Arjun Suravaram
Rs 3599 plan Free: ఒక్కసారిగా రీఛార్జ్ ప్లాన్స్ పెంచేసిన జియో తిరిగి మెల్లగా దిగి వస్తోంది. ఇందులో భాగంగా కొన్ని కొత్త ప్రీపెయిడ్ ఆఫర్లను ప్రకటించింది. అలాంటి వాటిల్లో రూ.3599 వార్షిక రీఛార్జ్ ప్లాన్ ఒకటి. తాజాగా దీని విషయంలో కస్టమర్లకు గుడ్ న్యూస్ వచ్చింది.
Rs 3599 plan Free: ఒక్కసారిగా రీఛార్జ్ ప్లాన్స్ పెంచేసిన జియో తిరిగి మెల్లగా దిగి వస్తోంది. ఇందులో భాగంగా కొన్ని కొత్త ప్రీపెయిడ్ ఆఫర్లను ప్రకటించింది. అలాంటి వాటిల్లో రూ.3599 వార్షిక రీఛార్జ్ ప్లాన్ ఒకటి. తాజాగా దీని విషయంలో కస్టమర్లకు గుడ్ న్యూస్ వచ్చింది.
Arjun Suravaram
రిలయన్స్ జియో గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. టెలికాం రంగంలో అడుగుపెట్టి.. అప్పటి వరకు ఉన్న విధానాన్ని పూర్తి గా మార్చేసింది. తనదైన నిర్ణయాలో జియో.. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. తొలుత ఉచితం అంటూ ప్రారంభించి.. కస్టమర్లను భారీగా ఆకట్టుకుంది. ఆ తరువాత కాలంలో అనేక భిన్నమైన నిర్ణయాలు తీసుకుని ఇతర టెలికాం సంస్థలకు పెద్ద సవాలే విసింది. ఇది ఇలా ఉంటే..ఇటీవల రీఛార్జ్ ప్లాన్ ధరల పెంచిన తరువాత.. కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా జియో కస్టమర్లకు ఫ్రీగా రూ.3599 రీఛార్ల్ ప్లాన్ ను అందించనుంది. అయితే ఈ రీఛార్జ్ ప్లాన్ ఉచితంగా పొందాలంటే.. ఒక కండీషన్ కూడా పెట్టింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం….
ఒక్కసారిగా రీఛార్జ్ ప్లాన్స్ పెంచేసిన జియో తిరిగి మెల్లగా దిగి వస్తోంది. ఇందులో భాగంగా కొన్ని కొత్త ప్రీపెయిడ్ ఆఫర్లను ప్రకటించింది. అలాంటి వాటిల్లో రూ.3599 వార్షిక రీఛార్జ్ ప్లాన్ ఒకటి. తాజాగా దీని విషయంలో కస్టమర్లకు జియో ఓ మంచి అవకాశం అందించింది. ఉచితంగా ఈ వార్షిక ప్లాన్ ను అందించేందుకు సిద్ధమైంది. అయితే జియో ఎయిర్ ఫైబర్ లో మాత్రమే ఈ ఉచిత ఆఫర్ ఉంది. టెలికాం టాక్ తెలిపిన వివరాల ప్రకారం…ఎవరైనా ఈ ఫ్రీ రీచార్జీను పొందాలంటే.. కస్టమర్లు జియో ఎయిర్ ఫైబర్ ను కనెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని బుకింగ్ కోసం కేవలం రూ.50 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కస్టమర్‌లు తమ బుకింగ్‌ను రద్దు చేయాలని నిర్ణయించుకుంటే, వారు నగదు మొత్తాన్ని తిరిగి వాపసు పొందవచ్చు.
మూడు నెలల జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్ నుండి 30 శాతం తగ్గింపును అందించే ఫ్రీడమ్ ఆఫర్ కూడా కొనసాగుతోంది. మీరు రూ. 2121కి 3 నెలల ఎంట్రీ-లెవల్ జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్‌ని పొందవచ్చు. ఇక్కడ, మీరు ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఓటీటీ ప్రయోజనాలు, అలాగే 30ఎంబీపీఎస్ వేగం జియో నుండి బేస్ ఎయిర్ ఫైబర్ ప్లాన్‌తో కలిసి ఉన్నాయి. ఈ జియో ఆఫర్ అందరికి కాదని, మొదటి సారి జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ చేసుకునే వారి మాత్రం రూ. 3599 సంవత్సర ప్లాన్‌ను గెలుచుకోవచ్చు సమాచారం. ఇక ఈ వార్షిక ప్లాన్ విషయానికి వస్తే.. జియో నుండి ఈ ప్లాన్‌తో, వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్, రోజుకు 2.5 జీబీ డేటాను పొందుతారు. ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ప్లాన్ నుండి వినియోగదారులు అపరిమిత 5 జీ డేటాను కూడా పొందుతారు. మొత్తంగా ఈ ప్లాన్ ను ఫ్రీగా పొందాలంటే పూర్తి సమచారాం కోసం జియో అధికారిక వెబ్ సైట్ ను చూడండి.