P Krishna
Reliance: ప్రపంచలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీకి ఇద్దరు చిన్నారులు బంపర్ ఆఫర్ ప్రకటించారు.
Reliance: ప్రపంచలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీకి ఇద్దరు చిన్నారులు బంపర్ ఆఫర్ ప్రకటించారు.
P Krishna
ప్రతి ఏటా ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించే ప్రపంచంలో అత్యంత సంపన్నుల లీస్ట్ లో ముకేశ్ అంబానీ పేరు వినిపిస్తుంది. అలాంటి అపర కుబేరుడికి ఇద్దరు చిన్నారులు ఆఫర్ ప్రకటించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దుబాయ్ కి చెందిన ఇద్దరు అన్నా చెల్లెళ్లు తాము కొన్న జియో హాట్‌స్టార్ డొమైన్ (jiohotstar.com)ను రియల్స్ కు ఇస్తామని తెలిపారు. ఇందుకోసం తమకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదని, అడిగితే ఉచితంగా ఇస్తామని ప్రకటన చేశారు. ఇంతకీ ఆ ఇద్దరు చిన్నారులు ఎవరు.. అంబానీకే ఆఫర్ ఇస్తున్నారంటే ఏంటా కథ? పూర్తి వివరాలు తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇటీవల జియో హాట్‌స్టార్ డొమైన్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఇప్పుడు ఈ డొమైన్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. వాస్తవానికి ఈ డొమైన్ మొదట ఓ యాప్ డెవలపర్ తన పేరుతో రిజిస్టర్ చేసుకున్నాడు. తర్వాత అది యూఏఈ కి చెందిన ఇద్దరు చిన్నారుల చేతికి వెళ్లింది. ఈ క్రమంలోనే దుబాయ్‌కి చెందిన చిన్నారులు రిలయన్స్ కి బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇందుకు సంబందించి చిన్నారులు ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో ‘అందరికీ నమస్కారం.. ఈ రోజు, మేము కొనుగోలు చేసిన jiohotstar.com డొమైన్ గురించి ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాం. కొన్ని రోజుల క్రితం ఈ డొమైన్ ని ఢిల్లీకి చెందిన ఓ యువ డెవలపర్ వద్ద కొన్నాం.తర్వాత ఈ డొమైన్ కొనుగోలు చేస్తామని చాలా మెయిల్స్ వచ్చాయి. అందులో చాలా వరకు నకీలీవి ఉంటడంతో మేం పెద్దగా పట్టించుకోలేదు. కొంతమంది భారీ ఎత్తున డబ్బు ఆఫర్ చేశారు. మేం మాత్రం ఆ డొమైన్ ఎట్టి పరిస్థితిలో విక్రయించేది లేదని చెప్పాం. ఈ డొమైన్ పై కొద్ది రోజులుగా ఇంటర్నెట్‌లో చర్చ నడుస్తుంది. మాపై ఎన్నో కథనాలు కూడా వస్తున్నాయి.మేం వివాదంలోకి వెళ్లాలనే ఉద్దేశంతో ఈ డొమైన్ కొనలేదు. ఆ యువ డెవలపర్ ఉన్నత చదువు కోసం విదేశాలకు వెళ్లాలని చెప్పడంతో అతడికి సాయం చేయాలని అనుకున్నాం. ఈ డొమైన్ రిలయన్స్ వాళ్ల వద్ద ఉంటేనే మంచిదని బావిస్తున్నాం. వారు అడిగితే దీన్ని ఉచితంగా, లీగల్ డాక్యుమెంట్స్‌తోనే ఇచ్చేస్తాం. మా నిర్ణయం వెనుక రియలన్స్ నుంచి కానీ ఇతర న్యాయ బృందాల నుంచి కానీ ఎలాంటి ఒత్తిడి లేదు.. మా ఇష్టపూర్వకంగానే చెబుతున్నాం’ అని చిన్నారులు ప్రకటించారు.
ఇంతకీ అసలు జరిగిన విషయం ఏంటంటే!
రిలయన్స్ జియో సినిమా, వాల్ట్ డిస్నీ భారత వ్యాపారాల విలీనం ఖరారయ్యింది. అయితే జియోహాట్‌స్టార్ డొమైన్ (JioHotstar Domain) ని ఢిల్లీకి చెందిన ఓ యువ యాప్ డెవలపర్ కొనుగోలు చేశాడు. ఇటీవల తాను కేంబ్రిడ్జ్‌లో ఎంటర్ ప్రెన్యూర్ షిప్‌లో ఫుల్ డిగ్రీ ప్రోగ్రామ్ చదువుకోవాలని.. అందుకు ఖర్చును రిలయన్స్ భరిస్తే తాను డొమైన విక్రయిస్తానని చెప్పాడు. తనకు కోటి రూపాయలు ఇవ్వాలని హాట్‌స్టార్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నాడు. ఆ విషయం కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కట్ చేస్తే.. కొంత కాలంగా ఆ యువకుడు జాడ లేకుండా పోయింది. అతడి స్థానంలో దుబాయ్‌కి చెందిన ఇద్దరు చిన్నారు అందులో కనిపించడం మొదలైంది. ఆ చిన్నారులు జైనం, జీవికగా పరిచయం చేసుకున్నారు. అంతే కాదు కొన్ని వీడియోలు సైతం పోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ ఇద్దరు అన్నాచెల్లెళ్లు వివిధ ఎన్జీవోలతో కలిసి సేవక్ ఆర్మీ నిర్వహిస్తున్నామని చెప్పారు. రిలయన్స్ అడిగితే తాము ఎలాంటి డబ్బు ఆశించకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఇచ్చేస్తామని చెప్పారు. దీంతో ఆ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ప్రపంచంలోనే అపర కుబేరుడైన అంబానికే బంపర్ ఆఫర్ ప్రకటించార్రా నాయనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.