iDreamPost
android-app
ios-app

Maruthi Suzuki: కార్ల ధరల్ని తగ్గించిన మారుతీ సుజుకి! కారణం ఏంటంటే?

  • Published Sep 02, 2024 | 1:58 PM Updated Updated Sep 02, 2024 | 1:58 PM

Maruthi Suzuki: మారుతీ సుజుకీ తన కార్లతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ ధరలో కార్లని ప్రవేశపెడుతూ ప్రజాదరణ పొందుతుంది. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

Maruthi Suzuki: మారుతీ సుజుకీ తన కార్లతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ ధరలో కార్లని ప్రవేశపెడుతూ ప్రజాదరణ పొందుతుంది. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

Maruthi Suzuki: కార్ల ధరల్ని తగ్గించిన మారుతీ సుజుకి! కారణం ఏంటంటే?

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతీ సుజుకీ తన కార్లతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ ధరలో మంచి కార్లని ప్రవేశపెడుతూ ప్రజాదరణ పొందుతుంది. తాజాగా ఈ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. తన కార్ల వేరియంట్లపై ధరల్ని తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా తన మారుతీ సుజుకీ ఆల్టో k10, మారుతీ సుజుకీ ఎస్- ప్రెస్సో కార్లపై ధర్లని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 2న మారుతీ సుజుకి స్టాక్ ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చింది. ఈ రోజు నుంచే తన నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది. మరి మారుతి వాహనం సుజుకి ఎంతవరకు ధరలు తగ్గించింది? మారుతీ సుజుకీ ధరల తగ్గింపు వెనుక ఉన్నకారణాలు ఏంటి? అందుకు సంబంధించిన పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అసలు మారుతీ సుజుకి ఎందుకు రేట్లు తగ్గించిందంటే.. గడిచిన ఆగస్టు నెలలో మారుతీ సుజుకీ సేల్స్ పడిపోయాయి. టోకు విక్రయాలు తగ్గిపోయాయి. ఆగష్టు ముందు మారుతీ సుజుకీ మొత్తం 1,89,082 వాహనాలని సేల్ చేసింది. కానీ ఇప్పుడు సుమారు 4 శాతం తగ్గిపోయాయి. దాంతో అమ్మకాల సంఖ్య 1,81,782 కు పడిపోయింది. దీంట్లో ఇండియాలో జరిగిన సేల్స్ విషయానికి వస్తే మొత్తం 1,56,114 యూనిట్లలో 8 శాతం పతనం కనిపించింది. దాంతో కార్ల అమ్మకాల సంఖ్య 1,43,075 కు పరిమితమైంది. చిన్నకార్ల అమ్మకాల విషయానికి వస్తే.. ఆల్టో, ఎస్- ప్రెస్సో అమ్మకాలు 12,209 నుంచి 10,648 కి పడిపోయాయి.

ఇప్పుడు మారుతీ సుజుకీ సేల్స్ భారీగా తగ్గిపోయాయి. అయితే సేల్స్ భారీగా తగ్గినా కేవలం చిన్న కార్లయిన మారుతీ ఆల్టో, ఎస్ ప్రెస్సో వేరియంట్ల ధరల్ని మాత్రమే తగ్గించింది. మారుతీ సుజుకీ నుంచి వచ్చిన ఎస్- ప్రెస్సో మంచి ఆదరణ పొందింది. ఈ కార్ LXI పెట్రోల్ వేరియంట్‌పై రూ. 2000 ధర తగ్గింది. ఇక బడ్జెట్ ధరలో బెస్ట్ కార్ గా మారుతీ సుజుకీ ఆల్టో కె 10 గుర్తింపు తెచ్చుకుంది. కంపెనీ ఈ కార్ VXI పెట్రోల్ వేరియంట్‌పై రూ. 6500 తగ్గించినట్లు తెలిపింది. ఇలా ఆగష్టులో వచ్చిన నష్టాల కారణంగా తన కార్లని మారుతీ సుజుకి తగ్గించింది. మరి మారుతీ సుజుకి ఇలా తన కార్ల ధరల్ని తగ్గించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.