iDreamPost
android-app
ios-app

మెక్ డొనాల్డ్స్ బంపర్ ఆఫర్.. ఫ్రీ అన్ లిమిటెడ్ ఫుడ్.. 50 ఏళ్ల పాటు..

  • Published Jun 05, 2024 | 8:44 PM Updated Updated Jun 05, 2024 | 8:44 PM

McDonald's Unlimited Free Food: మెక్ డొనాల్డ్స్ లో బిల్లు కట్టకుండా 50 ఏళ్ల పాటు ఎన్ని కావాలంటే అన్ని పీజ్జాలు, బర్గర్లు తినాలనేది మీ కల. అయితే మీ కోసమే ఈ బంపర్ ఆఫర్. మెక్ డొనాల్డ్స్ సంస్థ ఈ ఆఫర్ అందిస్తుంది. దీన్ని ఎలా సొంతం చేసుకోవాలంటే?

McDonald's Unlimited Free Food: మెక్ డొనాల్డ్స్ లో బిల్లు కట్టకుండా 50 ఏళ్ల పాటు ఎన్ని కావాలంటే అన్ని పీజ్జాలు, బర్గర్లు తినాలనేది మీ కల. అయితే మీ కోసమే ఈ బంపర్ ఆఫర్. మెక్ డొనాల్డ్స్ సంస్థ ఈ ఆఫర్ అందిస్తుంది. దీన్ని ఎలా సొంతం చేసుకోవాలంటే?

మెక్ డొనాల్డ్స్ బంపర్ ఆఫర్.. ఫ్రీ అన్ లిమిటెడ్ ఫుడ్.. 50 ఏళ్ల పాటు..

మెక్ డొనాల్డ్స్ లో పీజ్జాలు, బర్గర్లు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ ధరలే ఎక్కువగా ఉంటాయి. దీంతో కొంతమందికి తినాలని ఉన్నా రాజీ పడిపోతారు. అయితే ధర ఎంత ఉన్నా గానీ మీకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ ని ఉచితంగా తినే ఛాన్స్ ఉంది. అది కూడా ఎలాంటి పరిమితి లేకుండా ఎంత కావాలంటే అంత తినచ్చు. ఒకటి, రెండు రోజులు కాదు.. 50 ఏళ్ల పాటు తినచ్చు. ఈ అవకాశాన్ని మెక్ డొనాల్డ్స్ సంస్థ కల్పిస్తుంది. వాస్తవానికి ఈ అవకాశం సంపన్నులకు మాత్రమే ఉండేది. బిల్ గేట్స్, వారెన్ బఫెట్ వంటి అపర కుబేరుల దగ్గర ఒక మెక్ డొనాల్డ్ గోల్డ్ కార్డు ఉంటుంది. ఇది ఉంటే ఎంత ఫుడ్ అయినా, ఎన్ని రోజులైనా తినచ్చు.

గతంలో ఓ ఇంటర్వ్యూలో వారెన్ బఫెట్.. తన దగ్గర మెక్ డొనాల్డ్ గోల్డ్ కార్డు ఉందని వెల్లడించారు. ఈ కార్డుతో తాను, తన కుటుంబ సభ్యులు అందరం కలిసి లైఫ్ లాంగ్ ఏ మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ లో అయినా కావాల్సినంత ఫుడ్ తినే అవకాశం ఉందని అన్నారు. అంతేకాదు తన స్నేహితుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కి కూడా గోల్డ్ కార్డు ఉందని.. ఆయనకు కూడా బిల్ కట్టకుండా ఫ్రీగా ఏ మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ లో అయినా అపరిమిత ఫుడ్ తినే అవకాశం ఉందని వారెన్ బఫెట్ అప్పట్లో వెల్లడించారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది సంపన్నుల దగ్గర గోల్డ్ కార్డ్స్ ఉన్నాయి. అయితే ఈ కార్డ్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఈ కార్డుని ఎలా పొందాలన్న విషయాన్ని మాత్రం మెక్ డొనాల్డ్స్ సంస్థ ఎప్పుడూ వెల్లడించలేదు.

తాజాగా ఈ సంస్థ గోల్డ్ కార్డు గురించి స్పందించింది. సంపన్నులకే కాకుండా సామాన్యులకి కూడా గోల్డ్ కార్డు ఇస్తామని కంపెనీ తెలిపింది. అయితే నేరుగా గోల్డ్ కార్డు ఇవ్వమని.. దాన్ని పొందాలంటే ఒక పోటీలో పాల్గొనాలని తెలిపింది. కంపెనీ నిర్వహించే ఎస్.జెడ్.ఎన్ ఆఫ్ షేరింగ్ పోటీలో పాల్గొనాలని సంస్థ వెల్లడించింది. మెక్ డొనాల్డ్ యాప్ ద్వారా ఏదైనా ఐటమ్ కొనుగోలు చేసి పోటీలో పాల్గొనవచ్చునని.. ఇందులో గెలిచిన వారికి గోల్డ్ కార్డు ఇస్తామని తెలిపింది. ఈ కార్డు గెలుచుకున్న వారు వారంలో రెండుసార్లు నగరాల్లో ఏ మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ లో అయినా 50 ఏళ్ల పాటు అపరిమిత ఫుడ్ తినవచ్చునని సంస్థ వెల్లడించింది. అది కూడా కార్డు ఉన్నవారితో పాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా తినవచ్చునని కంపెనీ తెలిపింది. మరింకెందుకు ఆలస్యం.. మీరు మెక్ డొనాల్డ్స్ పీజ్జా, బర్గర్ల లవర్స్ అయితే వెంటనే యాప్ లో ఆర్డర్ చేసుకుని ఈ పోటీలో పాల్గొనండి.