iDreamPost
android-app
ios-app

Microsoft: క్రౌడ్‌స్ట్రైక్‌ ఎఫెక్ట్‌.. మైక్రోసాఫ్ట్‌కు లక్షల కోట్ల నష్టం

  • Published Jul 20, 2024 | 12:39 PM Updated Updated Jul 20, 2024 | 12:39 PM

Microsoft IT Outage Crowdstrike Lose $6 Billion: మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. ఆ వివరాలు..

Microsoft IT Outage Crowdstrike Lose $6 Billion: మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. ఆ వివరాలు..

  • Published Jul 20, 2024 | 12:39 PMUpdated Jul 20, 2024 | 12:39 PM
Microsoft: క్రౌడ్‌స్ట్రైక్‌ ఎఫెక్ట్‌.. మైక్రోసాఫ్ట్‌కు లక్షల కోట్ల నష్టం

మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల ప్రపంచవ్యాప్తంగా విమానాయన సంస్థలు, స్టాక్‌ మార్కెట్లు, మరెన్నో సేవలు నిలిచిపోయాయి. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ అన్నీ డౌన్ కావడంతో.. తీవ్ర సమస్య తలెత్తింది. మైక్రోసాఫ్ట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌గా ఉన్న సంస్థల సర్వీసులన్నీ కాసేపు స్తంభించిపోయాయి. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌కు సెక్యూరిటీ సేవలు అందించే ‘క్రౌడ్‌స్ట్రయిక్‌’ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్‌ సెన్సార్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలుసహా రైల్వే, టీవీ, రేడియో, ఆస్పత్రి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి.

సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లో లోపం వల్ల మైక్రోసాఫ్ట్‌ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ‘క్రౌడ్‌స్ట్రయిక్‌’ భారీ నష్టాన్నే మూటకట్టుకుంది. అనేక కంపెనీలు, విమానాశ్రయాల్లో తలెత్తిన తీవ్ర అంతరాయం.. కారణంగా క్రౌడ్‌స్ట్రయిక్‌ షేర్లు భారీగా పతనమయ్యాయి. అమెరికాలో ఈ కంపెనీ షేర్లు ట్రేడింగ్‌లో దాని విలువలో ఐదవ వంతును కోల్పోయాయి. అనధికారిక ట్రేడింగ్‌లో 21 శాతం వరకు తగ్గాయి అని తెలుస్తోంది. ఫలితంగా క్రౌడ్‌స్ట్రయిక్‌ వాల్యుయేషన్‌లో దాదాపు 16 బిలియన్‌ డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే.. రూ.1.34 లక్షల కోట్లు నష్టానికి దారి తీస్తుంది అని అంచనా.

మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా.. కోట్లాది మంది జనాలు యూజర్లు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మైక్రోసాఫ్ట్‌ 365 యాప్స్, సర్వీసెస్‌ స్తంభించడంతో గంటల పాటు అనేక సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. అయితే అవిశ్రాంతంగా శ్రమించి సమస్యను దాదాపు పరిష్కరించామని మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. ‘‘ఇది భద్రతాలోపం, సైబర్‌ దాడి కాదు. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో తప్పుడు అప్‌డేట్‌ను రన్‌ చేయడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని గుర్తించాం. సమస్యను ‘ఫిక్స్‌’ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’’అని క్రౌడ్‌స్ట్రయిక్‌ సీఈఓ జార్జ్‌ కుర్జ్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌చేశారు. ఏది ఏమైనా కొన్ని గంటల పాటు కలిగిన అంతరాయం వల్ల.. మైక్రోసాఫ్‌కు లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లడం గమనార్హం.