీ పొడిగించారు అంటూ గుజరాత్ లోని ఒక వార్తా పత్రిక క్లిప్పింగ్ వైరల్ చేస్తున్నారు. ఆ ఫొటోలో ఐటీఆర్ ఫైలింగ్ తేదీ పొడిగించారు అంటూ వార్త ఒకటి ఉంది. ఆ పిక్ చాలా వైరల్ కూడా అయ్యింది. కొందరు అయితే నిజంగానే ఐటీఆర్ ఫైలింగ్ తేదీని పొడిగించారు అనుకుంటున్నారు. ఒకవేళ మీరు కూడా అలా అనుకుని ఊరుకుంటే నష్టపోయినట్లే. ఎందుకంటే అదంతా అసత్య ప్రచారం అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వింగ్ కొట్టిపారేసింది.

PIB ఫ్యాక్ట్ చెక్:

ఆదాయపు పన్ను శాఖ నుంచి గడువు పొడిగింపునకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. శాఖ వాళ్లు ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఇదే విషయాన్ని పీఐబీ కూడా ప్రస్తావించింది. పీఐబీ తమ పోస్టులో ఆ విషయాన్ని స్పష్టం చేసింది. ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీ జులై 31 వరకు మాత్రమే అని స్పష్టం చేసింది. అలాగే ఆ తేదీలోగా రిట్నర్న్స్ ని దాఖలు చేయకపోతే మాత్రం నింబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సి వస్తుంది అంటూ క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈ ఏడాది ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగింపు ప్రస్తావనే ఉండదు అని ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. ఆఖరు వరకు ఆగితే సాంకేతిక సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉందని ఐటీ శాఖ ఎప్పటి నుంచో పౌరులను హెచ్చరిస్తూనే ఉంది. మొత్తానికి గడువు పొడిగింపు మాత్రం లేదు అనే విషయం అయితే స్పష్టమైంది.