iDreamPost
android-app
ios-app

మారుతి సుజుకి నుంచి మరో చౌకైన కారు.. 35KM మైలేజ్ తో!

Maruti Suzuki Planing To Launch Spacia Based Model In India: మారుతీ సుజుకీ మధ్యతరగతి వినియోగదారులకు మరో బడ్జెట్ ఫ్రెండ్లీ కాంపాక్ట్ ఎంపీవీ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ మోడల్ ఏది? ధర వివరాలు తెలుసుకుందాం.

Maruti Suzuki Planing To Launch Spacia Based Model In India: మారుతీ సుజుకీ మధ్యతరగతి వినియోగదారులకు మరో బడ్జెట్ ఫ్రెండ్లీ కాంపాక్ట్ ఎంపీవీ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ మోడల్ ఏది? ధర వివరాలు తెలుసుకుందాం.

మారుతి సుజుకి నుంచి మరో చౌకైన కారు.. 35KM మైలేజ్ తో!

ఇండియాలో మల్టీ పర్పస్ వెహికిల్(MPV)కి మంచి డిమాండ్‌ ఉంది. మధ్య తరగతి ప్రజలు వీటిని ఎక్కువగా కొంటూ ఉంటారు. అందువల్ల ఆటోమొబైల్ కంపెనీలు ఎక్కువగా ఈ ఎంపీవీలను అందుబాటులోకి తెస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ ఎంపీవీల అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి. ఎందుకంటే ఇవి ఎక్కువ స్పేస్‌ కలిగి, దాదాపు 7 మంది కూర్చొని సౌకర్యంగా ప్రయాణించేలా సీటింగ్‌ కెపాసిటీ కలిగి ఉంటాయి. అలాగే అప్డేటెడ్ ఫీచర్లతో ఎంపీవీలను పలు కంపెనీలు మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఈ కార్లలో ఫ్యామిలీతో టూర్లకు వెళ్లవచ్చు.అందువల్ల ఈ కార్లని కొనడానికి జనాలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో మారుతి ఎర్టిగా, రెనాల్ట్ ట్రైబర్ వంటి ఎంపీవి కార్లు తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి.

మారుతి సుజుకి ఎర్టిగా అయితే ప్రస్తుతం భారతదేశంలో ఎంపీవీ సెగ్మెంట్‌లో పాపులర్ కార్ గా ముందంజలో ఉంది. భారత మార్కెట్లో దీని ధర విషయానికి వస్తే … రూ .8.69 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై టాప్-ఎండ్ వేరియంట్ రూ .13.03 లక్షల (ఎక్స్-షోరూమ్) దాకా ఉంటుంది. అయితే తాజాగా మారుతి సుజుకి కంపెనీ కొత్త కాంపాక్ట్ ఎంపీవీని తీసుకురాబోతోంది. అది కూడా ఎర్టిగా కంటే తక్కువ ధరలో ఈ కార్ ని అందుబాటులోకి తీసుకురావడానికి మారుతి సన్నాహాలు చేస్తుంది. తక్కువ ధరకే వస్తుంది కాబట్టి ఈ ఎంపీవీపై అంచనాలు పెరిగిపోయాయి.ఇక ఈ కార్ ఎర్టిగా కంటే తక్కువ ధరలో లాంచ్ అయితే దేశంలోనే అత్యంత చౌకైన ఎంపీవీ అవుతుంది.

ప్రస్తుతం ఈ కారుకి ‘వైడీబీ’ అనే కోడ్ నేమ్ పెట్టారు. త్వరలోనే కంపెనీ ఈ కార్ పేరు గురించి వెల్లడించనుంది. ఇప్పటికే జపాన్‌ దేశంలో ఈ కారు స్పేసియా (Maruti Spacia) అనే పేరుతో అమ్మకానికి ఉంది. అయితే ఇండియాలో తక్కువ ధరలో ఈ కార్ లాంచ్ అవబోతుంది కాబట్టి జపనీస్ మోడల్‌ని పోలిన కొన్ని ఫీచర్లు ఇందులో ఉండవు. ఎందుకంటే ఆటోమొబైల్ కంపెనీలు ఆ దేశీయ మార్కెట్లకు అనుగుణంగా ధర ఆధారంగా డిజైన్, ఫీచర్లను అందిస్తున్నాయి. కానీ ఈ కార్ విషయానికి వస్తే.. డిజైన్‌లో మాత్రం రెండు చూడటానికి దాదాపు ఒకేలా ఉంటాయి. ఈ కార్ 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉంటుంది. ఇది 3 స్టెప్‌ సీటింగ్ ఆప్షన్‌తో రానుంది.అందువల్ల ఎక్కువ మంది ఇందులో కంఫర్ట్‌గా కూర్చోవచ్చు. ఈ కార్ స్ట్రాంగ్‌ హైబ్రిడ్ టెక్నాలజీతో 1.2-లీటర్ జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. హైబ్రిడ్ ఇంజిన్‌ కావడంతో మైలేజీ కూడా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది. ఈ కార్ లీటరుకు 35 కిలోమీటర్ల రేంజ్ లో మైలేజ్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు.మారుతి సుజుకి దీన్ని 2026లో ఇండియాలో లాంఛ్ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక త్వరలో రాబోయే ఈ కారుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.