Nidhan
Royal Enfield Classic 350: ప్రముఖ టూవీలర్ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కంపెనీ బైక్స్‌కు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇది రూపొందించిన వాటిల్లో బాగా అమ్ముడుపోయిన బైక్‌గా క్లాసిక్ 350 మోడల్‌ను చెప్పొచ్చు.
Royal Enfield Classic 350: ప్రముఖ టూవీలర్ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కంపెనీ బైక్స్‌కు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇది రూపొందించిన వాటిల్లో బాగా అమ్ముడుపోయిన బైక్‌గా క్లాసిక్ 350 మోడల్‌ను చెప్పొచ్చు.
Nidhan
ప్రముఖ టూవీలర్ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కంపెనీ బైక్స్‌కు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. యూత్‌తో పాటు అన్ని వయసుల వారికి నచ్చేలా బైక్స్‌ను తయారు చేయడం రాయల్ ఎన్ఫీల్డ్కు వెన్నతో పెట్టిన విద్య. బుల్లెట్ దగ్గర నుంచి హంటర్ 350 వరకు ఆ కంపెనీ తీసుకొచ్చిన చాలా మోడల్స్ సక్సెస్ అయ్యాయి. ఇది రూపొందించిన వాటిల్లో బాగా అమ్ముడుపోయిన బైక్‌గా క్లాసిక్ 350 మోడల్‌ను చెప్పొచ్చు. కాలేజీ, ఆఫీస్ యూజ్‌తో పాటు టూర్లకు వెళ్లేందుకు ఈ మోడల్‌ను వినియోగిస్తూ వచ్చారు. అన్ని రకాల కస్టమర్లకు ఫేవరెట్‌గా మారిన క్లాసిక్ 350ని అప్‌గ్రేడ్ చేసి మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చింది రాయల్ ఎన్ఫీల్డ్. దీని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ సరికొత్త 2024 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350ని ఆవిష్కరించింది. అత్యాధునిక ఫీచర్లతో ఈ బైక్‌ను అప్డేట్ చేసిన కంపెనీ.. సెప్టెంబర్ 1వ తేదీన భారత మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. ఈ బండి బుకింగ్‌లు, టెస్ట్ రైడ్లు కూడా అదే రోజు మొదలవుతాయి. సరికొత్త క్లాసిక్ 350 మొత్తంగా 5 వేరియంట్స్‌లో లభిస్తుంది. ఇందులో హెరిటేజ్, హెరిటేజ్ ప్రీమియం, సిగ్నల్స్, డార్క్, ఎమరాల్డ్ అనే 7 విభిన్నమైన కలర్ ఆప్షన్స్ ఉంటాయి. మద్రాస్ రెడ్, జోధ్‌పూర్ బ్లూ అనేవి హెరిటేజ్ వేరియంట్లో ఉన్నాయి. అదే హెరిటేజ్ ప్రీమియం వేరియంట్ అయితే మెడాలియన్ బ్రాంజ్ కలర్లో దొరుకుతుంది. సిగ్నల్స్ అయితే కమాండో శాండ్‌లో.. డార్క్ వేరియంట్ గన్ గ్రే కలర్, స్టెల్త్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో వస్తుంది. ఎమరాల్డ్ క్రోమ్, కాపర్ పిన్‌స్ట్రైప్ వేరియంట్లు కూడా ఉన్నాయి.
నయా క్లాసిక్ 350లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ పైలట్ ల్యాంప్‌తో పాటు క్లస్టర్ మీద గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఇస్తున్నారు. అలాగే టియర్ డ్రాప్ ట్యాంక్, టైప్-సీ యూఎస్బీ ఛార్జింగ్ పాయింట్‌ను అందిస్తున్నారు. డార్క్, ఎమరాల్డ్ వేరియంట్లలో ఎడ్జెస్టబుల్ లీవర్, ఎల్ఈడీ వింకర్‌లతో పాటు ట్రిప్పర్ ప్యాడ్ స్టాండర్డ్ ఫిట్మెంట్ ఉన్నాయి. ఇంజిన్ విషయంలో మార్పులు చేయలేదు. జే-సిరీస్ ఇంజిన్నే కొనసాగిస్తున్నారు. 349 సీసీ, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్, 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. 20.2 బీహెచ్పీ పవర్, 27 ఎన్ఎమ్ టార్క్‌ను ఈ బైక్ ఉత్పత్తి చేస్తుంది. కొనుగోలు చేసే వేరియంట్స్‌ను బట్టి ఫ్రంట్ సైడ్ 19 ఇంచ్ వీల్ (అలాయ్ లేదా స్పోక్), బ్యాక్ సైడ్ 18 ఇంచ్ వీల్‌ను పొందొచ్చు. ప్రస్తుత క్లాసిక్ 350 ధర రూ.1.93 లక్షల నుంచి రూ.2.25 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది. 2024 క్లాసిక్ 350 ధర పెరిగే ఛాన్స్ ఉంది.