iDreamPost
android-app
ios-app

ఫ్లాట్ కొంటున్నారా? ఈ రూల్ గురించి తెలుసుకోండి.. లాభపడతారు

  • Published Aug 22, 2024 | 5:47 PM Updated Updated Aug 22, 2024 | 5:47 PM

Aware Of This Rule Before Buying Flats: ఫ్లాట్ కొనే ఉద్దేశంలో ఉన్నారా? అయితే ఈ రూల్ గురించి తెలుసుకోండి. లేదంటే నష్టపోతారు. ఈ రూల్ గురించి తెలుసుకోకపోతే బిల్డర్లు మోసం చేసే అవకాశం ఉంటుంది. ఈ రూల్ గురించి తెలుసుకుంటే మీరు లాభపడతారు.

Aware Of This Rule Before Buying Flats: ఫ్లాట్ కొనే ఉద్దేశంలో ఉన్నారా? అయితే ఈ రూల్ గురించి తెలుసుకోండి. లేదంటే నష్టపోతారు. ఈ రూల్ గురించి తెలుసుకోకపోతే బిల్డర్లు మోసం చేసే అవకాశం ఉంటుంది. ఈ రూల్ గురించి తెలుసుకుంటే మీరు లాభపడతారు.

ఫ్లాట్ కొంటున్నారా? ఈ రూల్ గురించి తెలుసుకోండి.. లాభపడతారు

హైదరాబాద్ లో ఇల్లు లేదా ఫ్లాట్ కొనుక్కోవాలని ఎంతోమందికి ఉంటుంది. ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బు కొంత డౌన్ పేమెంట్ చెల్లించి మిగతా డబ్బుని బ్యాంక్ లోన్ ద్వారా చెల్లించి ఫ్లాట్ ని సొంతం చేసుకుంటారు. బ్యాంకుకి నెల నెలా వాయిదాలు కడుతుంటారు. అయితే నిర్మాణంలో ఉన్న ఫ్లాట్ కొనేవారు ఈ రూల్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. చాలా మంది నిర్మాణంలో ఉన్న ఇల్లు లేదా ఫ్లాట్ కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే నిర్మాణంలో ఉన్నప్పుడు దాని విలువ తక్కువ ఉంటుంది. నిర్మాణం పూర్తయ్యాక దాని విలువ అనేది పెరిగిపోతుంది. ఏదైనా ఏరియాలో ఎక్కువ ఇళ్ల నిర్మాణాలు జరిగిన తర్వాతే అక్కడ డిమాండ్ అనేది పెరుగుతుంది. దీని వల్ల రేట్లు పెరిగిపోతాయి. అందుకే నిర్మాణాలు జరగకముందే చాలా మంది ఇల్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తారు.

నిర్మాణంలో ఉన్న ఇల్లు లేదా ఫ్లాట్ ని బుక్ చేసుకున్నాక బిల్డర్ పలానా సమయానికి ఫ్లాట్ అప్పజెప్తానని హామీ ఇస్తాడు. సమయానికి ఫ్లాట్ అందించలేకపోతే ఫ్లాట్ ధర మీద 6 శాతం వడ్డీ చెల్లిస్తానని చెబుతాడు. అంటే మీరు ఫ్లాట్ లో దిగాలని ఒక తేదీని నిర్ణయించుకున్నాకా ఫ్లాట్ తాళాలు బిల్డర్ ఇవ్వలేకపోతే అతను మీకు 6 శాతం వార్షిక వడ్డీతో డబ్బులు చెల్లిస్తాడు. అయితే కొంత డబ్బు చెల్లించి ఫ్లాట్ బుక్ చేసుకుని.. మిగతా డబ్బు నిర్మాణం పూర్తయ్యాక, ఫ్లాట్ చేతికి వచ్చాక చెల్లిస్తామని కొంతమంది ఒప్పందం చేసుకుంటారు. ఇదే ఒప్పందంలో భాగంగా ఫ్లాట్ కొన్నవారు నిర్మాణం పూర్తయ్యాక మిగిలిన డబ్బు చెల్లించలేకపోతే 18 శాతం వడ్డీతో అమౌంట్ చెల్లించాలని బిల్డర్ నిర్ణయిస్తాడు.

అయితే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చట్టంలోని క్లాజ్ 31 ప్రకారం.. బిల్డర్స్ కి, ఓనర్స్ కి ఇద్దరికీ ఒకే వార్షిక వడ్డీ ఉంటుంది. ఇద్దరిలో ఎవరు జాప్యం చేసినా, ఆలస్యం చేసినా 6 శాతం వార్షిక వడ్డీనే చెల్లించాలి. బిల్డర్ ఆలస్యం చేస్తే ఫ్లాట్ ఓనర్ కి 6 శాతం వడ్డీతో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఫ్లాట్ వద్దనుకుంటే ఎంత అమౌంట్ తో అయితే బుక్ చేసుకున్నారో ఆ అమౌంట్ కి 6 శాతం వడ్డీ ఎన్ని నెలలు అయితే అన్ని నెలలకు లెక్కించి చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఫ్లాట్ కొనుక్కున్నవారు బిల్డర్ కి సకాలంలో డబ్బు చెల్లించలేకపోయినా కూడా 6 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. 18 శాతం వడ్డీ అనేది రెరా చట్టంలో లేదు. రెరా చట్టంలోని క్లాజ్ 31 ప్రకారం ఎక్కువ వడ్డీ వసూలు చేయకూడదు. ఈ రూల్ గురించి తెలుసుకోలేకపోతే భారీగా నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రూల్ ని గుర్తుపెట్టుకోండి.