iDreamPost
android-app
ios-app

ఒబెరాయ్ గ్రూప్ ఛైర్మన్ పృథ్వి రాజ్ సింగ్ ఒబెరాయ్ మృతి

  • Published Nov 14, 2023 | 12:28 PMUpdated Nov 14, 2023 | 12:28 PM

లగ్జరీ హోటళ్లకు మారుపేరుగా నిలిచిన ఒబెరాయ్‌ హోటల్స్‌ ఛైర్మన్‌ పృథ్వీరాజ్‌ సింగ్‌ ఒబెరాయ్‌ మంగళవారం తుది శ్వాస విడిచారు. ఆ వివరాలు..

లగ్జరీ హోటళ్లకు మారుపేరుగా నిలిచిన ఒబెరాయ్‌ హోటల్స్‌ ఛైర్మన్‌ పృథ్వీరాజ్‌ సింగ్‌ ఒబెరాయ్‌ మంగళవారం తుది శ్వాస విడిచారు. ఆ వివరాలు..

  • Published Nov 14, 2023 | 12:28 PMUpdated Nov 14, 2023 | 12:28 PM
ఒబెరాయ్ గ్రూప్ ఛైర్మన్ పృథ్వి రాజ్ సింగ్ ఒబెరాయ్ మృతి

ఒబెరాయ్‌ హెటల్స్‌ అనగానే లగ్జరీకి, మరుపురాని ఆతిథ్యానికి ప్రతినిధులుగా గుర్తుకు వస్తాయి. ప్రస్తుతం ఈ హోటల్స్‌ మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. అయితే తాజాగా ఓ విషాదం చోటు చేసుకుంది. ఒబెరాయ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ పృథ్వి రాజ్‌ సింగ్‌ ఒబెరాయ్‌ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ మేరకు ఒబెరాయ్‌ గ్రూప్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

తమ ప్రియతమ నాయకుడు పీఆర్ఎస్ ఒబెరాయ్ మృతి చెందాడని తెలియజేయడానికి చింతిస్తున్నట్లు ఒబెరాయ్‌ గ్రూప్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఆయన మరణం ఒబెరాయ్ గ్రూప్‌తో పాటు భారత్ సహా విదేశీ ఆతిథ్య రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన విస్తరించిన హోటల్స్‌.. ఇండియాలోనే కాక.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆతిథ్య రంగాన్ని ప్రభావితం చేస్తాయని తెలిపారు.

పీఆర్ఎస్ ఒబెరాయ్ అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరగనున్నాయని ఒబెరాయ్ గ్రూప్ ప్రకటించింది. ఢిల్లీలోని పకషేరాలో ఉన్న భగవంతి ఒబెరాయ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఫామ్‌లో పీఆర్‌ఎస్‌ ఒబెరాయ్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఒబెరాయ్ గ్రూప్ 1934లో ఏర్పాటైంది. ప్రస్తుతం ఇది ఢిల్లీ ప్రధాన కేంద్రంగా సేవలందిస్తోంది.  ఒబెరాయ్‌ గ్రూప్‌కు సంబంధించి.. ప్రపంచవ్యాప్తంగా  7 దేశాల్లో 32 లగ్జరీ హోటళ్లు, 7 క్రూయిజ్ షిప్పులు ఉన్నాయి.

హోటల్స్‌, అతిథ్య రంగాల్లో పృథ్వీరాజ్‌ సింగ్‌ ఒబెరాయ్‌ చేసిన అసాధారణ సేవకు గాను 2008, జనవరిలో ఆయనకు.. భారత ప్రభుత్వం.. దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌ని ప్రధానం చేసింది. అంతేకాక ఒబెరాయ్ గ్రూప్‌ను ప్రపంచంలోని ప్రముఖ లగ్జరీ హోటళ్లలో ఒకటిగా అభివృద్ధి చేయడంలో పీఆర్ఎస్ ఒబెరాయ్ చూసిన అసాధారణ ప్రతిభ, దూరదృష్టి, సహకారానికిగానూ.. ది ఇంటర్నేషనల్ లగ్జరీ ట్రావెల్ మార్కెట్  (ఐఎల్‌టీఎమ్‌) 2012, డిసెంబర్‌లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేసింది. అలాగే హోటల్స్ మ్యాగజైన్ 2010లో పీఆర్ఎస్ ఒబెరాయ్‌ని  కార్పొరేట్ హోటెలర్ ఆఫ్ ది వరల్డ్‌ 2010గా గుర్తించింది.  పృథ్వీరాజ్‌ ఒబెరాయ్‌ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి