iDreamPost
android-app
ios-app

విచిత్రమైన కారు.. మీ దగ్గర కోట్లున్నా దీన్ని కొనలేరు.. ఎందుకంటే?

  • Published Aug 03, 2024 | 7:00 AM Updated Updated Aug 03, 2024 | 7:00 AM

Mobilize Duo Coming This Year Replacement To Renault Twizy: బెంజ్, ఆడి, రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ కార్లను కొనాలంటే లక్షలు, కోట్లు చెల్లించాలి. కొనగలిగే సామర్థ్యం ఉంటే కొనేవాళ్ళు ఉంటారు. అయితే విచిత్రంగా ఉన్న ఈ బుల్లి కారుని మాత్రం ఎన్ని లక్షలు, కోట్లున్నా గానీ కొనలేరు. ఎందుకంటే?

Mobilize Duo Coming This Year Replacement To Renault Twizy: బెంజ్, ఆడి, రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ కార్లను కొనాలంటే లక్షలు, కోట్లు చెల్లించాలి. కొనగలిగే సామర్థ్యం ఉంటే కొనేవాళ్ళు ఉంటారు. అయితే విచిత్రంగా ఉన్న ఈ బుల్లి కారుని మాత్రం ఎన్ని లక్షలు, కోట్లున్నా గానీ కొనలేరు. ఎందుకంటే?

విచిత్రమైన కారు.. మీ దగ్గర కోట్లున్నా దీన్ని కొనలేరు.. ఎందుకంటే?

కొన్ని కార్లు ఉంటాయి, కేవలం కొంతమంది మాత్రమే కొనగలరు. రోల్స్ రాయిస్ కార్ల విషయానికొస్తే.. వాటిని ప్రతిష్ట కలిగిన వారికే అమ్ముతారు. అత్యంత సంపన్నులకు, ప్రతిష్టాత్మక వ్యక్తులకు మాత్రమే అమ్ముతారు. అయితే ఈ కారుని మాత్రం మన దగ్గర కోట్లున్నా కొనలేము. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా వేరే పర్పస్ తయారు చేయబడిన కారు. అసలు ఏంటి ఈ కారు? దీనికెందుకంత ప్రత్యేకత? ఏముంది ఈ కారులో? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.  

గతంలో రెనాల్ట్ కంపెనీ ట్విజీ పేరుతో ఒక కారుని లాంఛ్ చేసింది. ఆ తర్వాత దాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ట్విజీకి రీప్లేస్మెంట్ గా వేరే కారుని తీసుకొస్తున్నట్లు రెనాల్ట్ కంపెనీ ప్రకటించింది. మొబిలైజ్ డ్యుయో పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ కారుని 2024లో తీసుకొస్తామని గత ఏడాది ప్రకటించింది. ఇది రెండు వెర్షన్స్ లో వస్తుంది. ఒకటి క్యాబ్ టైప్, మరొకటి ట్రాన్స్ పోర్ట్ కారు టైప్. మొదటి వెర్షన్ కారు ప్యాసింజర్ కారులా ఉంటే.. మరొక వెర్షన్ కారు 700 లీటర్ల కెపాసిటీ స్టోరేజ్ బాక్స్ తో వస్తుంది. ఇది డెలివరీ బాయ్స్ లాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. 

ఈ కారుని అమ్మడానికి కాకుండా సబ్ స్క్రిప్షన్ ప్లాన్ కింద అద్దెకు ఇవ్వడానికి తయారు చేస్తున్నారు. అమ్మడానికి బదులు దీర్ఘకాలిక అద్దె ప్రాతిపదికన ఇచ్చేందుకు తయారు చేస్తుంది. ఈ సబ్ స్క్రిప్షన్ ప్యాకేజ్ లో కారు, మెయింటెనెన్స్, వారంటీ, ఇన్సూరెన్స్, ఛార్జింగ్ సొల్యూషన్స్ అన్నీ కలిపే వస్తాయి. ఎన్ని నెలలు అద్దెకు తీసుకుంటారో దాన్ని బట్టి నెలకు, రెండు నెలలకు, ఏడాదికి ఇలా అద్దె చెల్లించవచ్చు. ఆన్ లైన్ లో అడ్జస్ట్ చేసుకుని అద్దె చెల్లించి ఈ కారుని నడుపుకోవచ్చు. ఎవరికైనా సరే సబ్ స్క్రిప్షన్ ఆధారంగానే ఇస్తుంది. అయితే ఈ కార్లు యూకేలో అందుబాటులో ఉంటాయని రెనాల్ట్ గ్రూప్ కి చెందిన మొబిలైజ్ బెంటో, డ్యుయో మోడల్స్ కంపెనీలు తెలిపాయి.     

డ్యుయో 45 మోడల్ మోటార్ టాప్ స్పీడ్ గంటకు 45 కి.మీ.గా ఉంది. అయితే ఈ కారుని యూరప్ లో14 ఏళ్ల లోపు వయసున్న మైనర్లు డ్రైవ్ చేయచ్చు. అది కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపచ్చు. డ్యుయో 80 మోడల్ కారు గంటకు 80 కి.మీ. టాప్ స్పీడ్ తో వస్తుంది. దీనికి లైసెన్స్ ఉండాలి. ఇక దీని రేంజ్ విషయానికొస్తే ఫుల్ ఛార్జ్ తో 140 కి.మీ. రేంజ్ ఇస్తుంది. ట్విజీ లానే ఇందులో కూడా రెండు సీట్లు ఉంటాయి. ట్విజీతో పోలిస్తే ఈ డ్యుయో కారు కాస్త పెద్దదిగా ఉంటుంది. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే ఇది 50 శాతం వ్యర్థ పదార్థాలతో తయారు చేశారు. ఈ కారు లైఫ్ అయిపోయేనాటికి 95 శాతం రీసైకిల్ చేయవచ్చునని రెనాల్ట్ కంపెనీ వెల్లడించింది.

Mobilize duo car

ఒక కారు పార్కింగ్ చేసే ప్లేస్ లో ఇవి మూడు కార్లు పడతాయి. దీనికి రెండు డోర్స్ ఉన్నాయి. అయితే అవి బయటకు కాకుండా పై దిశలో తెరవబడతాయి. దీని వల్ల ఇరుకు వీధుల్లో.. రెండు కార్ల మధ్యలో ఉన్నా గానీ కారులోంచి దిగేందుకు సమస్య ఉండదు. మొత్తానికి ఈ ఎలక్ట్రిక్ కారుని అమ్మడానికి కాకుండా అద్దె ప్రాతిపదికన ఇవ్వడం గానీ లేదా ఓలా, ఉబర్ లా క్యాబ్స్ గా తిప్పడం గానీ చేస్తుందట. ప్రస్తుతానికి యూకేలో మాత్రమే రెంటల్ పర్పస్ తిప్పేందుకు కంపెనీ సిద్ధంగా ఉంది. సక్సెస్ అయితే ఫ్యూచర్ లో భారత్ సహా ఇతర దేశాలకు నెట్ వర్క్ ని పెంచుకునే అవకాశం ఉండవచ్చునని సమాచారం.