iDreamPost
android-app
ios-app

TV ఛానళ్లను మూసి వేస్తోన్న ముఖేష్‌ అంబానీ.. కారణమిదే!

  • Published Aug 16, 2024 | 2:47 PM Updated Updated Aug 16, 2024 | 2:47 PM

Viacom 18-Close Few TV Channels: ముఖేష​ అంబానీ టీవీ ఛానల్స్‌ని మూసివేయబోతున్నట్లు సమాచారం. మరి ఆయన ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే..

Viacom 18-Close Few TV Channels: ముఖేష​ అంబానీ టీవీ ఛానల్స్‌ని మూసివేయబోతున్నట్లు సమాచారం. మరి ఆయన ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే..

  • Published Aug 16, 2024 | 2:47 PMUpdated Aug 16, 2024 | 2:47 PM
TV ఛానళ్లను మూసి వేస్తోన్న ముఖేష్‌ అంబానీ.. కారణమిదే!

ముఖేష్‌ అంబానీ.. లక్షల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. భారీ సంపదతో ఆసియా కుబేరుడుగా మాత్రమే కాక.. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో కూడా స్థానం దక్కించుకున్నారు. ఇక ఆయన అడుగుపెట్టని వ్యాపార రంగం లేదంటే అతిశయోక్తి కాదు. దాదాపు అన్ని రంగాల్లో ఆయన బిజినెస్‌ విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించి ఉంది. ఇక టెలికాం రంగంలో అయితే అగ్రగామిగా దూసుకుపోతున్నారు. వినోద రంగంలో కూడా ఆయన వ్యాపారాలు ఉన్నాయి. జియో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో పాటుగా కొన్ని టీవీ ఛానెల్స్‌ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ముఖేష్‌ అంబానీ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. టీవీ ఛానెల్స్‌ను మూసి వేయబోతున్నారని సమాచారం. ఆ వివరాలు..

భారతీయ టెలివిజన్‌ పరిశ్రమలో రెండు ప్రముఖ కంపెనీలైన స్టార్‌ ఇండియా, వయాకామ్‌ 18 విలీన ప్రక్రియ అంశం.. కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా పరిశీలనలో ఉంది. ఈ రెండు ఛానెల్స్‌ని విలీనం చేస్తే.. ఇది 40 శాతం కంటే ఎక్కువ మార్కెట్‌ వాటాను స్వాధీనం చేసుకోనుంది. అందుకే ఈ రెండు ఛానెల్స్‌ విలీనం ఆమోదానికి కాంపిటీషన్‌ అథారిటీ.. సమీక్షను నిర్వహిస్తోంది. మన దేశంలో ఏ రంగంలో అయినా సరే.. ఒక కంపెనీకి 40 శాతం కన్నా ఎక్కువ మార్కెట్‌ వాటా దాన్ని సీసీఐ పరిగణలోకి తీసుకుంటుంది. ఈ క్రమంలోనే స్టార్‌ ఇండియా-వయాకామ్‌ 18 విలీన ప్రక్రియ పూర్తయితే వీటి వాటా 40 శాతం కన్నా ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో. సీసీఐ రంగంలోకి దిగింది.

మార్కెట్‌లో ఇటువంటి గుత్తాధిపత్యాన్ని నిరోధించడే సీసీఐ ప్రధాన విధి. ఇప్పుడు ఇది స్టార్‌ ఇండియా, వయాకామ్‌ 18 విలీన ప్రక్రియను పరిగణలోకి తీసుకోవడంతో.. ఈ రెండు ఛానెల్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నాయి. స్టార్‌ ఇండియా, వయాకామ్‌ 18 కంపెనీలు.. హిందీ, కొన్నిప్రాంతీయ భాషా ఛానెల్స్‌ని మూసి వేయాలని భావిస్తున్నట్లు.. సీసీఐకి తెలియజేశాయి. ఇక అన్ని అనుకూలిస్తే.. ఈ రెండు సంస్థల విలీన ప్రక్రియ అక్టోబర్‌ నాటికి ముగియనుంది. కానీ ఇది అంత తేలికైన పని కాదని మార్కెట్‌ నిపుణలు అంటున్నారు. ఈ రెండు ఛానెల్స్‌ విలీనం టెలివిజన్ పరిశ్రమ పోటీ వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి కాంపిటీషన్ కమిషన్ ఇతర మీడియా సంస్థల అభిప్రాయాలను కూడా కోరుతోంది.

విలీన సంస్థలో రిలయన్స్ 56 శాతం, డిస్నీ 37 శాతం వాటాను కలిగి ఉంటాయి. వయాకామ్‌ 18, స్టార్‌ ఇండియా విలీనం వల్ల ఏర్పడే కొత్త సంస్థలో 110కి పైగా టీవీ ఛానెల్‌లు, రెండు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు డిస్నీ+హాట్‌స్టార్, జియో సినిమా ఉంటాయి. కొత్త కంపెనీకి స్టార్ ఇండియా మాజీ ఛైర్మన్ ఉదయ్ శంకర్ వైస్ ఛైర్మన్ గా, రిలయన్స్ వ్యవస్థాపకుడు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ చైర్ పర్సన్ గా వ్యవహరిస్తారు. ఈ డీల్ పూర్తైతే భారతీయ టెలివిజన్ పరిశ్రమలో కొత్త శకం మొదలవుతుందనడంలో సందేహం లేదు అంటున్నారు మార్కెట్‌ నిపుణులు.