Arjun Suravaram
మహిళల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తుంటాయి. అలానే వివిధ రకాల వ్యాపారాలు చేసే మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తుంటాయి. ఇదే సమయంలో మహిళలకు తరచూ ఏదో ఒక గుడ్ న్యూస్ వినిపిస్తోంది.
మహిళల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తుంటాయి. అలానే వివిధ రకాల వ్యాపారాలు చేసే మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తుంటాయి. ఇదే సమయంలో మహిళలకు తరచూ ఏదో ఒక గుడ్ న్యూస్ వినిపిస్తోంది.
Arjun Suravaram
నేటికాలంలో మహిళలు అన్ని రంగాల్లో తమదైన మార్క్ ను చూపిస్తున్నారు. తమ ప్రతిభతో మగవారికి ధీటుగా అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నరు. ఇలా కేవలం పట్టణాల్లో ఉండే మహిళే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు కూడా ఆర్థికంగా అభివృద్ది చెందే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలా మహిళలు వ్యాపారం లేదా ఇతర ఆర్థికంగా నిలదొక్కునేందుకు ప్రభుత్వ, ఇతర ప్రైవేటు సంస్థలు రుణాలు అందిస్తుంటాయి. అయితే తాజాగా మహిళలకు ఓ శుభవార్త వచ్చింది. వారికి ఒక్కొక్కరికి లక్షలు రుణాలు పొందే అవకాశం ఉంటుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
ముత్తూట్.. ఈ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ సంస్థకు చెందిన ముత్తూట్ మెక్రో ఫిన్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ కంపెనీ జూన్ నాటికి ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ముత్తూట్ పప్పచన్ గ్రూప్‌లో భాగమైన ముత్తూట్ మైక్రోఫిన్.. టైలరింగ్, కూరగాయల విక్రయం, టీ దుకాణం వంటి చిన్న వ్యాపారాలు చేస్తున్న మహిళలకు ఆదాయాన్ని సమకూర్చే సూక్ష్మ రుణాలను అందిస్తుంది. తద్వారా మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. కంపెనీకి ప్రస్తుతం 18 రాష్ట్రాల్లో 1,424 శాఖలు కలిగి ఉంది.
ఇటీవలే ఏపీ హైకోర్టు ఇచ్చిన ఓ కీలక తీర్పుతో ముత్తూట్ కంపెనీ తమ ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రణలో ఉన్న సంస్థలు వ్యాపారం చేసే విషయంలో రాష్ట్ర పరిధిలోకి రావని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ముత్తూట్ కంపెనీతో పతాటు మరికొన్ని మైక్రో ఫైనాన్స్ కంపెనీలు తిరిగి నెమ్మదిగా తెలుగు రాష్ట్రాలకు రానున్నాయి. 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైక్రోఫైనాన్స్ కంపెనీలు బిజినేస్ చేయకూడదని చట్టం చేయబడింది.
ఈ నేపథ్యంలో చాలా మైక్రో ఫెనాన్స్ కంపెనీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కంపెనీలను ఓపెన్ చేయలేదు. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీరుపు నేపథ్యంలోనే తిరిగి రానున్నాయి. అలాంటి వాటిల్లోనే కేరళకు చెందిన నాన్- బ్యాంకింగ్ పైనాన్స్ కంపెనీ, మైక్రో ఫైనాన్స్ సంస్థ ముత్తూట్ మైక్రో ఫిన్ తెలంగాణలో మార్చిలో నాలుగు శాఖలను ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే..తెలంగాణలోని మహిళలకు సులభంగానే రుణాలు లభించనున్నాయని మార్కెట్ నిపుణలు అభిప్రాయా పడుతున్నారు.
తమ పంపిణీ నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడం, కొత్త వినియోదారులను సంపాదించడం వంటి వాటికి అనుగుణంగా, తాము తెలంగాణలో కార్యకలాపాలను విస్తరిస్తామని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సదాఫ్ సయీద్ చెప్పారు. అదే విధంగా ఏపీలో కూడా కార్యకలాపాలు ప్రారంభిస్తామని తెలిపారు. తెలంగాణలో శాఖలు భువనగిరి, జనగాం, హన్మకొండ, పరకాలలో ఉంటాయని ఆయన వివరించారు. ఈ కంపెనీ ప్రధానంగా మహిళలకు మూడు రకాల రుణాలు అందిస్తుంది. ఇన్‌కమ్ జనరేటింగ్ లోన్, ప్రగతి లోన్, వ్యక్తిగత రుణాలు అనేవి మూడు రకాలు. ఇక ఆదాయం పొందే విధానం విషయానికి వస్తే.. రూ. 10 వేల నుంచి రూ. 80 వేల వరకు రుణం పొందొచ్చు.
మూడేళ్ల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. చిరు వ్యాపారులు ఈ తరహా రుణం పొందొచ్చు. అలానే ఇప్పటికే ఈ కంపెనీ నుంచి రుణం తీసుకున్న వారు మూలధనం అవసరాల కోసం అదనంగా ప్రగతి లోన్ అనే దాని కింద అదనపు రుణం పొందొచ్చు. ఈ రకం రుణం కింద రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు రుణం తీసుకోవచ్చు. దీనికి మూడేళ్ల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. ఇదే సమయంలో వ్యక్తిగత రుణం విషయానికి వస్తే..కంపెనీ నుంచి లోన్ తీసుకొని చెల్లించిన వారికి లభిస్తాయి. ఏకంగా రూ. 3 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. 36 నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. మొత్తంగా ఒక్కొక్కరు రూ.3 లక్షల వరకు రుణం పొందవచ్చు.