Tirupathi Rao
ఇప్పుడు అందరూ కారు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఏ కారు కొనాలి? ఎంతలో కొనాలి? అనేది మాత్రం తెలియడం లేదు. అలాగే కొత్త కారు కొనాలా? సెంకడ్స్ లో కొనాలా అనే విషయంపై కూడా క్లారిటీ ఉండటం లేదు.
ఇప్పుడు అందరూ కారు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఏ కారు కొనాలి? ఎంతలో కొనాలి? అనేది మాత్రం తెలియడం లేదు. అలాగే కొత్త కారు కొనాలా? సెంకడ్స్ లో కొనాలా అనే విషయంపై కూడా క్లారిటీ ఉండటం లేదు.
Tirupathi Rao
కారు.. ఇప్పుడు అందరికీ అవసరంగా మారిపోయింది. మధ్యతరగతి వాళ్లు కూడా కారు కొనేందుకు ముందుకొస్తున్నారు. ఎందుకంటే కుటుంబంలో నలుగురు ఉంటే కారు అనేది అవసరంగా మారిపోయింది. అందుకే మిడిల్ క్లాస్ వాళ్లు కూడా కారుని కొనుగోలు చేస్తున్నారు. అందరి అవసరాలకు తగిన విధంగా.. బడ్జెట్, మైలేజ్, ఫీచర్స్ అన్నీ చెక్ చేసుకుని నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న అందరి మదిలో మెదులుతూ ఉంటుంది. అదేంటంటే.. కొత్త కారు కొనాలా? సెకండ్ హ్యాండ్ కారును కొంటే మంచిదా? ఎలాంటి కారు కొనాలి? ఈ ప్రశ్నకు చాలా మందికి సమాధానం తెలియదు. అయితే ఇది సింపుల్ గా చెప్పే ఆన్సర్ కాదు. కొన్ని పాయింట్స్ ని బట్టి నిర్ణయం తీసుకోవాలి.
మీరు ఏ కారు కొనాలి అనే నిర్ణయానికి వచ్చేకంటే ముందు మీకు మీ అవసరాలు తెలియాల్సిన అవసరం ఉంది. మీరు డైలీ పర్పస్ కోసం కారును కొంటున్నారా? సుదూర ప్రయాణాల కోసం కారును కొంటున్నారా? ఆఫీస్ పర్పస్ కోసం? జాబ్ రీత్యా కారును కొంటున్నారా? అనే దాన్ని బట్టి మీరు నిర్ణయానికి రావాలి. కుటుంబ అవసరాలు, వ్యక్తిగత వినియోగానికి అయితే మీరు సెకండ్ హ్యాండ్ కారుని కొనుగోలు చేయచ్చు. నెలలో ఎక్కువ కారు వాడే అవసరం లేకపోయినా కూడా మీరు సెకండ్ హ్యాండ్ కారుని కొనుగోలు చేయచ్చు. ఎక్కువగా ట్రావెల్ చేయడం, సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయడం, ఆఫీస్ కోసం, జాబ్ రీత్యా అయినా కూడా మీరు హుందాగా కనిపించాలి అంటే కొత్త కారుని ప్రిఫర్ చేయచ్చు.
మీకు కారు కొనాలి అనే ఆలోచన రాగానే.. ముందు బడ్జెట్ గురించి ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. అదిరిపోయే ఫీచర్లు, సరికొత్త మోడల్ అంటూ మీరు అనుకున్న బడ్జెట్ దాటేసి కారు కొంటే తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు కారు ఎంత అవసరమయినా కూడా.. బడ్జెట్ కి మించిపోతే అది మీ ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీస్తుంది. ఒక చిన్న పొరపాటుతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాంటప్పుడు కొత్త కారే కొనాలనేం లేదు. మీకు మరీ అవసరం అయితే.. కాస్త టైమ్ తీసుకుని సెకండ్స్ లో అయినా మంచి కారుని కొనుగోలు చేయచ్చు. కొన్నాళ్ల తర్వాత రీసేల్ చేయాలి అనుకునే వాళ్లు.. ముందే సెకండ్స్ కారు తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఎంత కొత్త కారు అయినా సెంకడ్స్ అనగానే వాల్యూ తగ్గిపోతుంది. అలాంటప్పుడు సెకండ్స్ కారు అయితేనే నష్టం రాకుండా ఉంటుంది.
