iDreamPost
android-app
ios-app

మహిళలకు మోదీ ఉమెన్స్‌ డే కానుక.. గ్యాస్‌ ధరపై భారీ తగ్గింపు

  • Published Mar 08, 2024 | 10:54 AM Updated Updated Mar 08, 2024 | 10:54 AM

మహిళా దినోత్సవం, మహాశివరాత్రి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు శుభవార్త చెప్పారు. గ్యాస్‌ సిలిండర్‌ ధరను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు..

మహిళా దినోత్సవం, మహాశివరాత్రి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు శుభవార్త చెప్పారు. గ్యాస్‌ సిలిండర్‌ ధరను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు..

  • Published Mar 08, 2024 | 10:54 AMUpdated Mar 08, 2024 | 10:54 AM
మహిళలకు మోదీ ఉమెన్స్‌ డే కానుక.. గ్యాస్‌ ధరపై భారీ తగ్గింపు

మహిళా దినోత్సవవం, మహాశివరాత్రి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభవార్త చెప్పారు. గ్యాస్‌ ధరను భారీగా తగ్గించారు. పండుగ పూట మోదీ తీసుకున్న నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గతేడాది రాఖీ పండుగ సందర్భంగా గ్యాస్‌ సిలిండర్‌ ధరను 200 రూపాయలు తగ్గించిన సంగతి తెలిసిందే. ఇక తాజగా ఎన్నికలకు నెల రోజుల ముందు మరోసారి గ్యాస్‌ ధరను తగ్గించడం గమనార్హం. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గనుంది. నేడు శివరాత్రి మాత్రమే మహిళా దినోత్సవం కూడా కావడంతో.. మోదీ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇంతకు గ్యాస్‌ ధర ఎంత తగ్గింది అంటే..

గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్‌ ధరను 100 రూపాయలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద​ మోదీ స్వయంగా ఈవిషయాన్ని ప్రకటించారు. ఈమేరకు ట్వీట్‌ చేశారు. నేడు మహిళా దినోత్సవ సందర్భంగా మా ప్రభుత్వం ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను 100 రూపాయలు తగ్గింది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. మరీ ముఖ్యంగా మన నారీ శక్తికి ఇది ఎంతో ప్రయోజజనకారి అంటూ మోదీ ట్వీట్‌ చేశారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో గ్యాస్‌ సిలిండర్‌ ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 955 గా ఉండగా.. కేంద్రం తాజా నిర్ణయంతో రూ.100 తగ్గి రూ. 855కి చేరనుంది. దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 903 గా ఉండగా.. ఇప్పుడు రూ. 803 కు తగ్గనుంది. డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు తగ్గుతుండగా.. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు మాత్రం పెరిగాయి. ప్రస్తుతం ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు రూ. 1795 వద్ద ఉంది. హైదరాబాద్‌లో రూ. 2027 వద్ద ఉంది.