Tirupathi Rao
Price Drop On Maruti Car: ప్రస్తుతం అందరూ కార్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. బడ్జెట్ లో కారు కొనాలి అనుకునే వారికి మారుతీ సుజుకీ గుడ్ న్యూస్ చెప్పింది.
Price Drop On Maruti Car: ప్రస్తుతం అందరూ కార్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. బడ్జెట్ లో కారు కొనాలి అనుకునే వారికి మారుతీ సుజుకీ గుడ్ న్యూస్ చెప్పింది.
Tirupathi Rao
ఇండియాలో బడ్జెట్ కారు అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు మారుతీ సుజుకీ. రోడ్డు మీద 10 కార్లు కనిపిస్తే వాటిలో కనీసం 4 కార్లు మారుతీవే ఉంటాయి. పైగా ఈ కంపెనీ కార్లకు మెయిన్టినెన్స్ కూడా తక్కువగా ఉంటుంది. అందుకే మధ్యతరగతి వాళ్లు ఈ కార్లను ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. మారుతీలో మీకు ప్రీమియం కార్లు ఉంటాయి, బడ్జెట్ కార్లు కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక మంచి బడ్జెట్ కారు మోడల్ పై కంపెనీ ధర తగ్గించింది.. ఆ ధర తగ్గింపు తక్షణమే అమలులోకి వస్తుందని ప్రకటించింది. మరి.. ఆ మోడల్ ఏంటి? ధర ఎంత తగ్గించారో చూద్దాం.
ప్రస్తుతం మారుతీ సుజుకీ కంపెనీ తగ్గింపు ప్రకటించిన మోడల్ మరేదో కాదు.. ఆల్టో కే10. ఈ కారుకు సంబంధించిన వీఎక్స్ఐ ఏజీఎస్, వీఎక్స్ఐ+ ఓజీఎస్ వేరియంట్ల మీద ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని ప్రకటించింది. అయితే ఈ రెండు వేరియంట్లపై మారుతీ కంపెనీ రూ.5 వేలు ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుం ఈ మోడల్స్ ఎక్స్ షోరూమ్ ధరలు రూ.5.56 లక్షలు, రూ.5.86 లక్షలుగా ఉన్నాయి. అయితే మిగిలిన వేరియంట్ల ధరలను మాత్రం తగ్గించలేదు. మిగిలిన నాలుగు వేరియంట్స్ ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఈ కారుకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఇలా ధర తగ్గించడం కూడా సేల్స్ పై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.
ఈ ఆల్టో కే10 కారు ధర- ఫీచర్స్ విషయానికి వస్తే.. రూ.3.99 లక్షల ఎక్స్ షోరూమ్ నుంచి ఈ కారు ధర ప్రారంభం అవుతుంది. హైఎండ్ వేరియంట్ కారు ధర రూ.5.96 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా ఉంది. ఈ ఆల్టో కే10 మోడల్ లో మొత్తం 7 వేరియంట్లుంటాయి. ఇందులో మీకు 4 సీటర్, 5 సీటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్యూయల్ వేరియంట్, కారు ఫీచర్స్ మారే కొద్దీ ధర పెరుగుతుంది. ఈ ఆల్టో కే10 కారులో మీకు పెట్రోల్, సీఎన్జీ ఫ్యూయల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ రెండు ట్రాన్సిషన్స్ లోనూ అందుబాటులో ఉంది.
ఈ ఆల్టో కే10 కారు స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఇది 998 సీసీ ఇంజిన్ కెపాసిటీతో వస్తుంది. 55.92 బీహెచ్పీ పవర్, 82.1 ఎన్ఎం మాక్సిమమ్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంక ఈ ఆల్టో కే10 కారు మైలేజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇది సీఎన్జీ మోడల్ అయితే 35 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని చెప్తున్నారు. అదే ఆల్టో కే10 పెట్రోల్ వేరియంట్ అయితే.. ఒక లీటరుకు గరిష్టంగా 24 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో మీకు పవర్ స్టీరింగ్, రేర్ కార్ పార్కింగ్ సెన్సార్, ఏబీఎస్, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్స్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఉంది. మరి.. ఆల్టో కే10 మోడల్ పై ధర తగ్గించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.