కారు కొనేముందు మార్కెట్ గురించి మీరు బాగా తెలుసుకోవాలి. కొత్త కారు, ప్రీ ఓన్డ్ కారు దేని మీద ఎక్కువ డీల్స్ వస్తున్నాయో తెలుసుకోవాలి. కొందరు డీలర్స్ తో మాట్లాడాలి. కొన్నిసార్లు సెకండ్స్ లోనే చాలా మంచి కార్లు దొరుకుతాయి. తక్కువ తిరిగిన కొత్త కార్లు అందుబాటులో ఉంటాయి. అలాంటప్పుడు కొత్త కారు కొనడం కంటే కూడా ఎక్కువ ఆఫర్స్, తక్కువ ధరలో దొరికే ప్రీ ఓన్డ్ కారు కొనడమే మంచిది. కొన్నిసార్లు న్యూ కార్స్ మీద మంచి డీల్స్ ఉంటాయి. క్యాష్ బ్యాక్, డిస్కౌంట్స్, యాక్సెసరీస్ అంటూ చాలానే డీల్స్ ఉంటాయి. ఒక్కోసారి రూ.లక్షన్నర వరకూ బెనిఫిట్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. అలాంటప్పుడు మీరు కొత్త కారు కొనడమే మంచిదవుతుంది. డీల్స్ ని బట్టి నిర్ణయం తీసుకుంటే మంచిది.
కారు కొనాలి అంటే ముందు మంచి రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. మీ అవసరానికి తగ్గట్లు మార్కెట్లో ఎన్ని కార్లు ఉన్నాయి? ఆ కార్లు మైలేజ్, ధర, బెనిఫిట్స్ అన్నింటినీ కంపేర్ చేసుకోవాలి. మీరు ఆన్ లైన్ లోనే ఈ పనిని చేసుకోవచ్చు. అలాగే మీరు తీసుకోవాలి అనుకుంటున్న కారు.. ప్రీ ఓన్డ్ షోరూమ్స్ లో ఎంత ధరకు అందుబాటులో ఉంది? కొత్త కారుకంటే ఎక్కువ డిస్కౌంట్స్ తో మంచి కారు అందుబాటులో ఉంటే సెకండ్స్ లో కారుని తీసుకోవచ్చు. ధర పెద్దగా తేడా లేకపోతే కొత్త కారు కొనుగోలు చేయడమే మంచిది. అలాగే లోన్స్, ఈఎంఐలు, ఫైనాన్స్ వంటి అన్ని ఆప్షన్స్ ని చెక్ చేసుకోవాలి.
ఇలాంటి కొన్ని పాయింట్లు.. మీరు ఒక నిర్ణయం తీసుకునేందుకు దోహదపడతాయి. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది మీ అవసరం, మీ బడ్జెట్, కొత్త కారే ఎందుకు కొనాలి? ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని మీరు వేసుకుంటే కొత్త కారు, సెకండ్ హ్యాండ్ కారు ఏది కొనాలో మీకు ఐడియా వస్తుంది. అయితే కొంత మందికి కొత్త వస్తువే కొనాలి అనే సెంటిమెంట్ ఉంటుంది. అలాంటి వాళ్లు కొత్త కారుని కొనడమే మంచిది. అలా కాదని సెకండ్స్ కారు కొంటే తర్వాత వారికి మనసులో ఒక అనుమానం మెదులుతూనే ఉంటుంది. కొందరికి సెకండ్స్ కారు అంటే సెంటిమెంట్ ఉంటుంది. వాళ్లు మంచి రేటు, మోడల్ దొరికితే సెకండ్ హ్యాండ్ కారు కొనచ్చు. ఇవన్నీ పక్కన పెట్టి కూడా నిర్ణయం మాత్రం ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని తీసుకోండి. కారు కొనడం అంటే చిన్న విషయం కాదు. ఒకసారి కొనేశాక మనసు మార్చుకుంటే రూ.లక్షల్లో నష్టం వస్తుంది. మరి.. కొత్తది- సెకండ్ హ్యాండ్.. మీరైతే ఏ కారు కొనాలి అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.