iDreamPost

EPFO: ఈకేవైసీ విషయంలో కీలక ప్రకటన చేసిన EPFO!

ఈపీఎఫ్‌ క్లెయిమ్‌ల సత్వర పరిష్కారానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ మార్గం సుగమమైంది. క్లెయిమ్‌తో పాటు చెక్, బ్యాంకు పాస్‌పుస్తకం విషయంలో చందాదారులకు వెసులుబాటు కల్పించింది.

ఈపీఎఫ్‌ క్లెయిమ్‌ల సత్వర పరిష్కారానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ మార్గం సుగమమైంది. క్లెయిమ్‌తో పాటు చెక్, బ్యాంకు పాస్‌పుస్తకం విషయంలో చందాదారులకు వెసులుబాటు కల్పించింది.

EPFO: ఈకేవైసీ విషయంలో కీలక ప్రకటన చేసిన EPFO!

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉద్యోగం చేసే దాదాపు ప్రతి ఒక్కరికి ఈ  ఖాత కలిగి ఉంటారు. వివిధ సందర్భాల్లో అవసరం నిమిత్తం ఈపీఎఫ్ఓ డబ్బులు ఉపయోగ పడతాయి. ఇక వినియోగదారుల విషయంలో ఈ సంస్థ తరచూ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది. అలానే ఖాతాదారులకు  తరచూ గుడ్‌న్యూస్ అందిస్తుంది. అదే విధంగా ఉద్యోగులకు ఉన్న సందేహాలపై కీలక ప్రకటన చేస్తూ ఉంటుంది. పీఎఫ్ అకౌంట్ లోని వడ్డీ జమ విషయంలో తలెత్తుతున్న అనుమానాలపై స్పష్టత ఇస్తూ ఉంటుంది. తాజాగా ఈకేవైసీ విషయంలో ఈపీఎఫ్ఓ ఈ కీలక ప్రకటన చేసింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఈపీఎఫ్‌వో విషయంలో తరచూ కొన్ని సమస్యలు వస్తుంటాయి. అయిలే అలాంటి వాటిని సత్వర పరిష్కారానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ మార్గం సుగమమైంది. చెక్, బ్యాంకు పాస్‌పుస్తకం కాపీ ఇవ్వలేదంటూ క్లెయిమ్‌ తిరస్కరించకుండా ఖాతాదారులకు మంచి వెసులుబాటు కల్పించింది. అయితే ఇక్కడ ఖాతాదారుడు ఓ  విషయాన్ని గుర్తుంచుకోవాలి.  కస్టమర్ బ్యాంకు ఖాతా వివరాల కేవైసీ ఆమోదించిన వారికే ఈ సదుపాయం లభిస్తుంది. కాబట్టి ఈ కేవైసీని చేయించుకోవడం తప్పనిసరి. దీని కోసం కస్టమర్ ఖాతా వివరాలను బ్యాంకు, ఎన్‌పీసీఐ ఆధార్‌ , కేవైసీ ద్వారా ధ్రువీకరణ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

అలా చేసిన ఆధార్ తో లింకైన ఈకేవైసీ లకు క్లెయిమ్‌లకు చెక్, బ్యాంకు పాస్ పుస్తకం జతచేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ సందర్భంగా ఈపీఎఫ్ వో ఓ నోట్ ను విడుదల చేసింది. ఆధార్‌ కేవైసీ లింక్ పూర్తయిన ఖాతాదారులు క్లెయిమ్‌లపై ఓ నోట్ ను విడుదల చేసింది. అందులో ‘బ్యాంకు కేవైసీ ఆన్‌లైన్లో ధ్రువీకరణ పూరైతే, చెక్, పాస్‌ పుస్తకం జతచేయాల్సిన అవసరం లేదు’ అని క్లెయిమ్‌ దరఖాస్తులో నోట్‌ ఉంటుందని ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది. ఈ సమాచారం ఆధారంగా ఎంప్లాయిస్ క్లెయిమ్‌ అప్లికేషన్ ను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా ఈపీఎఫ్ వో చేసిన ఈ ప్రకటన పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈపీఎఫ్ వో చేసిన ఈ నోట్ ప్రకటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి