iDreamPost

భారీ ఊరట.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర ఎంతంటే..!

  • Published Jun 05, 2024 | 8:15 AMUpdated Jun 05, 2024 | 8:15 AM

Gas Cylinder Price: సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వేళ సామాన్యులకు భారీ ఊరట కలిగించే వార్త చెప్పాయి చమురు కంపెనీలు. గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఆ వివరాలు..

Gas Cylinder Price: సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వేళ సామాన్యులకు భారీ ఊరట కలిగించే వార్త చెప్పాయి చమురు కంపెనీలు. గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఆ వివరాలు..

  • Published Jun 05, 2024 | 8:15 AMUpdated Jun 05, 2024 | 8:15 AM
భారీ ఊరట.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర ఎంతంటే..!

సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. ఇక దేశంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది. గతంలో భారీ మెజార్టీ సాధించిన ఎన్డీఏ కూటమి.. ఈ సారి బోటాబోటి సీట్లు సాధించి.. మూడో సారి అధికారంలోకి రానుంది. అటు ఇండియా కూటమి కూడా భారీగా పుంజుకుంది. ఎన్డీఏకు గట్టిపోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో కేంద్రంలో ఏ కూటమి అధికారంలోకి రానుందనే దాని మీద తీవ్ర ఉత్కంఠత నెలకొని ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఏపీ, బిహార్‌ సర్కార్‌లు కీలకంగా మారనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో పర్యటించేందుకు కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్‌ రంగంలోకి దిగారు. మరి ఈ చర్చలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో.. కేంద్రంలో ఏ కూటమి అధికారంలోకి వస్తుందో తెలియాలంటే.. మరి కొన్ని రోజులు ఎదురు చూడాలి. ఇదిలా ఉండగానే.. సార్వత్రిక ఎన్నికలు ముగియగానే.. సామాన్యులకు భారీ ఊరట కలిగించే న్యూస్‌ తెలిసింది. అదే సిలిండర్‌ రేటు దిగి వచ్చింది. ఆ వివరాలు..

ఎన్నికలకు ముందు అప్పటి నరేంద్ర మోదీ.. గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధరను రెండు పర్యాయాల్లో 300 రూపాయల మేర తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సార్వత్రిక ఎన్నికలు ముగియగానే.. మరో సారి గ్యాస్‌ సిలిండర్‌ ధర దిగి వచ్చింది. అయితే ఈసారి తగ్గింది కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర. ప్రభుత్వ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు వరుసగా మూడో నెలలోనూ కమర్షియల్‌ గ్యాస్‌ రేటను తగ్గించాయి. దీంతో చిరువ్యాపారులకు కాస్త ఉపశమనం లభించినట్టయింది. దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను 69.50 రూపాయల మేర తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శనివారం ప్రకటించాయి. కమర్షియల్, డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల రేట్లను ప్రతి నెల మొదటి రోజున ఆయిల్ కంపెనీలు సమీక్షిస్తుంటాయి. అందులో భాగంగా తాజా ధరల సవరణ చేపట్టాయి.

Reduced gas cylinder price

దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను 69.50 రూపాయల మేర తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.. సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి. కాగా తాజా తగ్గింపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,676 లు, కోల్‌కతాలో రూ. 1,787లు, ముంబైలో రూ.1,629లు, చెన్నైలో రూ. 1,840లకు దిగి వచ్చాయి. అయితే కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గడం వరుసగా ఇది మూడో సారి. మే 1న కూడా రూ.19 మేర, అంతకుముందు ఏప్రిల్‌లో రూ.30.50 మేర తగ్గింది. దీంతో ఆర్థిక సవాళ్ల మధ్య నిర్వహణ ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారస్తులకు ఈ నిర్ణయం కొంత ఉపశమనాన్ని కలిగించనుంది. కాగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు యథాతథంగా ఉండనున్నాయి. ఈ గ్యాస్ ధరలను ఆయిల్ కంపెనీలు సవరించలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి