Vinay Kola
Maruthi Swift: మారుతీ స్విఫ్ట్ కార్ కి ఆటోమొబైల్ మార్కెట్‌లో మామూలు క్రేజ్ లేదనే చెప్పాలి. స్విఫ్ట్ ఎన్నో ఏళ్లుగా మంచి అమ్మకాలని నమోదు చేస్తుంది.
Maruthi Swift: మారుతీ స్విఫ్ట్ కార్ కి ఆటోమొబైల్ మార్కెట్‌లో మామూలు క్రేజ్ లేదనే చెప్పాలి. స్విఫ్ట్ ఎన్నో ఏళ్లుగా మంచి అమ్మకాలని నమోదు చేస్తుంది.
Vinay Kola
మారుతీ స్విఫ్ట్ కార్ కి ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో మామూలు క్రేజ్ లేదనే చెప్పాలి. ప్రస్తుతం కేవలం పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లో మాత్రమే స్విఫ్ట్ సేల్ అవుతుంది. ఎన్నో ఏళ్లుగా మంచి అమ్మకాలని నమోదు చేస్తుంది. అయితే జనాలు ఇంకా అధిక మైలేజీ ఇచ్చే కార్లపై ఎక్కువ మొగ్గు చూపుతారు. అందులోనూ సీఎన్‌జీ వెర్షన్‌లు మాత్రం ఆలోచించకుండా కొనుగోలు చేస్తారు. ఇక అతి త్వరలో మారుతీ స్విఫ్ట్ సిఎన్జీ వేరియంట్ ని తీసుకు రాబోతుంది. అయితే ఇది కేవలం టాప్ వేరియంట్‌లో మాత్రమే వస్తున్నట్లు తెలుస్తుంది. అతి త్వరలో మార్కెట్‌లో అడుగుపెట్టనున్న సీఎన్‌జీ కారులో సూపర్ ఇంజిన్‌ని మారుతీ ప్రవేశపెట్టనుంది.
ప్రస్తుతం ఉన్న వేరియంట్‌తో పోల్చితే దీని ధర కొంచెం ఎక్కువగానే ఉంటుంది. రూ. 60,000 నుంచి రూ.90,000 దాకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ స్విఫ్ట్ సీఎన్‌జీని ప్రవేశపెట్టడం ద్వారా దేశవ్యాప్తంగా అమ్మకాలు పెరుగుతాయని మారుతీ భావిస్తోంది. అందులో భాగంగా ఇంకా సీఎన్‌జీ మోడళ్ల అమ్మకాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది మారుతీ. స్విఫ్ట్ ఇండియాలో విపరీతమైన ప్రజాదారణ పొందింది కాబట్టి ఈ మోడల్ ని ప్రవేశపెట్టాలని చూస్తుంది. మారుతి కంపెనీ కార్ల అమ్మకాల్లో సీఎన్‌జీ వాహనాల అమ్మకాలు కూడా బాగానే ఉన్నాయి. మారుతీ కార్లు బడ్జెట్ ధరలో ఉంటాయి. ఈ కంపెనీ సర్వీసెస్ కూడా బాగుంటాయి. పైగా ఈ కార్ల మైలేజ్ కూడా కూడా అదిరిపోతోంది. ఇక స్విఫ్ట్ సిఎన్‍జి వెర్షన్ కూడా ఏకంగా 31 కిలోమీటర్ల దాకా మైలేజీని ఇస్తుందని తెలుస్తుంది.
ఇక ప్రస్తుతం ఉన్న మారుతీ స్విఫ్ట్ పెట్రోల్ వెర్షన్ విషయానికి వస్తే.. దీని ధర 6.49 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. 9.10 లక్షల దాకా ఉంటుంది. ఇది మొత్తం 13 వేరియంట్లలో లభిస్తుంది. ఇది వైర్ లెస్ చార్జర్, కృయిజ్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేఇంకా అలాగే సుజుకి కనెక్ట్ టెలిమాటిక్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. అలాగే ఇందులో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇక ఈ ఫీచర్స్ రాబోయే సిఎన్‍జి వెర్షన్ లో కూడా ఉంటాయాని తెలుస్తుంది. ఇంకా ఇందులో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. దాంతో పాటుగా బూట్ లోపల 60-లీటర్ సిఎన్‍జి ట్యాంక్ అమర్చబడి ఉంటుంది. స్విఫ్ట్ సిఎన్‍జి దాదాపు 70 bhp ఇంకా 100Nm మాక్సిమం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ సిఎన్‍జి వెర్షన్ సెప్టెంబర్ 12న రాబోతుందని తెలుస్తుంది. మరి మారుతి సుజుకి ప్రవేశపెట్టబోతున్న ఈ స్విఫ్ట్ సిఎన్‍జిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.