iDreamPost
android-app
ios-app

వారందరికీ ఎలాంటి తాకట్టు లేకుండా రుణాలు! ఇలా అప్లై చేసుకోండి!

  • Published May 27, 2024 | 8:19 PM Updated Updated May 27, 2024 | 8:19 PM

Collateral Free Loans: లోన్‌ కావాలంటే.. ఏదైనా తాకట్టు పెట్టాల్సిందే. సొంత ఊరిలో అప్పు పుట్టాలన్నా హామీలు ఉండాల్సిందే. ఈ క్రమంలో కొందరికి ఎలాంటి తాకట్టు లేకుండా రుణాలు ఇస్తున్నాయి బ్యాంకులు. ఆ వివరాలు..

Collateral Free Loans: లోన్‌ కావాలంటే.. ఏదైనా తాకట్టు పెట్టాల్సిందే. సొంత ఊరిలో అప్పు పుట్టాలన్నా హామీలు ఉండాల్సిందే. ఈ క్రమంలో కొందరికి ఎలాంటి తాకట్టు లేకుండా రుణాలు ఇస్తున్నాయి బ్యాంకులు. ఆ వివరాలు..

  • Published May 27, 2024 | 8:19 PMUpdated May 27, 2024 | 8:19 PM
వారందరికీ ఎలాంటి తాకట్టు లేకుండా రుణాలు! ఇలా అప్లై చేసుకోండి!

నేటి కాలంలో అప్పు పుట్టడం చాలా కష్టం.. అది కూడా ఎలాంటి హామీ లేకుండా అప్పు దొరకడం అంటే ఇక అది మరో ప్రపంచ వింత అన్నమాటే. ఇక బ్యాంక్‌ లోన్లు పొందడం అంటే.. దాని కన్నా ఎండమావిలో నీరు వెలికి తీయడం చాలా ఈజీ అనిపిస్తుంది. అన్నింటికి అన్ని పత్రాలు సరిగా ఉన్నా సరే.. చాలా బ్యాంకులు లోన్‌ ఇచ్చే ప్రాసెస్‌లో కస్టమర్లను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇలాంటి నేపథ్యంలో కొన్ని సంస్థలు, బ్యాంకులు మాత్రం ఎలాంటి హామీ లేకుండా.. కోట్ల రూపాయల వరకు రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఇందుకోసం దేన్ని తాకట్టు పెట్టుకోవడం లేదు. మరి ఇంతకు ఆ సంస్థలు, బ్యాంకులు ఏవి.. ఎవరికి ఇలా హామీ లేకుండా రుణాలు మంజూరు చేస్తున్నాయి.. అసలు ఈ లోన్‌ తీసుకునే ప్రాసెస్‌ ఏంటి.. ఏమేం కావల్సి ఉంటుంది వంటి వివరాలు మీకోసం..

కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ సర్కార్‌.. దీనిపై దృష్టి సారించింది. దేశంలో పారిశ్రామికాభివృద్ధిని పెంపొందించడమే కాక.. ఉపాధి కల్పన కోసం.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సాహించే దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. దీనిలో భాగంగా వారికి ఎలాంటి హామీ లేకుండా లోన్లు మంజూరు చేసేలా చర్యలు చేపట్టింది. దానిలో భాగంగా చిరు, చిన్న తరగతి వ్యాపారస్తులకు ఎలాంటి తాకట్టు లేకుండానే.. అనగా కొలేటర్‌ ఫ్రీ బిజినెస్‌ లోన్స్‌ ఇస్తుంది.

చిన్న, మధ్య తరగతి వ్యాపారస్తులకు ఇవి సంజీవని లాంటివని చెప్పవచ్చు. అయితే ఇలా తాకట్టు లేకుండా రుణం పొందాలంటే.. కొన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ప్రస్తుతం దేశంలోని అని ప్రభుత్వ, ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకులు ఇలా తాకట్టు లేని రుణాలు మంజూరు చేస్తున్నాయి. వీటిలో పర్సనల్‌ మొదలు.. బిజినెస్‌ లోన్ల వరకు వేర్వేరు రకాల రుణాలున్నాయి. అయితే ఇలాంటి లోన్లు తీసుకునేముందు కొన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. లేదంటే మోసపోయే ఛాన్స్‌ ఉంది.

తాకట్టు లేని రుణం పొందాలంటే ఇవి గుర్తుంచుకోవాలి..

  • రుణం అందించే సంస్థ పారదర్శకతతో పాటు.. మంచి రుణ ప్రక్రియలు కలిగి ఉన్న సంస్థల నుంచి లోన్‌ తీసుకోవడం ఉత్తమం.
  • దీని వల్ల సమయం వృధా కాకుండా.. కాపాడుతుంది.. లోన్‌ తీసుకునే వారు.. ఇచ్చేవారు మధ్య నమ్మకాన్ని పెంచుతుంది.
  • లోన్‌ తీసుకునే ముందే.. వేర్వేరు బ్యాంకుల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్‌ ఫీజు వంటి వివరాల గురించి పూర్తిగా తెలుసుకుని.. ఎక్కడైతే.. తక్కువ ఉందో అక్కడ నుంచి లోన్‌ తీసుకోవడం ఉత్తమం.
  • లోన్‌ తీసుకున్న తర్వాత దాన్ని చెల్లించేందుకు ఎలాంటి ఆప్షన్స్‌ డిజిటల్‌ పేమెంట్స్‌, యాప్‌, బ్యాంక్‌కు వెళ్లి కట్టడం వంటి వివరాల గురించి ముందే పూర్తిగా తెలుసుకోవాలి.
  • లోన్‌ తీసుకోవడాని ముందే.. ఎంఎస్ఎంఈ నిర్వహకులు తమ ఆర్థిక అవసరాలను పూర్తి స్థాయిలో అంచనా వేయాల్సి ఉంటుంది. అసలు ఎందుకోసం లోన్‌ తీసుకుంటున్నారు అనే దాని గురించి అవగాహన ఉండాలి.
  • దీని ద్వారా మీ వ్యాపార అవసరాలకు సరైన రుణ పంపిణీ సంస్థను ఎంపిక చేసుకోవటం సులభతరం అవుతుంది.
  • లోన్‌ తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్న తర్వాత అందుకు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను రెడీ చేసుకోవాలి.
  • పేపర్స్‌ అన్ని రెడీగా ఉంటే.. లోన్‌ పొందడం చాల త్వరగా పూర్తి అవుతుంది.
  • ఇక చివరకు లోన్‌ పొందిన ఎంఎస్‌ఎంఈ యజమాని దాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి. పొందిన లోన్‌ మొత్తం ద్వారా వ్యాపారాన్ని.. నిర్దిష్ట ప్రయోజనాల కోసం మాత్రమే వాడాలి.