Tirupathi Rao
కారు కొనాలి అనుకునే వారికి కొత్త ఏడాది సందర్భంగా మారుతీ కంపెనీ శుభవార్త చెప్పింది. హై డిమాండ్ ఉన్న మోడల్స్ పై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది.
కారు కొనాలి అనుకునే వారికి కొత్త ఏడాది సందర్భంగా మారుతీ కంపెనీ శుభవార్త చెప్పింది. హై డిమాండ్ ఉన్న మోడల్స్ పై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది.
Tirupathi Rao
కారు కొనాలి అనే ఆలోచన రాగానే.. కొనుకొచ్చి ఇంటి ముందు పార్క్ చేయందే నిద్ర పట్టదు. అలాంటి కంగారులో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఏది త్వరగా డెలివరీ వస్తే అదే కొందాం.. ఏదో ఒకటి ముందు కారు అయితే కొనేద్దాం అనే ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలాంటి ఆలోచన మీ మైండ్ లో కూడా ఉంటే వెంటనే విరమించుకోండి. ఎందుకంటే కారు కొనడం అనేది చిన్న విషయం కాదు. కొన్న తర్వాత ఏదో స్మార్ట్ ఫోన్ ఎక్స్ ఛేంజ్ చేసినట్లు చేసేద్దాం అంటే వర్కౌట్ కాదు. అందుకే కొనడానికి ముందే అన్నీ ఆలోచించుకోవాలి. అలాగే ధర మీద డిస్కౌంట్స్, తగ్గింపులు ఎవరు ఎక్కువ ఇస్తున్నారో కూడా వాకబు చేస్తూ ఉండాలి. ఇప్పుడు కొత్త కారు కొనాలి అనుకునే వారికి మారుతీ కంపెనీ బంపరాఫర్ ఇస్తోంది. సెలక్టివ్ కార్లపై వేలల్లో డిస్కౌంట్స్ ఇస్తోంది.
అతడు సినిమాలో మహేశ్ బాబు చెప్పినట్లుగానే అందరూ బీఎండబ్ల్యూ, బెంజ్ కార్లను చూస్తారు.. కానీ, మారుతీలాంటీ కంపెనీల కార్లనే కొంటారు. బడ్జెట్ రేంజ్ లో, మిడిల్ క్లాస్ కేటగిరీలో మారుతీ కార్లకు ఎంతో మంచి ఆదరణ ఉంది. డిమాండుకు తగ్గట్లుగానే బడ్జెట్ రేంజ్ కార్లను మారుతూ కంపనీ విడుదల చేస్తూనే ఉంటుంది. ఇప్పటి వరకు మారుతీ కంపెనీ నుంచి మార్కెట్ లో ఉన్న బడ్జెట్ కార్లలో ఆల్టో కే10, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, డిజైర్ మోడల్స్ ని ప్రధానంగా చెప్పుకోవాలి. వీటికే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఈ హై డిమాండ్ కార్లపై మారుతీ కంపెనీ వేలల్లో డిస్కౌంట్స్ అందిస్తోంది. నిజానికి మారుతీ కార్లను కొనుగోలు చేయాలి అనుకుంటున్న వారికి ఇది బంపరాఫర్ అనే చెప్పాలి. మళ్లీ ఇలాంటి ఛాన్స్ రావాలంటే కాస్త సమయ పట్టచ్చు. మరి.. ఆ డిస్కౌంట్స్ ఏంటి? ఏ మోడల్ పై ఎన్ని వేలు తగ్గబోతున్నాయో ఇప్పుడు చూద్దాం.
ఆల్టో కే10 మోడల్ చాలా మంచి డిమాండ్ ఉన్న కారు. నిజానికి హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో ఉండే ట్రాఫిక్ కి చాలా మంచి ఆప్షన్ కూడా ఇది. ఈ ఆల్టో కే10లో పెట్రోల్, సీఎన్జీ వేరియంట్స్ పై గరిష్టంగా రూ.47 వేల వరకు బెనిఫ్ట్స్ పొందవచ్చు. వాటిలో రూ.25 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంటుంది. ఎక్సేంజ్ బోనస్ కింద రూ.15 వేల వరకు పొందవచ్చు. అలాగే కార్పొరేట్ డిస్కౌంట్ పేరిట మరో రూ.7 వేలు తగ్గింపు వర్తిస్తుంది. ఇవన్నీ కలుపుకుని ఆల్టో కే10పై మీకు గరిష్టంగా రూ.47 వేల వరకు తగ్గింపును పొందచ్చు. ఈ కారు స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 1.0 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఇందులో మీకు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిషన్స్ అందుబాటులో ఉంటాయి.
వ్యాగన్ ఆర్ అనే మోడల్ చాలా మంచి రెస్పాన్స్ ఉన్న మోడల్. మోస్ట్ సేల్స్ జరిగే మోడల్ కూడా ఇది. ఇలాంటి హై డిమాండ్ ఉన్న మోడల్ పై మారుతీ కంపెనీ గరిష్టంగా రూ.41 వేల వరకు బెనిఫ్ట్ అందిస్తోంది. క్యాష్ డిస్కౌంట్స్ కింద రూ.15 వేలు, ఎక్స్ ఛేంజ్ బోనస్ రూ.20 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.6 వేలు అందిస్తోంది. సీఎన్జీ వేరియంట్ పై గరిష్టంగా రూ.36 వేలు బెనిఫిట్స్ ఉంటాయి. ఈ కారు స్పెసిఫికేషన్స్ చూస్తే.. ఇందులో మీకు 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మీకు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిషన్స్ అందుబాటులో ఉన్నాయి.
రోడ్డు మీద మీరు 10 కార్లు చూస్తే వాటిలో కనీసం రెండు నుంచి 3 కార్లు స్విఫ్ట్ అయి ఉంటాయి. అలాంటి హై డిమాండ్ మోడల్ పై కూడా మారుతీ కంపెనీ తగ్గింపులు అందిస్తోంది. మీరు స్విఫ్ట్ మోడల్ పై గరిష్టంగా రూ.37 వేల వరకు బెనిఫిట్స్ ని పొందచ్చు. క్యాష్ డిస్కౌంట్ 10 వేలు, ఎక్స్ ఛేంజ్ బోనస్ రూ.20 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.15 వేలుగా ఉంటుంది. సీఎన్జీ వేరియంట్ పై గరిష్టంగా రూ.22 వేల వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తోంది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిషన్స్ ఆప్షన్స్ ఉన్నాయి.
S-ప్రెసో మోడల్ కి మంచి సేల్స్ ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యలకు చాలా మంచి ఆన్సర్ అవుతుంది. చూడటానికి ఎంతో క్యూట్ గా ఉండే ఈ మోడల్ పెట్రోల్ వేరియంట్ పై గరిష్టంగా రూ.44 వేల వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నారు. సీఎన్జీ వేరియంట్ పై గరిష్టంగా రూ.39 వేల వరకు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. వీటిలో క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్స్ కూడా కలిపే ఉంటాయి. ఇంక ఈ S-ప్రెసో స్పెసిఫికేషన్స్ చూస్తే.. ఇది కూడా 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తోంది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిషన్స్ ఉంటాయి. ఈ కార్లపై మారుతీ కంపెనీ అందిస్తున్న డిస్కౌంట్స్, వాటి ధరలు, ఆన్ రౌడ్ ధరలు అన్నీ డీలర్, సిటీ, రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అందుకే సరైన వివరాల కోసం మీ దగ్గర్లోని మారుతీ కంపెనీ డీలర్ ను సంప్రదించండి.