P Venkatesh
ముకేశ్ అంబాని అంటే అట్లుంటది మరి. భార్య నీతా అంబానీ కోసం ఖరీదైన గిఫ్టును అందించారు. రూ. 10 కోట్లు విలువ చేసే అత్యంత విలాసవంతమైన కారును దీపావళి కానుకగా అందించారు. రిలయన్స్ అధినేత ఇచ్చిన గిఫ్టు దేశంలోనే ఖరీదైన బహుమతిగా నిలిచింది.
ముకేశ్ అంబాని అంటే అట్లుంటది మరి. భార్య నీతా అంబానీ కోసం ఖరీదైన గిఫ్టును అందించారు. రూ. 10 కోట్లు విలువ చేసే అత్యంత విలాసవంతమైన కారును దీపావళి కానుకగా అందించారు. రిలయన్స్ అధినేత ఇచ్చిన గిఫ్టు దేశంలోనే ఖరీదైన బహుమతిగా నిలిచింది.
P Venkatesh
ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. డబ్బే అన్నిటికీ మూలం. శత్రుత్వానికైనా, మిత్రుత్వానికైనా డబ్బే కారణంగా నిలుస్తోంది. చేతిలో ధనం ఉంటే దేన్నైనా సాధించొచ్చు అన్నట్లుగా తయారైంది. ఈ క్రమంలో ఆసియా కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తన భార్యకు అత్యంత విలువైన కారును బహుమతిగా అందించారు. రిచెస్ట్ పర్సన్ ఏం చేసినా రిచ్ గానే ఉంటుందన్నట్లు తన రేంజ్ కు తగినట్లుగానే ఖరీదైన బహుమతిని ఇచ్చారు ముకేశ్ అంబానీ. సాధారణంగా తమ ప్రియురాలికి లేదా భార్యలకి గిఫ్టులుగా గోల్డ్ రింగ్ అందించడమో లేదా వారి బడ్జెట్ లో ఇతర బహుమతులను అందించి సంతోష పెడుతుండటం సహజమే. కానీ ఏకంగా రూ. 10 కోట్లు విలువ చేసే కారును కానుకగా అందించి మేటి భర్తగా వార్తల్లో నిలిచారు ముకేశ్ అంబానీ.
ప్రముఖ బిజినెస్ మ్యాన్ ముకేశ్ అంబానీ తర భార్య నీతా అంబానీకి దీపావళి కానుకగా జీవితంలో గుర్తుండిపోయేలా విలువైన కారును అందించారు. దేశంలోనే ఇప్పటి వరకు ఏ భర్త అందించలేని కాస్ట్లీ బహుమతిని భార్యకు అందించారు. సాధారణంగా భార్యకు ఖరీదైన చీరను కొనివ్వడానికి ఆలోచించే నేటి రోజుల్లో భార్యకోసం పది కోట్లు విలువ చేసే లగ్జరీ కారును అందించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని రోల్స్ రాయ్స్ కల్లినాన్ బ్లాక్ బ్యాడ్జ్ ఎస్ యూవి ని నీతా అంబానీకి అందించారు. దీని విలువ సుమారు రూ. 10 కోట్లు ఉంటుందని ప్రముఖ వెబ్ సైట్ cartoq వెల్లడించింది. దీంతో ఈ విషయం నెట్టింటా వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసిన వారు ఇప్పటి వరకు ఇండియాలో ఇదే ఖరీదైన కారు గిఫ్టు అని చర్చించుకుంటున్నారు. కాగా గతంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ఆంటిలియా నివాసాన్ని నీతా అంబానికి గిఫ్టుగా ఇచ్చిన విషయం తెలిసిందే.
రోల్స్ రాయిస్ కుల్లినన్ ప్రత్యేకతలు
కాగా ఈ రోల్స్ రాయిస్ కుల్లినన్ ఒక బ్లాక్ బ్యాడ్జ్ మోడల్. స్టాండర్డ్ కారుతో పోలిస్తే, ఎక్ట్సీరియర్ నలుపు రంగులో ఉంటుంది. కానీ ఇది ప్రామాణిక కారు వలె అదే 6.75-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V12 పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 600 bhp పవర్, 900Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. గంటకు దీని గరిష్ట వేగం 250 కిలోమీటర్లు. రోల్స్ రాయిస్ కల్లినన్ కాంట్రాస్ట్ రెడ్ బ్రేక్ కాలిపర్‌లతో 22-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది.