iDreamPost
android-app
ios-app

Lotus Chocolate: లాభాల పంట కురిపించిన అంబానీ లోటస్ చాక్లెట్ స్టాక్.. లక్ష పెట్టుబడి కోటిన్నర అయ్యింది

  • Published Aug 18, 2024 | 12:22 PM Updated Updated Aug 18, 2024 | 12:22 PM

Ambani Stock Gives Huge Returns: స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం అనేవి రిస్క్ తో కూడుకున్నవి. అయితే వీటిపై నాలెడ్జ్ ఉన్నవారికి రిస్క్ కూడా రిస్క్ లా అనిపిస్తుంది. అందుకే కాన్ఫిడెన్స్ తో పెట్టుబడులు పెట్టేస్తుంటారు. కట్ చేస్తే ఐదేళ్లు, పదేళ్లలో కోటీశ్వరులు అయిపోతారు. అలాంటి స్టాక్ ఇప్పుడు అనేక మందిని ధనవంతులను చేసింది.

Ambani Stock Gives Huge Returns: స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం అనేవి రిస్క్ తో కూడుకున్నవి. అయితే వీటిపై నాలెడ్జ్ ఉన్నవారికి రిస్క్ కూడా రిస్క్ లా అనిపిస్తుంది. అందుకే కాన్ఫిడెన్స్ తో పెట్టుబడులు పెట్టేస్తుంటారు. కట్ చేస్తే ఐదేళ్లు, పదేళ్లలో కోటీశ్వరులు అయిపోతారు. అలాంటి స్టాక్ ఇప్పుడు అనేక మందిని ధనవంతులను చేసింది.

  • Published Aug 18, 2024 | 12:22 PMUpdated Aug 18, 2024 | 12:22 PM
Lotus Chocolate: లాభాల పంట కురిపించిన అంబానీ లోటస్ చాక్లెట్ స్టాక్.. లక్ష పెట్టుబడి కోటిన్నర అయ్యింది

స్టాక్ మార్కెట్ అనేది ఒక మహా సముద్రం. పూర్తిగా అవగాహన, అపారమైన అనుభవం, తెలివితేటలు, పరిశోధన సామర్థ్యం ఉంటేనే ఈ మహా సముద్రంలో సక్సెస్ ఫుల్ గా రాణించగలరు. నిపుణుల సలహాలను తీసుకుంటూ సరైన సమయంలో సరైన స్టాక్ లో పెట్టుబడి పెడితే తిరుగుండదని నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టర్ల తలరాతలను మార్చేసే స్టాక్స్ ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా దలాల్ స్ట్రీట్ లో మల్టీబ్యాగర్ స్టాక్స్ అనేవి పెట్టుబడిదారుల జీవితాలనే మార్చేస్తాయి. స్టాక్స్, ఈటీఎఫ్, ఎఫ్&ఓ, ఐపీవో, వెల్త్ బాస్కెట్స్ ఇలా పలు రకాల పెట్టుబడి ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మళ్ళీ ఇంట్రాడే, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇంట్రాడే అంటే ఒకే రోజులో స్టాక్ కొనుగోలు, విక్రయాలు జరిగిపోతాయి.

నష్టమైనా, లాభమైనా ఆరోజు స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే లోపు జరిగిపోతుంది. అమ్మినా, అమ్మకపోయినా ఆటోమేటిక్ గా విక్రయాలు జరిగిపోతాయి. ఇక షార్ట్ టర్మ్ అంటే ఏడాది కంటే తక్కువ రోజులు ఇన్వెస్ట్ చేసే ఆప్షన్. లాంగ్ టర్మ్ అంటే ఎన్నేళ్లు అయినా పెట్టుబడి పెట్టుకోవచ్చు. వీటిని డెలివరీ అని కూడా అంటారు. ఈ డెలివరీ అనేది ఎప్పుడు ధర పెరిగితే అప్పుడు అమ్ముకోవచ్చు. రూపాయల్లో, వేలల్లో స్టాక్స్ కొన్నవారు చాలా మంది ఐదేళ్లు, పదేళ్ల పాటు ఉంచుకుని ధర పెరిగిన తరువాత అమ్ముకోగా కోట్లు కురిపించాయి. ఇప్పుడు అలాంటి స్టాక్ ఒకటి సంచలనంగా మారింది. ముఖేష్ అంబానీ రిలయన్స్ కన్స్యూమర్ ప్రాడెక్ట్స్ లిమిటెడ్ కి చెందిన లోటస్ చాక్లెట్ కంపెనీ ఇప్పుడు ఇన్వెస్టర్స్ కి సిరుల పంట కురిపిస్తుంది.

2023 మే 24న ఈ లోటస్ చాక్లెట్ కంపెనీ మెజారిటీ వాటాను ముఖేష్ అంబానీ కొనుగోలు చేశారు. ప్రస్తుతం లోటస్ చాక్లెట్ కంపెనీ మార్కెట్ విలువ 2,380 కోట్లుగా ఉంది. కిందటి సెషన్ లో లోటస్ చాక్లెట్ షేర్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టి 1946.70 రూపాయల వద్ద స్థిరపడింది. 52 వారాల గరిష్ట ధర ఇదే కావడం విశేషం. కనిష్ట ధర 213 రూపాయలుగా ఉంది. ఏడాది వ్యవధిలో లోటస్ చాక్లెట్ ధర రూ. 213 నుంచి ఏకంగా 1946 రూపాయలకు చేరుకుంది. గత 5 రోజుల్లో డైలీ అప్పర్ సర్క్యూట్ తో ఈ కంపెనీ షేర్ 21 శాతం పెరిగింది. నెల రోజుల వ్యవధిలో డైలీ అప్పర్ సర్క్యూట్ తో లోటస్ చాక్లెట్ షేర్ ఏకంగా 165 శాతం పెరిగింది. అంటే ఈ స్టాక్ లో లక్ష రూపాయల పెట్టుబడి పెడితే నెల రోజుల్లోనే 2.65 లక్షలు అయ్యినట్టు.

6 నెలల్లో 450 శాతం, ఏడాదిలో 540 శాతం పెరిగింది. ఐదేళ్ల వ్యవధిలో 12,878 శాతం పెరిగింది. అంటే ఐదేళ్ల క్రితం లక్ష పెట్టుబడి పెడితే కోటి 30 లక్షలు వచ్చినట్టు. 2019లో లోటస్ చాక్లెట్ షేర్ ధర రూ. 24.20 ఉండేది. ఇప్పుడు 1946.70 రూపాయలకు చేరుకుంది. అంటే ఈ స్టాక్ ఏకంగా 80 రెట్లు పెరిగింది. అంటే ఒక షేర్ దగ్గర 1922.50 రూపాయల లాభం. ఇలా ఎన్ని షేర్స్ కొంటే అన్ని 1922.50 రూపాయలు. ఇలా కొన్ని స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేసి దీర్ఘకాలం పాటు ఎదురుచూస్తుంటే ఊహించని లాభాలు చూడవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇందులో రిస్క్ కూడా ఉంటుంది. వ్యూహాలు, పరిశోధన, అవగాహన, అనుభవం వంటివి ఉండాలి. అలానే నిపుణుల సలహాలు కూడా తీసుకోవాలి.