iDreamPost
android-app
ios-app

యూజర్లకు Jio దీపావళి ధమాకా ఆఫర్.. ఈ ప్లాన్లతో రీచార్జ్ చేస్తే.. ఏకంగా 3000 లాభం

Jio Diwali Dhamaka offer: జియో కస్టమర్లకు రిలయన్స్ జియో బంపరాఫర్ ప్రకటించింది. దీపావళి ధమాకా ఆఫర్ పేరిట 3 వేలు లాభం చేకూరేలా ఆఫర్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్లతో రీచార్జ్ చేసుకుంటే ఈ ప్రయోజనాలను పొందొచ్చు.

Jio Diwali Dhamaka offer: జియో కస్టమర్లకు రిలయన్స్ జియో బంపరాఫర్ ప్రకటించింది. దీపావళి ధమాకా ఆఫర్ పేరిట 3 వేలు లాభం చేకూరేలా ఆఫర్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్లతో రీచార్జ్ చేసుకుంటే ఈ ప్రయోజనాలను పొందొచ్చు.

యూజర్లకు Jio దీపావళి ధమాకా ఆఫర్.. ఈ ప్లాన్లతో రీచార్జ్ చేస్తే.. ఏకంగా 3000 లాభం

దేశ వ్యాప్తంగా దీపావళి ఫెస్టివల్ సందడి షురువైంది. ప్రజలంతా దీపావళిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇదే సమయంలో ఆటో మొబైల్ కంపెనీలు, షాపింగ్ మాల్స్, ఎలక్ట్రానిక్ కంపెనీలు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. తమ సేల్స్ ను పెంచుకునేందుకు తమ ప్రొడక్టులపై డిస్కౌంట్ ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దిగ్గజ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన యూజర్ల కోసం దీపావళి ధమాకా ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ లో భాగంగా ఎంపిక చేసిన రీచార్జ్ ప్లాన్లతో రీచార్జ్ చేసుకుంటే 3 వేల 350 రూపాయల లాభం పొందొచ్చు. అయితే ఇది నగదు రూపంలో మాత్రం కాదు. ఓచర్ల రూపంలో జియో తన కస్టమర్లకు అందించనున్నది.

ఈ ఆఫర్స్ అక్టోబర్ 25 నుంచి అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ ఆఫర్స్ నవంబర్ 5 వరకు అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇటీవల రీచార్జ్ ప్లాన్స్ ధరలను భారీగా పెంచిన జియో మళ్లీ కస్టమర్ల కోసం తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందించే ప్లాన్స్ ను తీసుకొస్తున్నది. ఇప్పుడు దీపావళి ఆఫర్ కూడా ప్రకటించడంతో జియో యూజర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జియో దీపావళి ధమాకా ఆఫర్ ద్వారా యూజర్లు జియో ట్రూ 5జీ త్రైమాసికం నుంచి వార్షిక ప్రీ పెయిడ్ ప్లాన్లపై ట్రావెల్స్ పోర్టళ్లు, ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్స్, ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ల ద్వారా రూ.3,350 వరకూ ఫ్రీ ఓచర్లు అందుకోవచ్చు. ఇందులో హోటళ్లలో బస చేసినా, విమాన ప్రయాణం చేసినా వినియోగించుకునేందుకు రూ.3000 విలువైన ఈజ్ మై ట్రిప్ వోచర్ అందిస్తుంది.

రూ.999, అంత కంటే ఎక్కువ ప్లాన్ కొనుగోలు చేస్తే అజియో నుంచి రూ.200 విలువైన కూపన్, సెలెక్టెడ్ రీచార్జీ ప్లాన్లతో రూ.150 విలువైన స్విగ్గీ ఓచర్ పొందొచ్చు. ఈ ఓచర్లు, కూపన్లు ప్రీపెయిడ్ ప్లాన్లు రీచార్జి చేసుకున్న తర్వాత వారి ఖాతాలో క్రెడిట్ అవుతాయి. వాటిని రీడిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. మై జియో యాప్ లోకి వెళ్లి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక జియో అందించే 899 ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. దీంతో ట్రూ అన్ లిమిటెడ్ 5జీ బెనిఫిట్లు పొందొచ్చు. అన్ లిమిటెడ్ కాల్స్, రోజూ 2జీబీ డేటా, 90 రోజుల్లో అదనంగా 20 జీబీ డేటా లభిస్తుంది రోజుకు 100 smsలు పొందొచ్చు. రూ.3599లతో కూడిన వార్షిక ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే రోజూ 2.5 జీబీ డేటా అందిస్తుంది. అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 smsలు పొందొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం జియో అందించే ఈ ప్లాన్స్ తో రీచార్జ్ చేసుకుని 3 వేల 350 రూపాయల ప్రయోజనాలను అందుకోండి.