iDreamPost
android-app
ios-app

గుడ్‌ న్యూస్‌.. మరోసారి తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. కొత్త రేట్లు ఇవే!

  • Published Sep 01, 2023 | 8:24 AM Updated Updated Sep 01, 2023 | 8:24 AM
  • Published Sep 01, 2023 | 8:24 AMUpdated Sep 01, 2023 | 8:24 AM
గుడ్‌ న్యూస్‌.. మరోసారి తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. కొత్త రేట్లు ఇవే!

రాఖీ పండుగకు ముందే.. కేంద్ర ప్రభుత్వం.. గ్యాస్‌ ధర తగ్గిస్తూ.. సామాన్యులకు భారీ శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అదలా ఉంచితే.. ప్రతి నెల ప్రారంభంలో.. చమురు కంపెనీలు..సిలిండర్‌ ధరలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ క్రమంలో తాజాగా సెప్టెంబర్‌ నెల మొదటి రోజునే చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. గ్యాస్‌ సిలిండర్‌ ధరను ఏకంగా 157 రూపాయల మేర తగ్గించాయి. ఆ వివరాలు..

చమురు కంపెనీలు.. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను వరుసగా మూడో నెల కూడా భారీగా తగ్గించాయి. ఈ నెల 19 కిలోల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ ధరను ఏకంగా రూ. 157 మేర తగ్గించేశాయి. సెప్టెంబర్‌ 1 నుంచే అనగా నేటి నుంచి ఈ ధర అమల్లోకి వస్తుంది. తాజాగా తగ్గించిన ధరల ప్రకారం నేడు ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1522కు దిగి వచ్చింది. ఇది వరకు ఈ ధర రూ. 1680గా ఉండేది. ఇక కోల్‌కతాలో సిలిండర్ ధర రూ. 1636కు దిగి వచ్చింది. అలానే ముంబైలో చూసుకుంటే ఈ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1640 నుంచి రూ. 1482కు దిగి వచ్చింది.

ఇక రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం ఆగస్ట్ 30 నుంచే అమలులోకి వచ్చింది. దీని వల్ల 33 కోట్ల మంది లబ్ధిదారులకు ఊరట లభించింది. ఇక తాజాగా కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర కూడా తగ్గడం ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు.