Dharani
Gas Cylinder Price: నెల ప్రారంభం కాగానే గ్యాస్ సిలిండర్ ధరలు మారుతుంటాయి. జూలై నెల మొదలైంది.. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. ఆ వివరాలు..
Gas Cylinder Price: నెల ప్రారంభం కాగానే గ్యాస్ సిలిండర్ ధరలు మారుతుంటాయి. జూలై నెల మొదలైంది.. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. ఆ వివరాలు..
Dharani
సమాజంలో ప్రతి దాని ధరలు భారీగా పెరుగుతున్నాయి. వంట నూనెలు మొదలు, కూరగాయల ధరల వరకు ప్రతి దాని రేటు పెరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇక గత కొంత కాలంగా ఉల్లి, టమాటా రేట్లు పైపైకి దూసుకుపోతున్నాయి. వీటన్నింటిలో కాస్త ఊరట కలిగించే అంశం ఏంటి అంటే.. గ్యాస్ సిలిండర్ ధరలు. గృహ అవసరాల కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం గత ఏడాది నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఇక డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు.. 300 రూపాయల వరకు తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు మాత్రం భారీగానే పెరుగుతూ వస్తోంది. అయితే నెల ప్రారంభం కాగానే చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించడం, పెంచడం వంటి నిర్ణయాలు తీసుకుంటాయి. జూలై నెల ప్రారంభం అయ్యింది. ఈ క్రమంలో చమురు కంపెనీలు వినయోగదారులకు భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నాయి. ఆ వివరాలు..
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం జూలైలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో బడ్జెట్‌కు ముందు సామాన్యులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. గృహ వినయోగం కోసం ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధర స్థిరంగా ఉండగా.. కమర్షియల్ గ్యాస్ ధర మాత్రం దిగి వచ్చింది. ఈ క్రమంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.30 తగ్గించాయి. ఐఓసీఎల్ వెబ్‌సైట్ ప్రకారం తగ్గించిన ఎల్‌పీజీ ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటను తగ్గించిన చమురు కంపెనీలు.. 14.2 కిలోల గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.
ఇక చమురు కంపెనీలు గత నాలుగు నెలల నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ వస్తూ ఉన్నాయి. ఇక జూలై నెలలో కూడా రేటు తగ్గింది. నేడు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1646గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 1903.50, కోల్‌కతాలో రూ.1756కి అందుబాటులో ఉండగా, ముంబైలో రూ.1598, చెన్నైలో సిలిండర్ రూ.1809గా ఉన్నాయి.
మరోవైపు దేశీయ గ్యాస్ సిలిండర్ల ధరలు ఈ ఏడాది మార్చి 9 నుంచి నిలకడగా కొనసాగుతున్నాయి. గత 10 నెలల్లో ప్రభుత్వం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.300 తగ్గించింది. రానున్న రోజుల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు ఉండదని భావిస్తున్నారు.