iDreamPost
android-app
ios-app

ఇకపై ఆ సంస్థల నుంచి ఒక వ్యక్తి 2 లక్షలకు మించి లోన్ తీసుకోలేరు.. ఎంఫిన్ ఆదేశాలు

  • Published Jul 10, 2024 | 8:38 PM Updated Updated Jul 10, 2024 | 8:38 PM

MFIN Restricts Loan Amount 2 Lakhs Per One Person: ఇక నుంచి ఆ సంస్థల నుంచి ఒక వ్యక్తి రెండు లక్షలకు మించి లోన్ తీసుకోలేరు. ఎందుకంటే తాజాగా ఆ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. లోన్ల విషయంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్న కారణంగా ఒక వ్యక్తికి రెండు లక్షలు దాటి లోన్ ఇవ్వద్దని మార్గదర్శకాలు విడుదలయ్యాయి.

MFIN Restricts Loan Amount 2 Lakhs Per One Person: ఇక నుంచి ఆ సంస్థల నుంచి ఒక వ్యక్తి రెండు లక్షలకు మించి లోన్ తీసుకోలేరు. ఎందుకంటే తాజాగా ఆ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. లోన్ల విషయంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్న కారణంగా ఒక వ్యక్తికి రెండు లక్షలు దాటి లోన్ ఇవ్వద్దని మార్గదర్శకాలు విడుదలయ్యాయి.

ఇకపై ఆ సంస్థల నుంచి ఒక వ్యక్తి 2 లక్షలకు మించి లోన్ తీసుకోలేరు.. ఎంఫిన్ ఆదేశాలు

అప్పు కోసం తెలిసిన వాళ్ళ దగ్గరకు వెళ్లడం లేదా బ్యాంకుల్లో లోన్ పెట్టుకోవడం చేస్తుంటారు చాలా మంది. అయితే బ్యాంకులు లోన్ మంజూరు చేయకపోవడం, పలు కారణాల వల్ల లోన్లు రాని పక్షంలో మైక్రో ఫైనాన్స్ కంపెనీలను సంప్రదిస్తుంటారు. వడ్డీ ఎక్కువైనా గానీ లోన్లు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇక నుంచి ఒక వ్యక్తి 2 లక్షలు కంటే ఎక్కువ లోన్ తీసుకోవడానికి వీల్లేదు. ఈ మేరకు ఎంఫిన్ కీలక ఆదేశాలు జరీ చేసింది. మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ (ఎంఫిన్) తాజాగా మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక వ్యక్తికి 2 లక్షల రూపాయలకు మించి లోన్ ఇవ్వకూడదని మైక్రో ఫైనాన్స్ సంస్థలకు.. ఎంఫిన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తాన్ని కూడా గరిష్టంగా నాలుగు మైక్రో ఫైనాన్స్ సంస్థలు సమకూర్చాలని స్పష్టం చేసింది.  

ఇష్టానుసారంగా లోన్లు ఇవ్వడం వల్ల సామాన్య ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నట్లు ఎంఫిన్ వెల్లడించింది. అప్పులు కట్టలేకపోతుండడంతో మైక్రో ఫైనాన్స్ సంస్థల వల్ల మొండి బాకీలు అలానే పేరుకుపోతున్నాయని ఎంఫిన్ పేర్కొంది. బ్యాంకుల్లో లోన్లు రానివారు , పలు కారణాల వల్ల బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం కుదరని వారు మైక్రో ఫైనాన్స్ కంపెనీలను సంప్రదిస్తున్నారని ఎంఫిన్ పేర్కొంది. అధిక వడ్డీకి ఆశపడి ఆయా ఫైనాన్స్ సంస్థలు.. రుణాలను మంజూరు చేస్తున్నాయని.. అయితే ఆ లోన్లు తిరిగి చెల్లించే క్రమంలో సమస్యలు తలెత్తుతున్నాయని ఎంఫిన్   

పేర్కొంది. సామాన్య ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని.. దీనికి తోడు మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఇచ్చే అప్పు రికవరీ శాతం దారుణంగా తగ్గిపోతుందని ఎంఫిన్ గుర్తించింది. దీంతో మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మైక్రో ఫైనాన్స్ సంస్థలను కంట్రోల్ చేసే వ్యవస్థగా ఎంఫిన్ పని చేస్తుంది. మైక్రో ఫైనాన్స్ వినియోగదారుల్లో ఎక్కువగా 3 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారే  ఉన్నారని ఎంఫిన్ తెలిపింది. ప్రస్తుతం మైక్రో ఫైనాన్స్ రుణాల పరిశ్రమకు 7.8 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. వీరికి ఇప్పటి వరకూ ఇచ్చిన రుణం మొత్తం 4.33 లక్షల కోట్లకు పైనే ఉన్నారని సమాచారం. గత రెండు దశాబ్దాల కాలంలో ఈ మైక్రో ఫైనాన్స్ రంగం ఎంతగానో విస్తరించింది. బ్యాంకుల్లో లోన్లు రిజెక్ట్ అవ్వడం లేదా వేరే కారణాల వల్ల లోన్లు పొందలేకపోవడంతో మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో రుణాలు తీసుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. అయితే తిరిగి చెల్లించడంలో సమస్యలు వస్తుండడంతో ఒక వ్యక్తికి 2 లక్షలకు మించి లోన్ ఇవ్వకూడదని ఎంఫిన్ ఆదేశించింది.