iDreamPost
android-app
ios-app

Nissan Magnite Facelift: నిస్సాన్‌ మాగ్నైట్‌ ఫేస్‌లిఫ్ట్ విడుదల అప్పుడే.. తక్కువ ధర, అదిరే ఫీచర్లు!

  • Published Sep 14, 2024 | 5:04 PM Updated Updated Sep 14, 2024 | 5:04 PM

Nissan Magnite Facelift: స్టైలిష్ మాగ్నైట్ ఎస్‌యూవీ కార్ ని అప్‌డేటెడ్ 'మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్' గా డిజైన్ చేశారు. త్వరలో ఈ మోడల్‌ని విడుదల చేయడానికి కంపెనీ రెడీ అవుతుంది. ఇక ఈ సూపర్ కార్ ఫీచర్స్ ఏంటి? దీని ధర ఎంత? ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివారాలు గురించి తెలుసుకుందాం.

Nissan Magnite Facelift: స్టైలిష్ మాగ్నైట్ ఎస్‌యూవీ కార్ ని అప్‌డేటెడ్ 'మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్' గా డిజైన్ చేశారు. త్వరలో ఈ మోడల్‌ని విడుదల చేయడానికి కంపెనీ రెడీ అవుతుంది. ఇక ఈ సూపర్ కార్ ఫీచర్స్ ఏంటి? దీని ధర ఎంత? ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివారాలు గురించి తెలుసుకుందాం.

Nissan Magnite Facelift: నిస్సాన్‌ మాగ్నైట్‌ ఫేస్‌లిఫ్ట్  విడుదల అప్పుడే.. తక్కువ ధర, అదిరే ఫీచర్లు!

నిస్సాన్‌ కార్లకు ఇంటర్నేషనల్ రేంజిలో మంచి డిమాండ్‌ ఉంది. ఇక ఆ ఆ కంపెనీ అందించే కార్లలో నిస్సాన్‌ మాగ్నైట్‌ కి అయితే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ఆ రేంజిలో జనాలు ఈ కారుని కొనుగోలు చేస్తున్నారు. ఇక ఈ నిస్సాన్ మాగ్నైట్‌ మార్కెట్లో మనకు XE, XL, XV, ఇంకా XV ప్రీమియం అనే వేరియంట్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ మాగ్నైట్ 2020లో ఇండియన్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఈ సూపర్ ఎస్‌యూవీ కార్ క్లిక్ అయ్యింది. జనాల నుంచి డిమాండ్‌ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ స్టైలిష్ మాగ్నైట్ ఎస్‌యూవీ కార్ ని అప్‌డేటెడ్ ‘మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్’ గా డిజైన్ చేశారు. త్వరలో ఈ మోడల్‌ని కూడా ఇండియాలో విడుదల చేయడానికి కంపెనీ రెడీ అవుతుంది. ఇక ఈ సూపర్ కార్ ఫీచర్స్ ఏంటి? దీని ధర ఎంత? ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివారాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ కార్ పవర్ ఫుల్ ఇంజిన్‌తో వస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ కారు రెండు ఇంజిన్ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంది. ఇది 1-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. అలాగే ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ / 5-స్పీడ్ ఆటోమేటిక్, సీవీటీ గేర్‌బాక్స్‌ ఉంటాయి.ఇది 5-సీటర్ కార్. వినియోగదారులను ఆకర్షించే అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉంటాయట. ఈ కారులో 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, సింగిల్ పేన్‌ సన్‌రూఫ్ ఇంకా అలాగే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉండనున్నాయి. ఈ కారులో 336 లీటర్ల బూట్‌ స్పేస్‌ ఉంది. ఇది ప్రయాణికులకు మంచి సేఫ్టీని అందిస్తుంది. ప్రస్తుతం డ్యూయల్‌ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్‌ మాత్రమే ఉన్నాయి. త్వరలో రాబోయే ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌లోని అన్ని వేరియంట్లలో 6-ఎయిర్ బ్యాగ్స్‌ అందించనున్నారు. టీపీఎంఎస్ (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరేజ్‌లు, 360 డిగ్రీల కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా రానున్నాయి.

ఈ సరికొత్త ఎస్‌యూవీ కార్ ని నిస్సాన్ కంపెనీ అక్టోబర్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటిచింది. త్వరలో రాబోతున్న ఈ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌లో భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కార్ డిజైన్‌, ఇంటీరియర్‌ ఇంకా సేఫ్టీ ఫీచర్లను అప్‌డేట్ అవుతాయని తెలుస్తుంది. ఈ కారుకి ఉన్న డిమాండ్‌ మాములుగా లేదు. అందుకే దీని సేల్స్ బాగా పెంచుకోవడానికి కంపెనీ ఇంకా ఎన్నో అప్‌గ్రేడ్స్‌తో ఈ ఎస్‌యూవీని విడుదల చేయనుంది.అందుకే ఈ సరికొత్త నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని ఆకట్టుకునే కొత్త డిజైన్‌తో తీసుకురానున్నారు. ఈ కార్ ఫ్రంట్‌ లో అప్‌గ్రేడెడ్ గ్రిల్, కొత్త బంపర్, రీడిజైన్‌తో వచ్చే హెడ్ లైట్స్‌, ఢిఫరెంట్‌ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్‌ డిజైన్‌లో కంపెనీ ఆకట్టుకునే మార్పులు చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇక కొన్ని రోజుల క్రితమే ఆన్‌లైన్‌ లో ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ ఫోటోలు లీక్ అయ్యాయి. ఇక ఈ కార్ ధర విషయానికి వస్తే..దీని ధర రూ.6.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండొచ్చని తెలుస్తుంది.