iDreamPost
android-app
ios-app

దేశంలో అతిపెద్ద లులు షాపింగ్ మాల్.. ఏకంగా రూ.4వేల కోట్లతో..ఎక్కడంటే?

  • Published Sep 09, 2024 | 10:22 AM Updated Updated Sep 09, 2024 | 10:22 AM

దేశంలో ఎన్ని బ్రాండెడ్ షాపింగ్ మాల్స్  అందుబాటులో ఉన్న సరే.. లులు మాల్ కు ఉన్న డిమాండ్ వేరు. ఇప్పటికే ఈ లులు మాల్ దేశంలోని పలు నగరాల్లో లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా లులు గ్రూప్ సంస్థ ఓ కీలక ప్రకటన చేసింది. ఇంతకీ అదేమిటంటే..

దేశంలో ఎన్ని బ్రాండెడ్ షాపింగ్ మాల్స్  అందుబాటులో ఉన్న సరే.. లులు మాల్ కు ఉన్న డిమాండ్ వేరు. ఇప్పటికే ఈ లులు మాల్ దేశంలోని పలు నగరాల్లో లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా లులు గ్రూప్ సంస్థ ఓ కీలక ప్రకటన చేసింది. ఇంతకీ అదేమిటంటే..

  • Published Sep 09, 2024 | 10:22 AMUpdated Sep 09, 2024 | 10:22 AM
దేశంలో అతిపెద్ద లులు షాపింగ్ మాల్.. ఏకంగా రూ.4వేల కోట్లతో..ఎక్కడంటే?

ప్రస్తుతం షాపింగ్ మాల్స్ డిమాండ్స్ మాములుగా లేదు. ఇక అందుకు తగ్గట్టుగానే.. దేశంలో పలు ప్రాంతాల్లోని  మాల్స్ సంఖ్య క్రమేపి పెరిగిపోతున్నాయి. పైగా ప్రజలు కూడా నిత్యవసర సరుకుల దగ్గర దగ్గర నుంచి ఎలక్ట్రికల్ వస్తువులు వరకు ప్రతిది డిమార్ట్స్, షాపింగ్ మాల్స్ లోనే కొనుగోనులు చేస్తున్నారు. దీంతో ఇప్పుడంతా మాల్స్ ట్రెండ్ కొనసాగుతుంది. ఇదిలా ఉంటే..  దేశంలో ఎన్ని బ్రాండెడ్ షాపింగ్ మాల్స్  అందుబాటులో ఉన్న సరే.. లులు మాల్ కు ఉన్న డిమాండ్ వేరు. ఇప్పటికే ఈ లులు మాల్ దేశంలోని పలు నగరాల్లో లాంఛ్ చేశారు.

అలాగే గతేడాది చివరిలో హైదరాబాద్ నగరంలో కూడా ఈ లులు మాల్ ను ప్రాంరంభించిన విషయం తెలిసిందే. ఇక దీని విలువ రూ.300 కోట్లుగా ఉంటుంది. ఇక ఈ షాపింగ్ మాల్ లో అంతర్జాతీయ స్థాయి షాపింగ్ అనుభవాల్ని పొందుతున్నారని చెప్పొచ్చు. పైగా ఈ షాపింగ్ మాల్ 2 వేల మంది వరకు ఉపాధి కూడా కల్పించింది. అయితే ఇలాంటివి  ఇప్పటికే కొచ్చి, బెంగళూరు, కోయంబత్తూరు, లక్నో, తిరువనంతపురం, హైదరాబాద్‌తో కలిపి 6 షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే లులు గ్రూప్ సంస్థ ఓ కీలక ప్రకటన చేసింది. ఇంతకీ అదేమిటంటే..

లులు గ్రూప్ సంస్థ రూ. 4 వేల కోట్ల వ్యయంతో దేశంలో అతి పెద్ద షాపింగ్ మాల్ ను నిర్మించనున్నట్లు గతేడాది ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ విషయంపై ఇప్పుడు లులు గ్రూప్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఏ యూసుఫ్ అలీ స్పందించారు. అలాగే భారత్‌లో పెట్టుబడులు పెట్టడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ మాల్ ను  గుజరాత్ అహ్మదాబాద్‌లో..  నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నమని, ఈ ఏడాది చివరిలో పనులు ప్రారంభం అవుతాయని ప్రకటించారు.  ఇక ఈ మాల్ ప్రారంభంపై కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని మంత్రిత్వ శాఖల నుంచి తమకు పూర్తి మద్దతు లభిస్తుందని తెలిపారు.

అయితే ఈ మాల్ ప్రారంభమైతే.. 3 వేల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తుందని యూసుఫ్ ఆనందం వ్యక్తం చేశారు. ఇకపోతే అహ్మదాబాద్ లో ప్రారంభిచబోతున్న ఈ మాల్ సుమారు 3,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తామని తెలిపారు. దీంతో పాటు చెన్నైలో కూడా మరొక అతి పెద్ద మాల్ ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మరీ, అహ్మదాబాద్ లో భారీ బడ్జెట్ వ్యయంతో  అతిపెద్ద షాపింగ్ మాల్ ప్రారంభించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.