iDreamPost
android-app
ios-app

ఓలా-ఉబర్ కొత్త ప్లాన్.. ఇక డ్రైవర్లతో పాటు రైడర్లకు లాభమే

పనిపై బయటకు వెళ్లాలన్నా, టైం అయిపోతుంది ఆఫీసుకు వెళ్లాలన్నా.. బస్సులు దొరకవన్న కంగారు పుట్టినా.. ముందుగా ఆశ్రయించేది రైడింగ్ యాప్స్ నే. మన నుంచున్న చోటు నుండే గమ్యస్థానాలకు చేర్చే ఈ యాప్స్ ప్రయాణీకులకు బాసటగా నిలుస్తున్నాయి. అయితే కొన్నిసార్లు ఊహించని విధంగా చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో..

పనిపై బయటకు వెళ్లాలన్నా, టైం అయిపోతుంది ఆఫీసుకు వెళ్లాలన్నా.. బస్సులు దొరకవన్న కంగారు పుట్టినా.. ముందుగా ఆశ్రయించేది రైడింగ్ యాప్స్ నే. మన నుంచున్న చోటు నుండే గమ్యస్థానాలకు చేర్చే ఈ యాప్స్ ప్రయాణీకులకు బాసటగా నిలుస్తున్నాయి. అయితే కొన్నిసార్లు ఊహించని విధంగా చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో..

ఓలా-ఉబర్ కొత్త ప్లాన్.. ఇక డ్రైవర్లతో పాటు రైడర్లకు లాభమే

ఇంటి నుండి పనిపై బయటకు వెళ్లాలనుకునుకున్నా, ఆఫీసుకు త్వరగా చేరుకోవాలనుకున్నా, బస్సులు వేళకు దొరకవన్న ఆందోళన కలిగినా, ఎండలో షాపింగ్, సినిమాలకు వెళ్లాలన్నా, వర్షం వస్తుందని త్వరగా ఇంటికి చేరాలనుకున్నా వెంటనే రైడింగ్ యాప్స్‌ను ఆశ్రయిస్తుంటారు. ఇంట, బయట ఎక్కడి  నుండి ఎక్కడి కైనా వెళ్లాలంటే ఓలా, ఉబర్ వంటి రైడ్స్ యాప్స్ ఓపెన్ చేసి.. రైడ్ బుక్ చేసుకుని వెళుతుంటారు. బైక్ అండ్ ఆటో అండ్ కార్ రైడ్ సర్వీసులను అందిస్తున్నాయి ఈ కంపెనీలు. అయితే ఈ ప్రయాణాలు ఒక్కొక్కసారి భారంగా మారుతున్నాయి. గతంలో చూపించిన దాని కన్నా డబుల్, త్రిబుల్ రేట్లు కూడా చూపిస్తున్నాయి. దీనికి  ఆయా సంస్థలు తీసుకుంటున్న కమిషన్ విధానాలే అని తెలుస్తోంది.

ఈ విధానం వల్ల అటు డ్రైవర్లకు, ఇటు ప్రయాణీకులకు నష్టం వాటిల్లుతుంది. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు ఓలా అండ్ ఊబర్ కంపెనీలు కొత్త ఫీచర్‌ను తీసుకు వచ్చాయి. దీంతో ప్రయాణీకులు మరింత చౌకగా జర్నీ చేయవచ్చునట. ఓలా, ఉబర్ సంస్థలు తమ ఫ్లాట్ ఫారమ్‌లలో ఆటో రిక్షా డ్రైవర్ల కోసం సబ్ స్క్రిప్షన్ ఆధారిత ప్లాన్‌లను అందించనున్నాయట. దీంతో ప్రతి రైడ్ పై ఆయా కంపెనీలు కమీషన్ వసూలు చేయడం తగ్గుతుంది.  తద్వారా  రైడర్ పై అదనపు భారం పడదని తెలుస్తోంది. కాగా, ఓలా ఈ విధానాన్ని ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో తీసుకు వచ్చినట్లు సమాచారం.

ఇక ఉబర్.. చెన్నై, కొచ్చి, విశాఖ పట్నంలో ఈ విధానాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ సబ్ స్క్రిప్షన్ ఆధారిత ప్లాన్ వల్ల.. ఓలా అండ్ ఉబర్ ఆటో రిక్షా రైడ్‌లపై వర్తించే జీఎస్టీ 5 శాతం పన్ను ఉండదని తెలుస్తోంది. కాగా, ఓలా-ఉబ్ ఇప్పటి వరకు కమిషన్ బేస్‍ను అనుసరిస్తున్నాయి. ప్రతి రైడ్‪కు చార్జీలో కమీషన్‌గా కొంత వాటాను తీసుకుని.. మిగిలిన మొత్తాన్ని తమతో టై అప్ అయిన డ్రైవర్లకు పంపుతుంది. అయితే ఈ కొత్త విధానం ప్రకారం.. ప్లాట్ ఫారమ్ వల్ల కస్టమర్లు, డ్రైవర్లకు మధ్య వారధిగా పనిచేయనుంది. ఇందుకోసం డ్రైవర్ల భాగస్వాముల నుండి రోజుకు లేదా వారానికి నిర్థిష్టమైన సబ్ స్క్రిప్షన్ రుసుమును వసూలు చేస్తుంది. దీని వల్ల డ్రైవర్లు, ఇటు కస్టమర్లకు లాభం చేకూరనున్నట్లు తెలుస్తోంది.