iDreamPost
android-app
ios-app

జియో నుంచి క్రేజీ ప్లాన్.. తక్కువ ధరలో ఏడాదంతా అన్ లిమిటెడ్ 5జీ డేటా..

  • Published Nov 19, 2024 | 6:05 PM Updated Updated Nov 19, 2024 | 6:05 PM

Jio 5G Voucher: జియో యూజర్లకు అదిరిపోయే సూపర్ ఆఫర్ ప్రకటించింది జియో. చౌక ధరలో ఏడాదంతా అన్ లిమిటెడ్ 5జీ డేటాను అందించే ప్లాన్ ను తీసుకొచ్చింది. ఇంతకీ ధర ఎంతంటే?

Jio 5G Voucher: జియో యూజర్లకు అదిరిపోయే సూపర్ ఆఫర్ ప్రకటించింది జియో. చౌక ధరలో ఏడాదంతా అన్ లిమిటెడ్ 5జీ డేటాను అందించే ప్లాన్ ను తీసుకొచ్చింది. ఇంతకీ ధర ఎంతంటే?

  • Published Nov 19, 2024 | 6:05 PMUpdated Nov 19, 2024 | 6:05 PM
జియో నుంచి క్రేజీ ప్లాన్.. తక్కువ ధరలో ఏడాదంతా అన్ లిమిటెడ్ 5జీ డేటా..

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో టాప్ పొజిషన్ లో దూసుకెళ్తోంది. టెలికాం రంగంలో అడుగుపెట్టిన అనతికాలంలోనే కోట్లాది మంది యూజర్లను సొంతం చేసుకుంది. వాడితే జియో నెట్ వర్క్ మాత్రమే వాడాలి అన్నట్టుగా డిమాండ్ ఏర్పడింది. మెరుగైన నెట్ వర్క్ అందిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఇక ఇటీవల జియో నుంచి 4జీ ఫీచర్ ఫోన్లను రిలీజ్ చేసి గ్రామీణ ప్రాంతాలకు మరింత చేరువైంది. తక్కువ ధరలోనే రీచార్జ్ ప్లాన్స్ అందిస్తూ కొత్త కస్టమర్లను పెంచుకుంటున్నది. ఈ ఏడాది జులైలో టారిఫ్ ప్లాన్స్ ను పెంచిన తర్వాత జియో కస్టమర్లు అసహనం వ్యక్తం చేశారు. దీంతో జియో కస్టమర్ల కోసం మళ్లీ తక్కువ ధరలో కొత్త రీచార్జ్ ప్లాన్స్ ను తీసుకొస్తున్నది.

చౌక ధరల్లోనే అదిరిపోయే బెనిఫిట్స్ అందిస్తూ సర్ ప్రైజ్ చేస్తున్నది. ఈ క్రమంలో జియో కస్టమర్ల కోసం మరో బంపరాఫర్ ను ప్రకటించింది. డేటా ఎక్కువగా వినియోగించే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నది. జియో తాజాగా రూ. 601 అన్‌లిమిటెడ్ అప్‌గ్రేడ్ వోచర్ తెచ్చింది. ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే సంవత్సర కాలం పాటు అన్ లిమిటెడ్ 5జీ డేటాను వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. అయితే ఈ ప్లాన్ తో 4జీ కస్టమర్లు సైతం 5జీ వోచర్ ను యూజ్ చేసుకుని 5జీ డేటాను పొందొచ్చని జియో తెలిపింది. మొదట జియో 5జీ సేవలు ప్రారంభించినప్పుడు 5జీ స్మార్ట్ ఫోన్, నెట్‌వర్క్ ఉన్న వారందరికీ వెల్‌కమ్ ఆఫర్ ద్వారా ఫ్రీగా 5జీ డేటా అందించింది. రూ.239 అంతకంటే ఎక్కువ మొత్తంలో రీఛార్జ్ చేసిన వారందరికీ ఈ 5జీ డేటా అన్‌లిమిటెడ్‌గా ఇచ్చింది.

కానీ, ఈ ఏడాది 2024, జులై నెలలో రీఛార్జ్ ప్లాన్ల ధరలను సవరించింది. రోజుకు 2 జీబీ డేటా అందించే ప్లాన్ రీఛార్జ్ చేసిన వారికి మాత్రమే ట్రూ 5జీ ఉచిత డేటాను అందిస్తోంది. కనీసం నెలకు రూ.349 రీఛార్జ్ చేసుకున్న వారికి మాత్రమే ప్రస్తుతం ఉచిత 5జీ డేటా అందుతోంది. తాజాగా ఏడాది పాటు అన్‌లిమిటెడ్ గా 5జీ డేటాను అందించేందుకు రూ.601 డేటా వోచర్ తీసుకొచ్చింది. దీన్ని మై జియో యాప్‌లో కొనుగోలు చేసి యాప్‌లోనే యాక్టివేచ్ చేసుకోవచ్చు. అంతే కాదు ఈ వోచర్‌ను తమ స్నేహితులకూ గిఫ్ట్ మాదిరిగా అందించవచ్చని జియో వెల్లడించింది. ఇంత తక్కువ ధరలో 5జీ డేటా అందించే ప్లాన్స్ వేరే నెట్ వర్క్ లలో లేవనే చెప్పాలి. మరి డేటా ఎక్కువగా వినియోగించే వారు జియో తీసుకొచ్చిన ఈ కొత్త ప్లాన్ పై ఓ లుక్కేయండి. జియో తీసుకొచ్చిన ఈ కొత్త ప్లాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio