P Venkatesh
ఆన్ లైన్ ట్యాక్సీ సేవలు అందిస్తున్న ఓలా, ఉబర్, ర్యాపిడోల కంటే తక్కువ ధరకే ప్రయాణం చేయొచ్చు. నమ్మ యాత్రి యాప్ కస్టమర్లకు, డ్రైవర్లకు మంచి లాభదాయకంగా ఉంది. ర్యాపిడోలో కంటే తక్కువ ధరకే జర్నీ చేయొచ్చు.
ఆన్ లైన్ ట్యాక్సీ సేవలు అందిస్తున్న ఓలా, ఉబర్, ర్యాపిడోల కంటే తక్కువ ధరకే ప్రయాణం చేయొచ్చు. నమ్మ యాత్రి యాప్ కస్టమర్లకు, డ్రైవర్లకు మంచి లాభదాయకంగా ఉంది. ర్యాపిడోలో కంటే తక్కువ ధరకే జర్నీ చేయొచ్చు.
P Venkatesh
ఇదివరకు ఎక్కడికైన ప్రయాణించాల్సి వచ్చినప్పుడు వాహనాల దగ్గరికి మనమే వెళ్లాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఇంటి ముందుకే వాహనాలు వచ్చేస్తున్నాయి. ఎంచక్కా ఆన్ లైన్ లో బైక్, ఆటో, ట్యాక్సీలను బుక్ చేసుకొని మీరు వెళ్లాల్సిన చోటుకి వెళ్లిపోవచ్చు. ప్రైవేట్ రవాణా వ్యవస్థలో ఇప్పటికే ఓలా, ర్యాపిడో, ఉబర్ వంటి సంస్థలు దేశ వ్యాప్తంగా తమ సేవలందిస్తున్నాయి. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న క్షణాల్లోనే రైడర్లు, కస్టమర్లు ఉన్నచోటుకే వచ్చేస్తున్నారు. అయితే ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి బైక్ ట్యాక్సీల్లో కమీషన్ రూపంలో కొంత వాటికే పోతుంది.
ఈ ఎఫెక్ట్ కస్టమర్లపై పడి ఛార్జీలు భారంగా మారుతున్నాయి. ఇదీగాక క్యాన్సలేషన్ ఫీజు, వెయిటింగ్ ఛార్జీలంటూ ముక్కు పిండి వసూల్ చేస్తున్నారు. ఇలాంటి సమయాల్లో ఆ విధమైన ఛార్జీలు లేకుండా తక్కువ ఖర్చుతో ప్రయాణం చేస్తే బాగుంటుందనిపిస్తూ ఉంటుంది కదా. ఈ నేపథ్యంలో కస్టమర్లకు, రైడర్లకు లాభదాయకంగా ఉండే విధంగా ఓఎన్డీసీ నమ్మ యాత్రి యాప్ ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా ఆటో డ్రైర్లకు కాసుల పంట పండుతోంది.
2022లో నమ్మయాత్రి యాప్ ను కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో అందుబాటులోకి తీసుకొచ్చింది ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ సంస్థ. ఓలా, ఉబర్, ర్యాపిడోకు పోటీగా ప్రారంభించిన ఈ యాప్ అనతి కాలంలోనే ప్రజాధారణ పొందింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఆటో డ్రైవర్లు, కస్టమర్లను నేరుగా ఈ యాప్ అనుసంధానం చేస్తుంది. అలాగే జీరో కమీషన్ మోడల్ ద్వారా ఆటో డ్రైవర్లకు భారీ లాభాలు అందుతున్నాయి. మిగతా బైక్ ట్యాక్సీల్లో అయితే దాదాపు 10 శాతం వరకు కమీషన్ వసూల్ చేస్తున్నాయి. నమ్మ యాత్రి యాప్ లో కమీషన్ వసూల్ చేయకపోవడంతో కస్టమర్ల ఛార్జీలు కూడా తక్కువగానే ఉన్నాయి.
ర్యాపిడో కంటే తక్కువ ధరలోనే నమ్మయాత్రి యాప్ ద్వారా ప్రయాణం చేయొచ్చు. నమ్మ యాత్రి యాప్ లో ఛార్జీలు ప్రతి ట్రిప్‌కు రెండు కిలోమీటర్ల దూరం వరకు కనీస ఛార్జీ రూ.30. అంతకంటే ఎక్కువ దూరానికి కిలోమీటరుకు రూ.15 చొప్పున ఛార్జీ వసూల్ చేస్తారు. అలాగే కనీస బుకింగ్ ఛార్జీ రూ. 10 కాగా, ఆటో డ్రైవర్లు రూ.30 వరకు పెంచుకునే అవకాశం కూడా ఉన్నది. క్యాన్సలేషన్ ఫీజు, వెయిటింగ్ ఛార్జీలు ఏమీ ఉండవు. అదే ర్యాపిడో యాప్ ద్వారా ఆటో బుక్ చేసుకుంటే కస్టమర్లు వెయిటింగ్ ఛార్జీల భారం మోయాల్సిందే. నిమిషానికి రూపాయి నుంచి రూపాయిన్నర వరకు ర్యాపిడో వసూల్ చేస్తోంది.
ఇదీ గాక ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు, వర్షాలు పడే సమయాల్లో సర్ ఛార్జీలు కూడా కస్టమర్ల నుంచి వసూల్ చేస్తుంది. ఉదాహరణకు ర్యాపిడోలో పంజాగుట్ట నుంచి అమీర్ పేటకు ఆటోను బుక్ చేసుకున్నట్లైతే రూ. 64 ఛార్జీ పడుతోంది. ఇది ఒకటిన్నర కిలోమిటర్ కు మాత్రమే. ఈ ప్రకారం చూస్తే నమ్మ యాత్రి యాప్ ద్వారా అతి తక్కువ ధరకే అంటే రూ. 30తోనే ప్రయాణం చేయొచ్చు. ఈ విధంగా నమ్మ యాత్రి యాప్ తో కస్టమర్లకు, డ్రైవర్లకు లాభదాయకంగా ఉండడంతో వినియోగించే వారి సంఖ్య పెరుగుతోంది.