iDreamPost
android-app
ios-app

సామాన్య మహిళలకు గుడ్ న్యూస్.. సబ్సిడీపై రూ.3 లక్షల రుణం!

  • Published Feb 20, 2024 | 6:22 PMUpdated Feb 20, 2024 | 6:55 PM

ఈ మధ్యకాలంలో చాలామంది మహిళలు వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. అయితే ఇలా వ్యాపారం చేసుకొనే మహిళలకు ప్రభుత్వం ఓ మంచి శుభవార్త తెలియజేసింది. అదేమిటంటే..

ఈ మధ్యకాలంలో చాలామంది మహిళలు వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. అయితే ఇలా వ్యాపారం చేసుకొనే మహిళలకు ప్రభుత్వం ఓ మంచి శుభవార్త తెలియజేసింది. అదేమిటంటే..

  • Published Feb 20, 2024 | 6:22 PMUpdated Feb 20, 2024 | 6:55 PM
సామాన్య మహిళలకు గుడ్ న్యూస్.. సబ్సిడీపై  రూ.3 లక్షల రుణం!

సమాజంలో అప్పటికీ, ఇప్పటికీ లింగ వివక్ష అనేది తరతరాలుగా కొనసాగుతునే ఉంది. అయితే ప్రస్తుత కాలంలో మాత్రం పురుషులకంటే, మహిళలు ఎందులోను తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ముఖ్యంగా.. మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం కేంద్ర ప్రభుత్వం వారి గురించి అనేక పథకాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ పథకాలు చాలామంది పేద మహిళలకు వ్యాపారం చేసుకుని మెరుగుపడేందుకు తోడ్పడుతాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త తెలియజేసింది. వ్యాపారం చేసుకొనే మహిళలకు ఇది మంచి ఆవకాశమని చెప్పవచ్చు. ఇంతకి ఆ పథకం ఏమిటంటే..

ఈ మధ్యకాలంలో వ్యాపార రంగంలోని మహిళలదే పై చేయి. ఇలా వ్యాపారం చేసుకొనే వారికి ఆర్థిక సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదేమిటంటే.. వ్యాపారం చేయాలనుకునే మహిళలకు ‘ఉద్యోగిని యోజన’ కింద బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు. అయితే ఈ పథకంలో ప్రభుత్వం 30 శాతం వరకు సబ్సిడీని అందిస్తుంది. పైగా ఈ పథకం కింద గరిష్టంగా రూ.3 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. అయితే ఈ పథకానికి అర్హులు అయిన మహిళల వయసు కనీసం 18 నుంచి 55 ఏళ్ల మధ్య వరకు ఉండాలి. అలాగే బ్యాంకు రుణానికి వారు ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ, ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు కొన్ని షరతులు ఉన్నాయి.

ఒక మహిళ కుటుంబ ఆదాయం కనీసం రూ.1.5 లక్షలు కానీ అంతకంటే తక్కువై ఉండాలి. అలాగే ఇందులో వితంతువులు, వికలాంగులు అయిన మహిళలకు మాత్రం ఆదాయ పరిమితి లేదు. అయితే, ఈ లోన్ కోసం మహిళలు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, ఈ లోన్ కోసం ప్రతిఒక్కరు ఆధార్ కార్డు, అడ్రస్ ఫ్రూప్, బీపీఎల్ కార్డు, కుల ధృవీకరణ పత్రం వంటి పత్రాలను అందించాలి. సాధారణంగా మహిళలు ఏదైన లోన్ తీసుకుంటే.. తీసుకున్నా దానికంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కానీ,ఈ ఉద్యోగిని యోజన పథకంలో అలా కాదు. ఇందులో మీకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తుంది. అలాగే ఈ ఉద్యోగిని యోజన లోన్ కోసం మీరు ఏదైనా ప్రభుత్వ బ్యాంకు వెళ్లి కూడా తీసుకోవచ్చు. అయితే ఇందుకు కావాల్సిన కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. మరి, మహిళలు వ్యాపారం చేసుకొనుటకు అందుబాటులోకి వచ్చిన ఉద్యోగిని యోజన పథకం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి